AP Free Gas Cylinder : సబ్సిడీపై 3 సిలిండర్లు ఇచ్చి.. 20 సిలిండర్ల డబ్బులు లాగుతున్నారు.. వైసీపీ చెప్పిన 8 విషయాలు

Best Web Hosting Provider In India 2024

ఆంధ్రప్రదేశ్‌లో దీపావళీ పండగ సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక హామీని నెరవేర్చింది. మహిళలకు కళ్లల్లో ఆనందం చూడాలని ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. అయితే.. మహిళల కళ్లల్లో ఆనందం కాదు.. కన్నీరు కారబోతోందని వైసీపీ అంటోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను తెరపైకి తీసుకొచ్చి.. తెరవెనక ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేందుక ప్లాన్ వేశారని ఆరోపిస్తోంది.

వైసీపీ వెర్షన్‌లోని ప్రధానాంశాలు..

1.చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు.. ఇది వీరబాదుడు.

2.దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతోంది.

3.సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ.. 20 సిలిండర్ల డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

4.కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి.. పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.

5. మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి.. కుడి చేత్తో విద్యుత్ ఛార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తారీకు నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం రూ.17, 072 కోట్లు.

6.సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం రూ.14,378 కోట్లు. (విద్యుత్ ఛార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం రూ.17072 కోట్లు. దాంట్లో నుంచి రూ.2,685 కోట్లు తీసెస్తే.. రూ.14,378 కోట్ల భారం పడుతుంది.)

7.రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాల లోపు మాత్రమే. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.

8.కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లల్లో దరిద్ర దేవత తాండవిస్తుంటే.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వర ఇళ్లల్లో మాత్రం లక్ష్మీదేవత తాండవిస్తుంది.. అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.

Whats_app_banner

టాపిక్

Dbt SchemesAp Welfare SchemesYsrcpChandrababu NaiduPawan KalyanTrending Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024