Brahmamudi November 4th Episode:రాజ్‌పై కావ్య పొగ‌డ్త‌లు -క‌ళ్యాణ్‌పై అనామిక రివేంజ్ ప్లాన్‌ -తిరిగి అత్తింటికి క‌ళావ‌తి

Best Web Hosting Provider In India 2024

ఆఫీస్‌లో హీరోలా ఉండాల్సిన తాను కావ్య కింద ఎంప్లాయ్‌గా మార‌డం రాజ్ స‌హించ‌లేక‌పోతాడు. అస‌లే బాధ‌లో ఉండ‌గా..ఓ క్ల‌యింట్ ఫోన్ చేసి కావ్య మేడ‌మ్ అపాయింట్‌మెంట్ కావాల‌ని రాజ్‌ను అడుగుతాడు. రాత్రి ప‌ద‌కొండు గంట‌ల‌కు స్మ‌శానానికి ర‌మ్మ‌ని అత‌డితో అంటాడు రాజ్‌.

అక్క‌డికి ఎందుకొని క్ల‌యింట్ అన‌గానే…నిన్ను చంపి అక్క‌డే పూడ్చిపెడ‌తాన‌ని కోపంగా రాజ్ అత‌డికి బ‌దులిస్తాడు. కాల్ క‌ట్ చేయ‌గానే మ‌రో క్ల‌యింట్ కూడా ఫోన్ చేసి కావ్య మేడ‌మ్ అపాయింట్‌మెంట్ కావాల‌ని అడుగుతాడు. కుద‌ర‌ద‌ని ఫోన్ క‌ట్ చేస్తాడు.

మేనేజ‌ర్‌న‌ని గుర్తుచేయ‌డానికే…

రాజ్ కోపం చూసి అత‌డి క్యాబిన్‌లోకి రావ‌డానికి శృతి ఆలోచిస్తుంటుంది. గుడ్‌మార్నింగ్ మేనేజ‌ర్‌గారు అంటూ భ‌యంభ‌యంగానే రాజ్‌ను విష్ చేస్తుంది శృతి. నేను మేనేజ‌ర్‌ను గుర్తుచేయ‌డానికి అలా విష్ చేశావా అని శృతిపై ఫైర్ అవుతాడు రాజ్‌. నువ్వు ఏ ఉద్దేశంతో అలా పిలిచావో…నీ చేత మీ మేడ‌మ్ అలా ఎందుకు పిలిపిస్తుందో తెలుసుకోనంత అమాయ‌కుడిని కాద‌ని రాజ్ అంటాడు.

అసిస్టెంట్ కాదు…

మీ మేడ‌మ్ అపాయింట్ కావాల‌ని క్ల‌యింట్స్‌ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నార‌ని శృతిని అడుగుతాడు రాజ్. .సీఈవో అపాయింట్‌మెంట్స్ చూసుకోవ‌డం మేనేజ‌ర్ బాధ్య‌త అని శృతి గుర్తుచేస్తుంది. ఉద‌యం బ్ర‌ష్ చేసిన‌ప్ప‌టి నుంచి ప‌డుకునేవ‌ర‌కు ఎక్క‌డికి వెళ్లాలి…ఎవ‌రెవ‌రిని క‌ల‌వాల‌న్న‌ది చూసుకోవ‌డానికి నేను ఏమైనా కావ్య మేడ‌మ్ అసిస్టెంట్‌నా…లేదంటే ఆఫీస్ మేనేజ‌ర్‌నా అని కోపంగా రాజ్ అంటాడు.

కోపంలో మేనేజ‌ర్ అని మీరే ఒప్పుకున్నార‌ని శృతి రాజ్‌కు పంచ్ ఇస్తుంది. కావ్య అసిస్టెంట్‌గా తాను చ‌స్తే ప‌నిచేయ‌కూడ‌ద‌ని రాజ్ అనుకుంటాడు. కానీ తాత‌య్య చెప్పిన మాట గుర్తొచ్చి త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో కావ్య క్యాబిన్‌లోకి వెళ‌తాడు.

