ECIL Hyderabad Recruitment : 64 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రకటన – మంచి జీతం, కేవలం ఇంటర్య్వూనే..!

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Electronics Corporation of India Limited) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా….. మొత్తం 60కిపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారానే రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో పని చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 64 ఖాళీలను రిక్రూట్ చేస్తారు. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు, ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలు, కోల్ కత్తా, మీరట్, ఢిల్లీ, పూణె, నాగ్ పూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కైగా కేంద్రాల్లో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ పూర్తి చేయాలి. ఈసీఈ, ఈటీసీ, ఈఈఈ, ఈఈ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించాలి. పోస్టుకు అనుగుణంగా అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని పోస్టులకు ఎమ్మెస్సీ చేసి ఉండాలి. ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

Open PDF in New Window

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను https://www.ecil.co.in/ వెబ్ సైట్ నుంచి తీసుకోవాలి. మీ వివరాలను పూర్తి చేయాలి. నవంబర్‌ 4, 5, 7, 11వ తేదీల్లో నిర్వహించే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ సౌత్ జోన్ లో నవంబర్ 11వ తేదీన ఇంటర్వూలు ఉంటాయి. ముంబై వెస్ట్ జోన్ లో నవంబర్ 7వ తేదీన నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వారు మాత్రమే రావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ధ్రువపత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకే ఆయా కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలి. 11. 30 తర్వాత క్లోజ్ చేస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపాదిన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు నెలకు రూ.45,000 నుంచి రూ.55,000 వేతనం చెల్లిస్తారు. టెక్నికల్ ఆఫీసర్‌/ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000గా ఉంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000 జీతం ఇస్తారు. ఎంపికైన వారికి మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Open PDF in New Window

ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు

Whats_app_banner

టాపిక్

HyderabadRecruitmentTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024