Gunde Ninda Gudi Gantalu: తండ్రి కోసం బాలు క‌న్నీళ్లు-ఇంటి ప‌త్రాలు మాయం చేసిన మ‌నోజ్ -ర‌వి డ‌బ్బు వ‌ద్ద‌న్న‌ ప్ర‌భావ‌తి

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu: సాయంత్రం లోపు స‌త్యానికి ఆప‌రేష‌న్ చేయాల‌ని డాక్ట‌ర్లు డెడ్‌లైన్ పెడ‌తారు. డ‌బ్బు కోసం ప్ర‌భావ‌తి అంద‌రిని అడుగుతుంది. కానీ ఎవ‌రూ సాయం చేయ‌డానికి ముందుకు రారు. ఇంటి డాక్యుమెంట్స్ తాక‌ట్టు పెట్టి అప్పు తీసుకొస్తాన‌ని బాలు ఇంటికి వెళ‌తాడు. కానీ ఇంటి డాక్యుమెంట్స్ క‌నిపించ‌వు. కోపంగా హాస్పిట‌ల్‌కు వ‌స్తాడు.

మ‌నోజ్‌పై అనుమానం…

ఇంటి ప‌త్రాల‌ను మ‌నోజ్ దొంగ‌త‌నం చేశాడ‌ని బాలు అనుమాన‌ప‌డ‌తాడు. అత‌డిని నిల‌దీస్తాడు. ఇంటి ప‌త్రాల‌ను నాన్న నీ భార్య‌కు ఇస్తే న‌న్ను అడుగుతావేంటి అని బాలుపై మ‌నోజ్ ఫైర్ అవుతాడు. న‌ల‌భై ల‌క్ష‌లు ప‌ట్టుకొని పారిపోయినోడివి…ఇంటి ప‌త్రాలు ఎత్తుకుపోలేద‌ని గ్యారెంటీ ఏంటి? ఇంట్లో జ‌రిగే ప్ర‌తి త‌ప్పుకు మూల కార‌ణం నువ్వే అని మ‌నోజ్ కాల‌ర్ ప‌ట్టుకుంటాడు బాలు. ఇద్ద‌రు హాస్పిట‌ల్‌లోనే గొడ‌వ ప‌డ‌తారు.

భ‌ర్త‌కు రోహిణి స‌పోర్ట్‌…

మీనానే డాక్యుమెంట్స్ ఎక్క‌డో పెట్టి ఉంటుంద‌ని, ఆమెకు ఫోన్ చేసి క‌నుక్కోమ‌ని బాలుకు రంగా మావ‌య్య స‌ల‌హా ఇస్తాడు. ప్ర‌తిసారి మ‌నోజ్‌తో గొడ‌వ‌ప‌డ‌టానికి నీకు కార‌ణం కావాలా అంటూ భ‌ర్త‌కు రోహిణి స‌పోర్ట్‌చేస్తుంది. నా జోలికి వ‌స్తే చంపేస్తాన‌ని మ‌నోజ్ కూడా బాలుకు వార్నింగ్ ఇస్తాడు. ఇంటి డాక్యుమెంట్స్ తీయాల్సిన అవ‌స‌రం నా భ‌ర్త‌కు లేద‌ని రోహిణి అంటుంది. అయితే నువ్వే తీసి ఉంటావ‌ని రోహిణితో అంటాడు బాలు. ఇది వ‌ర‌కు ఓ సారి మాకు తెలియ‌కుండా నువ్వే వాటిని తాక‌ట్టు పెట్టావ‌ని రోహిణితో బాలు గొడ‌వ‌ప‌డ‌తాడు.

