Crime Thriller OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న తమన్నా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Crime Thriller OTT: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు సికందర్ కా ముకద్దర్ (Sikandar Ka Muqaddar). తమన్నాతోపాటు జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారీ, రాజీవ్ మెహతాలాంటి వాళ్లు నటించిన ఈ మూవీని నీరజ్ పాండే డైరెక్ట్ చేశాడు. గతంలోనే ఈ సినిమా మేకింగ్ వీడియోతో కూడిన టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.

సికందర్ కా ముకద్దర్ ఓటీటీ రిలీజ్ డేట్

సికందర్ కా ముకద్దర్ మూవీ నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ గురువారం (నవంబర్ 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. “ముగ్గురు నిందితులు.. కానీ అసలు అపరాధి ఎవరు? కేస్ త్వరలోనే తెరుచుకుంటుంది.

సికందర్ కా ముకద్దర్ నవంబర్ 29న నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది” అని సదరు ఓటీటీ తెలిపింది. గతంలో ఎ వెన్స్‌డే, స్పెషల్ 26, బేబీ, ఎమ్మెస్ ధోనీలాంటి విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే మూవీ కావడంతో ఈ సికందర్ కా ముకద్దర్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

సికందర్ కా ముకద్దర్ మూవీ గురించి..

సికందర్ కా ముకద్దర్ మూవీ ఓ దోపిడీ చుట్టూ తిరిగే కథ. 15 ఏళ్ల పాటు సాగే ఈ కేసులో చివరికి ఏం జరిగింది? ఆ కేసును పరిష్కరిస్తున్న పోలీసు ఆఫీసర్ చివరికి విజయవంతమయ్యాడా అన్నది మూవీలో చూడొచ్చు. ఇంతకుముందే నెట్‌ఫ్లిక్స్ తో కలిసి ఖాకీ: ది బిహార్ ఛాప్టర్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందించిన నీరజ్ పాండే ఇప్పుడు అదే జానర్ లో మూవీతో వస్తున్నాడు. ఈ మధ్యే స్త్రీ2లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా.. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సికందర్ కా ముకద్దర్ మూవీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. అప్పుడే ఓ మోషన్ పోస్టర్ తో టైటిల్ రివీల్ చేసింది. ఆ తర్వాత గత నెలలో బిహైండ్ ద సీన్స్ వీడియోతో ఓ చిన్న టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తాజాగా నవంబర్ 29 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ హిందీ మూవీని తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తుందా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024