Best Web Hosting Provider In India 2024
కొంచెం కూడా అటవీ, ప్రభుత్వ భూమి లేనే లేదు
టాపిక్ డైవర్షన్ కోసమే ఆ భూముల్లో పవన్ టూర్
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఫైర్
రైతులకు మూడింతల అధిక ధర చెల్లించి కొన్నారు
ఆ విధంగా వెనకబడిన ఆ ప్రాంత రైతులకు మేలు
చంద్రబాబు వల్లనే కంపెనీ ప్రారంభం కాలేదు
అయినా పవన్‌కళ్యాణ్ అసత్య ఆరోపణలు, విమర్శలు
పక్కనే ప్రభుత్వ భూమి పొందిన పలు కంపెనీలు
ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదు
అయినా వాటి జోలికెళ్లని పవన్. సరస్వతిపైనే టార్గెట్
కాసు మహేష్‌రెడ్డి స్పష్టీకరణ
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి
శాంతి భద్రతలు కాపాడలేని దుస్థితిలో ప్రభుత్వం
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్
ఆ దిశలోనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పల్నాడు టూర్
అసత్య ఆరోపణలతో వైయస్ జగన్‌పై బురద చల్లుతున్నారు
ప్రెస్‌మీట్‌లో కాసు మహేష్‌రెడ్డి ఫైర్
తాడేపల్లి: సరస్వతి పవర్ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందే అని, అక్కడ ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని ఎమ్మార్వో నిర్ధారించి నివేదిక ఇచ్చినా, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం.. అక్కడ ప్రభుత్వ, అటవీ భూములున్నాయని, అసలు వెయ్యి ఎకరాలు ఎలా సేకరించారని అంటూ, తప్పుడు ఆరోపణలతో నిందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వ అసమర్థత నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, అరాచకాలు, మహిళల మీద అత్యాచారాలను అదుపు చేయలేక, శాంతి భద్రతల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సరస్వతి భూముల్లోకి వచ్చి హడావుడి చేసి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పల్నాడు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్, ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారని అనుకుంటే.. ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లడానికి ఇంత దూరం వచ్చారా? అని స్థానిక ప్రజలు ఉసూరుమన్నారని ఆయన తెలిపారు.
ఆ ప్రాజెక్టును చంద్రబాబే అడ్డుకున్నారు:
నక్సలిజం తాండవిస్తున్న రోజుల్లో 2007–08 మధ్య వైయస్ జగన్ బిజినెస్‌మ్యాన్‌గా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మాచవరం మండలం చెన్నాయపాలెం, వేమవరం, తంగెడ గ్రామాల్లో కేవలం ఎకరా లక్ష, 2 లక్షలున్న భూములను రైతులతో మాట్లాడి దాదాపు రూ.3 నుంచి 8 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేశారని కాసు మహేష్‌రెడ్డి వెల్లడించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న భవ్య సిమెంట్ కంపెనీ, ఒక్కో ఎకరా కేవలం రూ.50 వేలు మొదలు, లక్ష, రెండు లక్షలకే కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. రైతులకు మేలు కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరతో వైయస్ జగన్‌గారు భూములు కొనుగోలు చేసి, సరస్వతి సిమెంట్ కంపెనీ నెలకొల్పితే, ప్రారంభానికి ముందే, 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే, ఆ కంపెనీ మైనింగ్ లీజును రద్దు చేశారని చెప్పారు. దీంతో న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు.
నిర్దేశించుకున్న సమయానికి ఆ పరిశ్రమ ప్రారంభమై ఉంటే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించేదని అన్నారు. కడప జిల్లాలో మొదలైన భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వచ్చిన విషయాన్ని కాసు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అవి ప్రభుత్వ భూములు తీసుకున్నా..:
సరస్వతి భూముల్లోకి వచ్చిన పవన్ కళ్యాన్, స్థానికంగా భూములు పొందిన అన్ని సిమెంట్ కంపెనీల యజమానులను పిలిపించి పరిశ్రమల ప్రారంభానికి అవసరమైన అన్ని అనుమతులు ఇప్పిస్తామని హామీ ఇచ్చి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా చేస్తారని ఆశించామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా డిప్యూటీ సీఎం వ్యవహరించారని, వైయస్ జగన్‌గారు కొనుగోలు చేసిన సరస్వతి భూములను రద్దు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
గురజాల మండలంలో ప్రభుత్వం నుంచి 40 ఏళ్ల క్రితం సంఘీ సిమెంట్స్ భూములు తీసుకుని ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభించలేదని, 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని ఒక్క బస్తా సిమెంట్ కూడా తయారు చేయకుండానే అంబుజా సిమెంట్ ఆ భూములను అదానీకి అమ్మేశారని మాజీ ఎమ్మెల్యే వివరించారు. మైహోం, ఇమామి వంటి కంపెనీలు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకున్నా పట్టించుకోని పవన్‌కళ్యాణ్, వైయస్ జగన్‌గారు కొనుగోలు చేసిన ప్రైవేటు భూములు రద్దు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు కుట్రలకు బలైన సరస్వతి పరిశ్రమ ప్రారంభమై ఉంటే వెనుకబడిన మాచవరం మండలం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు.
సరస్వతి భూములపైకి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌కు.. హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో వేలాది ఎకరాలు అక్రమంగా సేకరించి, ప్రభుత్వం నుంచి పొంది రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ భూముల్లోకి వెళ్లే ధైర్యం ఉందా? అని మాజీ ఎమ్మెల్యే సవాల్ చేశారు. అలాగే ఎక్కడికక్కడ హెరిటేజ్ కంపెనీ అనేక మార్గాల్లో సేకరించిన భూముల్లో ఆయన పర్యటించగలరా? అని కాసు మహేష్‌రెడ్డి నిలదీశారు. ఇంకా ఆయా భూములను రద్దు చేస్తామని పవన్ ప్రకటించగలరా? అని ప్రశ్నించారు.
ప్రచారం తప్ప, వాస్తవాలు ఎక్కడ?:
ఏదో సాధిస్తామని ఊదరగొట్టడమే తప్ప ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టలేదని కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వస్తోందని ఎల్లో మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుంటే, ఒడిశా మాత్రం అది తమ వద్దే ఉందని చెబుతోందని గుర్తు చేశారు. సాధ్యం కాని హామీలిచ్చి నెరవేర్చలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌కి, సోషల్ మీడియా అరెస్టులే నిదర్శనమని కాసు స్పష్టం చేశారు. అరెస్టయిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని వివరించారు.
ఆ మరణంతో మాకు సంబంధం లేదు:
కోడెల శివప్రసాదరావు మరణంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే, ఆయన మరణంతో తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. కుటుంబంలో ఆస్తి వివాదాలు, ఆర్థిక లావాదేవీలే ఆయన మరణానికి కారణమని కాసు మహేష్‌రెడ్డి వివరించారు.