Best Web Hosting Provider In India 2024
ఇంట్లో నారింజ పండ్లు ఉంటే చాలు, దాని రసాన్ని తీసి నారింజ హల్వాను ప్రయత్నించండి. దీన్ని దీపావళి పూజలో ప్రసాదంగా నివేదించవచ్చు. లక్ష్మీదేవికి ఏదైనా స్వీట్ కచ్చితంగా సమర్పించాలని నియమం ఉంది. కాబట్టి మీరు నారింజ హల్వాను చేయడం వల్ల మీకు పని కూడా చాలా సులభంగా మారుతుంది. నారింజ హల్వా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
నారింజ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
నారింజలు – నాలుగు
కార్న్ ఫ్లోర్ – అరకప్పు
ఫుడ్ కలరు – చిటికెడు
నట్స్ – గుప్పెడు
పంచదార – ఒక కప్పు
దాల్చిన చెక్క పొడి – చిటికెడు
నారింజ హల్వా రెసిపీ
1. నారింజల నుంచి జ్యూస్‌ను తీసి వేరు చేయాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో ఈ నారింజ జ్యూస్‌ను, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.
3. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు, పంచదార వేసి పాకం తీయాలి.
4. ఆ పంచదార పాకంలోనే నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
5. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉంచి ముందుగా రెడీ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి.
6. ఇది దగ్గరగా అయ్యేవరకు అలా కలుపుతూనే ఉండాలి.
7. ఇది దగ్గరగా హల్వాలాగా అయ్యాక ఒక ప్లేటుకు నెయ్యిని రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని అందులో వేసి ప్లేటంతా పరచాలి.
8. పైన జీడిపప్పు, బాదం, పిస్తా తరుగును చల్లుకోవాలి.
9. ఆ తర్వాత చల్లారాక దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
10. అంతే నారింజ జ్యూస్ తో చేసే హల్వా రెడీ అయినట్టే. ఇది నోరూరేలా ఉంటుంది.
నారింజ జ్యూస్‌తో చేసే హల్వాలో మీకు ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ కలర్ వేయడం వల్ల డార్క్ ఆరెంజ్ రంగు ఈ స్వీట్ కి వస్తుంది. లేకపోతే కాస్త పసుపు రంగులోనే ఉంటుంది. ఇలా చేసిన ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు చేసి చూడండి. దీని రుచి మీకే తెలుస్తుంది. నారింజ జ్యూసుతో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఈ స్వీట్లు తినడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు. అయితే పంచదారను తినేందుకు ఎక్కువ మంది భయపడతారు. అలాంటివారు పంచదారకు బదులు బెల్లం తురుమును వేసి చేయవచ్చు. అప్పుడు స్వీట్ రంగు మారే అవకాశం ఉంటుంది. ఏదైనా నారింజ జ్యూస్ హల్వా రుచిగా ఉండడం మాత్రం ఖాయం.