మీనా కోసం వెతికిన బాలు…

మీనా ద‌గ్గ‌ర‌కు వెళ్లి డాక్యుమెంట్స్ ఎక్క‌డ పెట్టిందో క‌నుక్కొమ‌ని కొడుకుతో అంటుంది ప్ర‌భావ‌తి. డాక్యుమెంట్స్ తాక‌ట్టు పెట్టి వెంట‌నే డ‌బ్బు తీసుకుర‌మ్మ‌ని…మీ నాన్న‌కు ఏద‌న్నా అయితే ఎవ‌రిని క్ష‌మించ‌న‌ని బాలును కోప‌గించుకుంటుంది. మీనా కోసం ఆమె ఇంటికొస్తాడు బాలు. కానీ ఇంటికి తాళం వేసి ఉంటుంది. గుడికి వెళితే అక్క‌డ క‌నిపించ‌దు. మీనా క‌నిపించ‌క‌పోవ‌డంతో బాలు టెన్ష‌న్ ప‌డ‌తాడు.

కాల‌మే ప‌రీక్షిస్తుంది…

మీనా జాత‌కం చూపించేందుకు జ్యోతిష్యురాలిద‌గ్గ‌ర‌కు ఆమెను తీసుకొస్తుంది త‌ల్లి. నాకు ఎన్ని క‌ష్టాలు వ‌చ్చిన భ‌రిస్తాను కానీ…నా తండ్రిలాంటి మావ‌య్య‌కు ఏం జ‌ర‌గ‌కూడ‌ద‌ని జ్యోతిష్యురాలితో అంటుంది మీనా. ఆయ‌న కోలుకుంటారు అందులో సందేహం లేద‌ని జ్యోతిష్యురాలు చెబుతుంది. నీ వ‌ల్ల ఎవ‌రికైనా మంచే జ‌రుగుతుంద‌ని, కాల‌మే నిన్ను ప‌రీక్షిస్తుంద‌ని అంటుంది. ధైర్యంగా ఉండ‌మ‌ని అంటుంది. ఓ కంక‌ణం ఇస్తుంది జ్యోతిష్యురాలు. ఇది మీ మావ‌య్య చేతికి క‌డితే ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యవంతుడ‌వుతాడ‌ని చెబుతుంది.

తిట్టిన‌…కొట్టిన భ‌రిస్తాను…

ఆ కంక‌ణం మావ‌య్య చేతికి ఎలా క‌డ‌తావు అని మీనాను సుమ‌తి అడుగుతుంది. వాళ్లు నిన్ను హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌డం లేదు క‌దా అని అంటుంది. ఆ దేవుడే నాకు ఏదో దారి చూపిస్తాడ‌ని మీనా అంటుంది. బాలు కొట్టిన‌, తిట్టిన ప‌ట్టించుకోన‌ని, ఎన్ని క‌ష్టాలు ప‌డైనా మావ‌య్య చేతికి కంక‌ణం క‌ట్టి తీరుతాన‌ని హాస్పిట‌ల్‌కు మీనా బ‌య‌లుదేరుతుంది.

మార్వాడీ సేట్‌ను బ‌తిమిలాడిన బాలు…

మీనా క‌నిపించ‌క‌పోవ‌డంతో డైరెక్ట్‌గా మార్వాడీ సేట్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు బాలు. అర్జెంట్‌గా నాలుగు ల‌క్ష‌లు కావాల‌ని అంటాడు.కానీ నువ్వు ఇదివ‌ర‌కే తీసుకున్న డ‌బ్బుకు వ‌డ్డీతో పాటు కారుకు రెంట్ కూడా క‌ట్ట‌లేద‌ని వాటి సంగ‌తి ముందు చెప్ప‌మ‌ని సేట్ అంటాడు. ఇంటి ప‌త్రాలు ఇస్తే త‌ప్ప‌కుండా నాలుగు ల‌క్ష‌లు ఇస్తాన‌ని సేట్ చెబుతాడు. ఆ ప‌త్రాలు క‌నిపించ‌డం లేద‌ని, ఆ త‌ర్వాత తెచ్చిస్తాన‌ని బాలు ఎంత చెప్పిన మార్వాడీ సేట్ విన‌డు. డ‌బ్బు కోసం సేట్ కాళ్లు ప‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు బాలు. బాలు క‌థ విని సేట్ మాత్రం క‌రిగిపోడు.

