Suriya: ఆ విషయంలో కార్తిపై అసూయగా ఉంది: బిగ్‍బాస్‍లో తమిళ స్టార్ హీరో సూర్య

Best Web Hosting Provider In India 2024

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ కంగువ నవంబర్ 14వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. తెలుగులోనూ గట్టిగానే ప్రమోషన్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍కు హీరో సూర్య, కంగువ డైరెక్టర్ శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా వచ్చారు. నాగార్జునతో సూర్య కొన్ని విషయాలు పంచుకున్నారు. కంటెస్టెంట్లతోనూ మాట్లాడారు.

కార్తిపై అసూయ

తెలుగు మాట్లాడే విషయంలో తన తమ్ముడు, హీరో కార్తి అంటే తనకు అసూయ ఉందని సూర్య చెప్పారు. కార్తి తెలుగులో చాలా స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడగలరు. సూర్య తెలుగు అర్థం చేసుకున్నా.. మాట్లాడటంలో తడబడతారు. అందుకే తెలుగు విషయంలో కార్తిపై ఈర్ష్య ఉందంటూ సూర్య సరదగా అన్నారు.

క్లాస్‍లో కార్తి ఫస్ట్ బెంచర్‌లాంటి వాడని సూర్య చెప్పారు. “కార్తి విషయంలో నేను అసూయతో ఉన్నా. అతడు తెలుగు బాగా మాట్లాడతాడు. డ్రైవర్లతో, స్టాఫ్‍తో తెలుగులో మాట్లాడతానని తాను చెబుతాడు. అయితే, కోయాక్టర్లతోనూ అతడు మాట్లాడతాడు” అని సూర్య అన్నారు. బిగ్‍బాస్‍కు వచ్చి తన మూవీ పాటను కార్తి పూర్తిగా పాడాడని నాగార్జున గుర్తు చేసుకున్నారు. “కార్తి చాలా పాటలు పాడతారు. మీవి, చిరంజీవివి.. ఏ పాటైనా పాడేస్తారు” అని సూర్య చెప్పారు.

సూర్య అద్భుతమైన నటుడు

సినిమాలను కార్తి చాలా ప్రేమిస్తాడని సూర్య చెప్పారు. “కార్తి ఫస్ట్ బెంచర్. నేను లాస్ట్ బెంచర్. యావరేజ్ స్టూడెంట్. జస్ట్ పాస్ స్టూడెంట్” అంటూ సూర్య చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున మధ్యలో కల్పించుకున్నారు. సూర్య అలాగే చెబుతారని, కానీ ఆయన ఓ అద్భుతమైన నటుడు అని నాగార్జున అన్నారు. భారతీయ సినిమాలోనే ఒకానొక బెస్ట్ యాక్టర్ అని ప్రశంసించారు. తాము ఎప్పుడు వచ్చిన గొప్పగా మాట్లాడతారని నాగార్జునతో సూర్య అన్నారు.

నాగార్జునలా జీవించాలని తాము అందరం అనుకుంటామని సూర్య అన్నారు. నటుడిగా మీ కెరీరే కాకుండా.. ఓ వ్యక్తిగా కూడా తమ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు. కాగా, గతంలో నాగార్జున, కార్తి కలిసి ఊపిరి చిత్రం చేశారు. ఇటీవల సత్యం సుందరం ప్రమోషన్ల కోసం బిగ్‍బాస్‍కు కార్తి కూడా వచ్చారు. ఆ మూవీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు నాగార్జున.

కంగువ సినిమా ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. తమిళ ఇండస్ట్రీలో ల్యాండ్‍మార్క్ చిత్రంలా ఉంటుందని మూవీ టీమ్ నమ్మకంతో చెబుతోంది. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్‍గా నటించారు. బాబీ డియోల్, జగపతి బాబు, నటరాజన్ సుబ్రమణియం, రెడిన్ కింగ్‍క్లే, యోగిబాబు కీరోల్స్ చేశారు.

కంగువ మూవీని ప్రపంచవ్యాప్తంగా 3,500 థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. నవంబర్ 14వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కంగువ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూజ్ చేశారు, యూవీ క్రియేషన్స్ కూడా నిర్మాణంలో భాగమైంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024