Best Web Hosting Provider In India 2024
Bengaluru news: ఈ సారి దీపావళి పండుగతో వీకెండ్ కూడా కలిసి రావడంతో ప్రయాణాల సంఖ్య పెరిగింది. దాంతో, బెంగళూరులో బుధవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ జామ్స్ ప్రారంభమయ్యాయి. మరోవైపు, భారీ వర్షం కురవడంతో హోసూరు రోడ్డులో బుధవారం సాయంత్రం ఎలక్ట్రానిక్ సిటీ వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో పాటు భారీ వర్షం కూడా అస్తవ్యస్తంగా మారింది.
బెంగళూరులో ట్రాఫిక్ జామ్
దీపావళి పండుగ నేపథ్యంలో చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇదే ట్రాఫిక్ కు ప్రధాన కారణంగా నిలుస్తోంది. మరోవైపు, హోల్ సేల్ దుకాణాల నుంచి చాలా మంది టపాసులు కొనుగోలు చేయడానికి హోసూరు రోడ్డుకు వెళ్తుంటారు. అది కూడా ట్రాఫిక్ జామ్ లకు కారణమవుతోంది. బుధవారం సాయంత్రం గంటల తరబడి ఈ ట్రాఫిక్ గందరగోళం కొనసాగిందని సోషల్ మీడియా (social media) యూజర్లు ఫిర్యాదు చేశారు.
లాంగ్ వీకెండ్ ప్రారంభం
బెంగళూరు వాసులకు, ముఖ్యంగా ఐటీ తదితర రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇది లాంగ్ వీకెండ్. గురువారం దీపావళి (deepavali), శుక్రవారం కన్నడ రాజోత్సవ సందర్భంగా సెలవులు ఉంటాయి. శని, ఆదివారాలు రెగ్యులర్ వీకెండ్. దాంతో, ఈ నాలుగు రోజుల సెలవులను ఎంజాయ్ చేయడానికి బెంగళూరు (bengaluru) వాసులు ప్లాన్ చేస్తున్నారు. ‘‘లాంగ్ వీకెండ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. చందాపుర జంక్షన్ నుంచి హోసూరు వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది’’ అని ఒక యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘వీఐపీల రాకపోకల కారణంగా 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది’ అని మరో యూజర్ ఫిర్యాదు చేశారు. హోసూరు వైపు ఎలక్ట్రానిక్ సిటీ వీరసంద్ర సిగ్నల్ వద్ద వీఐపీ రాకపోకలకు ట్రాఫిక్ (traffic) అడ్డంకి ఏర్పడిందని వినయ్ అనే యూజర్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పలువురు వీఐపీలు హాజరయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
వైట్ ఫీల్డ్ లో కూడా
ఇదిలావుండగా, వైట్ ఫీల్డ్ ప్రాంతంలో కూడా బుధవారం సాయంత్రం పనివేళల తర్వాత గణనీయమైన ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం సాయంత్రం వైట్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం, దీపావళి రద్దీతో ట్రాఫిక్ పెరిగిందని, ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో తక్షణ సహాయం కోసం 112 కు కాల్ చేయాలని సూచించారు.
Best Web Hosting Provider In India 2024
Source link