Trivikram Srinivas: లక్కీ భాస్కర్ ఈవెంట్ నేడే.. అల్లు అర్జున్‍తో మూవీ గురించి త్రివిక్రమ్ ఏమైనా చెబుతారా?

Best Web Hosting Provider In India 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ మూవీ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ ఈ మూవీ ఏడాది డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ తదుపరి స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో మూవీ చేయనున్నారు. ఈ సినిమా గ్రాండ్ స్కేల్‍లో ఉంటుందంటూ నిర్మాత నాగవంశీ ఇటీవల కొన్ని కామెంట్లు చేశారు. దీంతో ఆసక్తి మరంత పెరిగిపోయింది. ఈ తరుణంలో నేడు (అక్టోబర్ 27) లక్కీ భాస్కర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు త్రివిక్రమ్ హాజరుకానున్నారు.

ఈవెంట్ టైమ్, వేదిక

లక్కీ భాస్కర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 27) సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. హైదరాబాద్‍లోని ఫిల్మ్ నగర్ జేఆర్‌సీ కన్వెన్షన్‍లో ఈ ఈవెంట్ జరగనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ ఈవెంట్‍కు గెస్ట్‌గా రానున్నారు.

అల్లు అర్జున్‍తో మూవీ గురించి!

లక్కీ భాస్కర్ ఈవెంట్‍లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ కోసం అల్లు అర్జున్ అభిమానులు వేచిచూస్తున్నారు. బన్నీతో చేసే మూవీ గురించి త్రివిక్రమ్ ఏమైనా చెబుతారా అని ఆసక్తితో ఉన్నారు. పుష్ప 2 మూవీ షూటింగ్ దాదాపు ఫినిషింగ్‍కు వచ్చేసింది. అల్లు అర్జున్‍తో మూవీ స్క్రిప్ట్ పనులపై త్రివిక్రమ్ కొంతకాలంగా ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఈ ఈవెంట్‍లో ఏమైనా అప్‍డేట్ ఇస్తారా.. లేకపోతే తర్వాత అంటూ సరిపెడతారా అనేది చూడాలి.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ ఇటీవల హైప్ పెంచేశారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా టచ్ చేయని జానర్‌లో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చూపించని ప్రపంచాన్ని ఈ చిత్రంలో చూపిస్తామని తెలిపారు. పుష్ప 2 పూర్తయ్యాక.. ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలు వెల్లడిస్తామని నాగవంశీ అన్నారు. దీంతో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‍లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. వీరి కాంబోలో జులాయ్ (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015), అల వైకుంఠపురములో (2020) చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ చిత్రాలను హారిక, హాసినీ క్రియేషన్స్ ప్రొడ్యూజ్ చేసింది. ఈ నాలుగో మూవీని కూడా ఆ బ్యానరే నిర్మించనుంది. భారీ బడ్జెట్‍తో గ్రాండ్ స్కేల్‍లో ఈ మూవీని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

లక్కీ భాస్కర్ గురించి..

లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. బ్యాంకు ఉద్యోగి కోటీశ్వరుడిగా ఎలా మారాడన్న అంశం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, అక్టోబర్ 30న ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలు నిర్మించాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024