కావ్య క్యాబిన్‌లోకి రాజ్‌…

త‌న క్యాబిన్ లోప‌లికి వ‌చ్చిన రాజ్‌ను చూసి చూడ‌న‌ట్లుగా కావ్య ఉంటుంది. నేను వ‌చ్చింది క‌న‌బ‌డ‌లేదా…ఎందుకొచ్చావ‌ని అడ‌గ‌వా అని కావ్య‌తో అంటాడు రాజ్‌. వ‌చ్చింది మీరే అయిన‌ప్పుడు…ఎందుకొచ్చారో కూడా మీరే చెప్పాల‌ని కావ్య త‌గ్గ స‌మాధానం ఇస్తుంది. పొగ‌రు అంటూ లోలోన రాజ్ అంటాడు. ఇద్ద‌రు పాత గొడ‌వ‌లు ముందు పెట్టుకొని వాదించుకుంటారు. నాకు మీతో క‌లిసి ప‌నిచేయ‌డం ఇష్టం లేద‌ని, కానీ తాత‌య్య అడిగార‌ని చేస్తున్నాన‌ని కావ్య అంటుంది.

నాపై న‌మ్మ‌కం లేద‌ని వెళ్లిపోయారుగా…

పాత క్ల‌యింట్స్ నీతో మాట్లాడాల‌ని అడిగార‌ని, అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయాలా అని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. ఆ రోజు నాపై, మ‌న కంపెనీతో న‌మ్మ‌కం లేద‌ని, క‌లిసి ఎప్ప‌టికి మీతో బిజినెస్ చేయ‌లేమ‌ని వెళ్లిపోయారు క‌దా…అలాంట‌ప్పుడు వాళ్లు నాతో మాట్లాడాల్సింది ఏముంద‌ని కావ్య అంటుంది.

వ‌ద్దు అని వెళ్లిపోయిన‌వాళ్లు ఎప్ప‌టికైనా మ‌ళ్లీ వెళ్లిపోతార‌ని కావ్య అంటుంది. రాజ్ ప‌దే ప‌దే అడ‌టంతో లంచ్ త‌ర్వాత క్ల‌యింట్స్‌తో మీటింగ్ అరెంజ్ చేయ‌మ‌ని రాజ్‌తో అంటుంది.

అనామిక‌కు దొరికిపోయిన క‌ళ్యాణ్‌…

క‌ళ్యాణ్ ఆటో న‌డుపుతూ అనామిక‌, సామంత్ కంట‌ప‌డ‌తాడు. క‌ళ్యాణ్‌ను ఆట ఆడుకోవాల‌ని అనామిక ఫిక్స‌వుతుంది. మ‌నిషి రోడ్డున ప‌డ్డాడు అంటే ఇదేనా అని క‌ళ్యాణ్‌తో అంటాడు సామంత్‌. దుగ్గిరాల ఫ్యామిలీ ప‌రువుకు ప్రాణ‌మిస్తార‌ని విన్నాను. ఇంటి ప‌రువును ఆటోలో ప‌డేసి ఊరంతా తిప్పుతున్నావా అని క‌ళ్యాణ్‌ను అవ‌మానిస్తాడు.

నాకు అన్యాయం చేసిన వ్య‌క్తి ఎలాంటి అధోగ‌తికి దిగ‌జారాడో అంటూ క‌ళ్యాణ్‌పై సానుభూతి చూపిస్తుంది అనామిక‌. మీ కుటుంబం మొత్తం రోడ్డున ప‌డే రోజు రావాల‌ని అనామిక శాపం పెట్టింద‌ని సామంత్ అంటాడు. ఈ ప‌తివ్ర‌త శాపాలు ఫ‌లించ‌వ‌ని….అనామిక‌కే దుగ్గిరాల ఇంటి శాపం త‌గిలి ఆమె జీవితం సాఫీగా సాగ‌డం లేద‌ని క‌ళ్యాణ్ రివ‌ర్స్ ఎటాక్ మొద‌లుపెడ‌తాడు. నీకు ఆ శాపంలో భాగం ఉంద‌ని సామంత్‌ను హెచ్చ‌రిస్తాడు క‌ళ్యాణ్.

