Healthy Drink: ఈ డ్రింక్ తాగితే జీర్ణం నుంచి రోగ నిరోధక శక్తి వరకు చాలా లాభాలు.. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండిలా!

Best Web Hosting Provider In India 2024

కొన్ని ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని పానియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేసుకోవడం సులువే అయినా చాలా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటిదే ‘వాము-జీలకర్ర నీరు’. ఈ డ్రింక్‍ను సులువుగానే తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా ఈ పానియం తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ వివరాలు ఇవే..

ఎలా తయారు చేసుకోవాలి?

ఈ డ్రింక్ చేసుకునేందుకు ఓ టీ స్పూన్ వాము, ఓ టీస్పూన్ జీలకర్ర, రెండు కప్పుల నీరు తీసుకోవాలి.

ముందుగా ఓ పాత్రలో రెండు కప్పుల నీటిని బాగా మరిగించుకోవాలి. నీరు మరిగాక దాంట్లో ఓ టీ స్పూన్ వాము, ఓ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఆ తర్వాత మంట సిమ్‍లో పెట్టి నీటిని 5 నుంచి 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా సన్నని మంటపై మరగనివ్వడం వల్ల ఈ గింజల్లోని ముఖ్యమైన ఆయిల్స్, యాక్టివ్ కాంపౌండ్స్ నీటిలో కలుస్తాయి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి పాత్ర దించుకొని నీటిని కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఓ గ్లాసులో వడగట్టుకోవాలి. దీంతో ‘వాము-జీలకర్ర నీరు’ తయారవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే బాగుంటుంది. ఉదయాన్నే పరగడుపున తాగితే ఇంకా మంచిది.

జీర్ణక్రియకు మేలు

‘వాము-జీలకర్ర నీరు’ తాగడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఇందులోని ఎసెన్షియల్ ఆయిల్స్, ఇతర గుణాలు జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‍ల స్రావాన్ని ప్రేరేపించగలవు. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవడానికి తోడ్పడతాయి. ఈ పానియం రెగ్యులర్‌గా తాగితే కడుపు సంబంధించిన సమస్యలు కూడా తగ్గేందుకు సహకరిస్తుంది.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతీ రోజు వాము-జీలకర్ర నీరు తాగడం చాలా మేలు. ఇది జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఎక్కువ క్యాలరీలు బర్న్ అయ్యేలా చేస్తుంది. ఎక్కువగా తినాలనే ఆశను కూడా తగ్గించగలదు. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సులువుగా బయటికి పోయేలా కూడా చేయగలదు. అందుకే బరువు తగ్గేందుకు ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.

రోగ నిరోధక శక్తి

వాము-జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో ఈ డ్రింక్ రెగ్యులర్‌గా తాగితే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నుంచి కణాలను ఈ డ్రింక్స్ కాపాడగలదు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ డ్రింక్ రక్షణ కల్పించగలదు.

బ్లడ్ షుగర్ కంట్రోల్‍

వాము-జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. యాంటీబయాటిక్స్ గుణాలు ఉండడం ఇందుకు తోడ్పడుతుంది. ఇన్సులిన్ సెన్సివిటీని కూడా ఈ వాటర్ పెంచగలదు. సడెన్‍గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడాన్ని నియంత్రించగలదు.

శ్వాసకోశ ఇబ్బందులకు..

శ్వాసకోశ సమస్యలను వాము-జీలకర్ర నీరు తగ్గించగలదు. ఇందులో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో శ్వాస ఆరోగ్యానికి మంచి చేస్తుంది. జలుబు, దగ్గు లాంటివి తగ్గేందుకు ఈ డ్రింక్స్ ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కూడా తగ్గించగలదు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024