Hair Straightening: జుట్టును స్ట్రెయిటెనింగ్ చేసే హెయిర్ ప్యాక్, స్ట్రెయిటెనర్ అక్కర్లేదు

Best Web Hosting Provider In India 2024

వేడుకలకు, పండగలకు రెడీ అవ్వడంలో ఉన్న ఆనందమే వేరు. అయితే పూర్తి లుక్ మంచి హెయిర్ స్టైల్ మార్చేయగలదు. జుట్టు ఎంత బాగుంటే అంత అందంగా కనిపించొచ్చు. అందుకే చాలా మంది ట్రెండీగా కనిపించాలని హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించాలి అనుకుంటారు. దానికోసమని బ్యూటీ పార్లర్ వెళ్లడం లేదా ఇంట్లోనే వేడి ఉండే స్ట్రెయిటెనర్ వాడటం చేస్తారు. వీటికోసం వాడే రసాయనాలున్న క్రీముల వల్ల జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. క్రమంగా నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే అవేమీ అక్కర్లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక హెయిర్ ప్యాక్ వేసుకున్నారంటే జుట్టు సహజంగానే కర్లీగా కాకుండా నిటారుగా మారుతుంది.

జుట్టు నిటారుగా మార్చే హెయిర్ ప్యాక్:

వేడి ఏమీ వాడకుండా జుట్టు నిటారుగా ఉండాలంటే హెయిర్ మాస్క్ అప్లై చేయొచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని బాగా ఉడకబెట్టి దాన్ని చల్లార్చి మిక్సీ పట్టి పేస్ట్ తయారు చేయండి. తర్వాత అందులో గుడ్డులోని తెల్లసొన మాత్రమే వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులోనే ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వేసి మరోసారి కలపాలి. ఈ ప్యాక్ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా అంతా అంటుకునేలా రాసుకోండి. కనీసం అరగంట నుంచి గంటసేపు అలాగే ఉంచుకోండి. అయితే ఈ ప్యాక్ రాసుకునేముందు తప్పకుండా ముందు తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇలా తీసేయండి:

మీ జుట్టును స్ట్రెయిటెనింగ్ చేసే ఈ ప్యాక్ పూర్తి ఫలితాలు దక్కాలంటే కొన్ని చిన్న పనులు తప్పక చేయాలి. మీ దగ్గర మైక్రోఫైబర్ టవెల్, వెడల్పాటి పళ్లున్న దువ్వెన తప్పక ఉంచుకోండి. ఇప్పుడు జుట్టుకు గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేయండి. తర్వాత కండీషనర్ రాసుకొని శుభ్రం చేసుకోండి. స్నానం అయ్యాక జుట్టు తుడవటానికి మైక్రో ఫైబర్ టవెల్ వాడండి. ఇది నీరు చాలా సులభంగా పీల్చుకుంటుంది. మామూలు టవెల్ వాడితే జుట్టు మెలితిప్పితే కానీ నీరు వదలదు. దాంతో జుట్టు మళ్లీ కర్లీగా అయిపోతుంది. మైక్రో ఫైబర్ టవెల్ వాడితే జుట్టు అలా పైనుంచి కింది దాకా నొక్కితే సరిపోతుంది. తర్వాత వెడల్పాటి దంతాలున్న దువ్వెనతో పైనుంచి కింది దాకా సరిగ్గా దువ్వండి. జుట్టు ఆరిన తర్వాత స్ట్రెయిట్‌గా అయిపోతుంది చూడండి.

కలబంద

కలబంద జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ జుట్టును మృదువుగా, సిల్కీగా ఉంచడానికి సహాయపడుతుంది. కలబంద జుట్టుకు అప్లై చస్తే అది జుట్టుకు కావాల్సిన తేమను అందించి నిర్జీవంగా ఉన్న జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది. దాంతో జుట్టు ఆరోగ్యంగా మారడంతో పాటే కర్లీగా ఉండదు. దీనికోసం అరకప్పు వేడి చేసిన గోరువెచ్చని కొబ్బరి నూనెలో, అరకప్పు కలబంద గుజ్జు లేదా అలోవెరా జెల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. 30-40 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. తర్వాత తుడుచుకుంటే మార్పు మీకే తెలుస్తుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024