ప్ర‌శాంతంగా ఉండ‌లేవు…

నేను కారులో తిరుగుతున్నాను…నువ్వు ఆటోలో తిరుగుతున్నావ‌ని క‌ళ్యాణ్‌తో చుల‌క‌న‌గా మాట్లాడుతుంది అనామిక‌. ఇష్ట‌ప‌డి నీ జీవితంలోకి వ‌చ్చిన అప్పు…నిన్ను మ‌రింత అప్పుల పాలు చేస్తుంద‌ని క‌ళ్యాణ్‌తో అంటుంది. దిగ‌జార‌డం అంటే నా కాళ్ల‌పై నేను నిల‌బ‌డ‌టం కాద‌ని, ఇంకో మ‌గాడి కారులో నువ్వు ఉండ‌ట‌మ‌ని క‌ళ్యాణ్ ఆన్స‌ర్ ఇస్తాడు.

ఎప్పుడు ఎదుటివాళ్ల నాశ‌నం కోరుకునే నువ్వు ఎప్ప‌టికీ ప్ర‌శాంతంగా ఉండ‌లేవ‌ని, నీకు న‌న్ను విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని అనామిక‌కు క్లాస్ ఇచ్చి వెళ్లిపోతాడు క‌ళ్యాణ్. ఆటో న‌డుపుతున్న క‌ళ్యాణ్‌ ఫొటోను అనామిక తీస్తుంది. ఈ ఫొటోతో దుగ్గిరాల ప‌రువు, ప్ర‌తిష్ట దిగ‌జార్చుతాన‌ని అంటుంది.

త‌ప్పు తెలుసుకున్న క్ల‌యింట్స్‌…

త‌మ కంపెనీతో బిజినెస్ వ‌ద్ద‌నుకొని వెళ్లిపోయిన క్ల‌యింట్స్ మ‌ళ్లీ కావ్య‌ను క‌ల‌వ‌డానికి ఆఫీస్‌కు వ‌స్తారు. మీ కంపెనీని వ‌ద్ద‌నుకొని వెళ్లిపోవ‌డం ఎంత పెద్ద త‌ప్పో తెలుసుకున్నామ‌ని, ఆ త‌ప్పును స‌రిదిద్దుకోవ‌డానికే మ‌ళ్లీ వ‌చ్చామ‌ని అంటారు.

త‌మ కంపెనీలో జాయిన్ అయితే ఎక్కువ లాభాలు ఇస్తాన‌ని అనామిక ఆశ చూపించిద‌ని, కానీ ఆమె బిజినెస్ ఉమెన్ కాద‌ని, తింగ‌రిబుచ్చి అని ఆల‌స్యంగా తెలిసింద‌ని క్ల‌యింట్స్ అంటారు.

స్ట్రాట‌జీలు లేవు…

మిమ్మ‌ల్ని దెబ్బ‌తీయాల‌నే ఆలోచ‌న త‌ప్ప అనామిక‌లో ఏ స్ట్రాట‌జీలు లేవ‌ని క్ల‌యింట్స్ అంటారు. న‌ష్టాల్లో ఉన్న కంపెనీని అనామిక చేత 30 కోట్ల‌తో కొనిపించిన మీ తెలివి తేట‌లు చూసి మీతో జాయిన్ కావాల‌ని ఫిక్స‌య్యామ‌ని క్ల‌యింట్స్ అంటారు. లాభాలు మాత్ర‌మే కావాల‌ని చూసే మీలాంటి గొప్ప‌వాళ్ల‌తో నేను బిజినెస్‌చేయ‌లేన‌ని కావ్య అంటుంది. ఛాన్స్ దొరికితే మొగుడినైనా న‌న్నే వ‌దిలిపెట్ట‌దు..వీళ్ల‌ను త‌న కాళ్లు ప‌ట్టుకునేదాకా వ‌దిలిపెట్ట‌ద‌ని రాజ్ లోలోన అనుకుంటాడు.