సేట్‌ను కొట్ట‌బోయిన బాలు…

ఒక‌వేళ నేను డ‌బ్బు ఇస్తే మీ నాన్న ఆప‌రేష‌న్ స‌క్సెస్ కాక‌పోతే ఆ డ‌బ్బును తిరిగి ఎవ‌రిస్తారు? గ్యారెంటీ ఏంటి అని బాలును సేట్ అడుగుతాడు. సేట్ మాట‌ల‌తో బాలు కోపం కంట్రోల్ చేసుకోలేక‌పోతాడు. మా నాన్న బ‌త‌క‌డ‌ని ఇంకోసారి అంటే ఊరుకోన‌ని సేట్‌ను కొట్ట‌డానికి వ‌స్తాడు. సేట్ మ‌నుషులు బాలును ఆపేసి బ‌య‌ట‌కు పంపిస్తారు. త‌న‌ను కొట్ట‌డానికి వ‌చ్చిన బాలు ఎక్క‌డ దెబ్బ‌కొట్టాలో అక్క‌డ కొడ‌తాన‌ని సేట్ అంటాడు.

బాలు ఎమోష‌న‌ల్‌…

నాన్న‌ను కాపాడుకునే దారులు మొత్తం మూసుకుపోవ‌డంలో బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు. వినాయ‌కుడి విగ్ర‌హం ముందుకొచ్చి క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. మా నాన్న‌ను కాపాడే దారి చూపించ‌మ‌ని వేడుకుంటాడు.బాలు కారు కొన‌డానికి ఓ బేరం వ‌స్తుంది. మూడు ల‌క్ష‌ల‌కు కొంటాన‌ని ఓ వ్య‌క్తివ‌స్తాడు.

మౌనిక‌కు ర‌వి ఫోన్ కాల్‌…

త‌న కుటుంబ స‌భ్యుల యోగ‌క్షేమాలు తెలుసుకోవ‌డానికి మౌనిక‌కు ఫోన్‌చేస్తాడు బాలు. కానీ హాస్పిట‌ల్‌లో ఉన్న మౌనిక ఫోన్ క‌ట్ చేస్తుంది. ప‌దే ప‌దే ఫోన్ చేయ‌డంతో చివ‌ర‌కు లిఫ్ట్ చేస్తుంది. నేను ఏం నేరం చేశాన‌ని న‌న్ను అంద‌రూ దూరం పెడుతున్నార‌ని ర‌వి ఎమోష‌న‌ల్ అవుతాడు. నాతో ఎవ‌రూ మాట్లాడ‌టం లేద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

ర‌విని వెళ్ల‌గొట్టిన మ‌నోజ్‌…

తండ్రికి హార్ట్ ఎటాక్ వ‌చ్చిన సంగ‌తి మౌనిక ద్వారా తెలుసుకొని ర‌వి హాస్పిట‌ల్‌కు వ‌స్తాడు. తండ్రి ఆప‌రేష‌న్‌కు అయ్యే డ‌బ్బు తాను క‌డ‌తాన‌ని అంటాడు. ర‌వి ఎంత చెప్పిన విన‌కుండాఅత‌డిని హాస్పిట‌ల్ నుంచి గెంటేస్తాడు మ‌నోజ్‌. కారు అమ్మి మూడు ల‌క్ష‌లు స‌ర్దుతాడు బాలు. ఇంకో రెండు ల‌క్ష‌లు అవ‌స‌రం ప‌డ‌టంతో భ‌ర్త కోసం త‌న ఒంటిపై ఉన్న బంగారం తాక‌ట్టు పెడ‌తాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది. అక్క‌డితో నేటి గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024