Best Web Hosting Provider In India 2024
Anushka Shetty Birthday: లాంగ్ గ్యాప్ తర్వాత ఓ పవర్ఫుల్ రోల్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అనుష్కశెట్టి. ఆమె హీరోయిన్గా ఘాటి పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఫస్ట్ లుక్ రిలీజ్…
అనుష్క పుట్టినరోజు సందర్భంగా గురువారం అనుష్క ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో భాంగ్ తాగుతూ అనుష్క సీరియల్ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె చేతులు రక్తంతో తడిపోయి ఉన్నాయి. తలపై నుండి రక్తం కారుతూ ఉన్నట్లుగా పోస్టర్లో కనిపించడం ఆసక్తిని పంచుతోంది. ఈ పోస్టర్లో నుదిటన తిలకం, రెండు ముక్కుపుడకలతో అనుష్క డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది.
క్యాప్షన్…
విక్టిమ్…క్రిమినల్…లెజెండ్ అంటూ ఘాటీ పోస్టర్‌పై ఉన్న అక్షరాలు క్యూరియాసిటీని పెంచుతోన్నాయి. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందని అంటోన్నారు. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ సాధారణ యువతి క్రూరమృగాల్లాంటి కొందరు కరుడు గట్టిన వ్యక్తులతో ఎలాంటి పోరాటం సాగించిందనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సినిమా గ్లింప్స్‌ను గురువారం సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు.
ఐదు భాషల్లో…
ఈ సినిమాకు నాగవెళ్లి విద్యాసాగర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్‌ను సమకూర్చుతున్నాడు ఘాటీ మూవీకి చింతకింది శ్రీనివాసరావు కథను అందిస్తోన్నారు.. ఘాటీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
మలయాళంలోకి ఎంట్రీ…
నిశ్శబ్ధం తర్వాత టాలీవుడ్‌కు దూరమైన అనుష్క మూడేళ్ల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. గత ఏడాది రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. ఘాటీతో పాటు త్వరలోనే మలయాళంలోకి అనుష్క ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కథనార్ పేరుతో ఓ పీరియాడికల్ హారర్ మూవీ చేస్తోంది.
హరిహరవీరమల్లు…
మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు క్రిష్. అతడి స్థానంలో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు ఏఎమ్ జ్యోతికృష్ణ సినిమాను పూర్తిచేసే బాధ్యత తీసుకున్నాడు.
2017లో బాలకృష్ణ హీరోగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్‌కు సరైన సక్సెస్ లేదు. ఎన్టీఆర్ బయోపిక్‌గా వచ్చిన ఎన్టీఆర్, కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుతో పాటు కొండపొలం సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.