అగ్రిమెంట్స్ రెడీ…

అనామిక మ‌ళ్లీ వ‌చ్చి…మంచి బిజినెస్ స్ట్రాట‌సీ ఉంద‌ని అడిగితే వెళ్ల‌ర‌ని గ్యారెంటీ ఏంటి అని క్ల‌యింట్స్‌ను కావ్య అడుగుతుంది. మార్కెట్‌లో ఉన్నన్ని రోజులు మీతోనే బిజినెస్ చేస్తామ‌ని వారంతా కావ్య‌కు మాటిస్తారు. అగ్రిమెంట్ చేస్తామ‌ని అంటాడు. అల్రెడీ సిద్ధం చేసిన అగ్రిమెంట్ పేప‌ర్స్ వాళ్ల ముందు పెడుతుంది కావ్య‌. వాళ్లంతా సంత‌కాలు పెడ‌తారు.

రాజ్‌పై పొగ‌డ్త‌లు…

మీరు సీఈవో గా ఉన్నంత‌కాలం మీకు మించిన‌వాళ్లు ఎవ‌రూ ఉండ‌ర‌ని అనుకున్నామ‌ని, కానీ కావ్య మీకు స‌మానంగా నిల‌బ‌డింద‌ని, తెలివితేట‌ల్లో మిమ్మ‌ల్ని కావ్య మించిపోయింద‌ని రాజ్‌తో క్ల‌యింట్స్ అంటారు.

నాకు ట్రైనింగ్ ఇచ్చి, కంపెనీ వ్య‌వ‌హారాల గురించి నేర్పించింది భ‌ర్త రాజ్ అని, ఈ రోజు మీరు పొగిడే పొగ‌డ్త‌లు అన్నింటికి భ‌ర్త‌నే కార‌ణ‌మ‌ని, ప‌ని విష‌యంలో రాజ్ నిరంత‌రం ముందుకు వెళుతూనే ఉంటార‌ని కావ్య అంటుంది. రాజ్‌ను ఫాలో అవ‌డం త‌ప్పితే… ఆయ‌న్ని దాట‌డం అసాధ్య‌మ‌ని భ‌ర్త‌పై కావ్య ప్ర‌శంస‌లు కురిపిస్తుంది.

క‌ళ్యాణ్‌పై డాక్యుమెంట‌రీ…

దుగ్గిరాల ఫ్యామిలీని దెబ్బ‌కొట్ట‌డానికి కొత్త ప్లాన్ వేస్తుంది. ఓ డైరెక్ట‌ర్‌ను క‌లుస్తుంది. ఆటో న‌డిపే వ్య‌క్తిపై డాక్యుమెంట‌రీ తీయాల‌ని అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ వార‌సుడు ఆటో న‌డ‌పుతూ సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతున్నాడ‌ని, అత‌డికే తెలియ‌కుండా బ‌యోగ్ర‌ఫీ షూట్ చేయాల‌ని డైరెక్ట‌ర్‌గా చెబుతుంది.

అత‌డికి భారీగా డ‌బ్బు అంద‌జేస్తుంది. కావ్య‌ను దీపావ‌ళి పండుగ‌కు అత్తింటికి ఆహ్వానించాల‌ని క‌న‌కం ఇంటికి వ‌స్తుంది ఇందిరాదేవి. నేను దీపావ‌ళికి వ‌స్తే రాజ్ క‌ళ్ల‌ల్లోనే ట‌పాసులు పేలుతాయ‌ని కావ్య అంటుంది.అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024