Amla candy: ఉసిరి క్యాండీ పిల్లల కోసం ఇలా ఇంట్లోనే చేసేయండి, రెసిపీ ఇదిగో

Best Web Hosting Provider In India 2024

ఉసిరికాయలను నేరుగా పిల్లలు తినరు, కానీ ఉసిరి క్యాండీలను ఇస్తే మాత్రం ఇష్టంగా తింటారు. ఈ ఆమ్లా క్యాండీలు మార్కెట్లో ఎక్కువ ఖరీదే ఉంటాయి. ఇక్కడ మేము ఇంట్లోనే ఆమ్లా క్యాండీ చేసే విధానాన్ని వివరించాము. వీటిని చేసి పెట్టుకుంటే నెల రోజులైనా తాజాగా ఉంటాయి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఈ క్యాండీ నచ్చేస్తుంది. ఈ ఉసిరి క్యాండీ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలే జరుగుతుంది. ఇక ఆమ్లా క్యాండీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఆమ్లా క్యాండీ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు – పది

నీరు – ఒక కప్పు

పంచదార – అరకప్పు

ఉసిరి క్యాండీ రెసిపీ

1. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి తుడిచి పొడిగా ఉంచాలి.

2. ఒక కళాయిలో నీరు వేసి స్టవ్ మీద పెట్టాలి.

3. ఆ నీరు వేడెక్కాక ఈ ఉసిరికాయలను వేసి రంగు మారేవరకు ఉడకనివ్వాలి.

4. ఉసిరికాయలు కాస్త మెత్తగా అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

5. ఉసిరికాయలను చల్లార్చక నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. విత్తనాలను తీసి పడేయాలి.

6. ఒక గిన్నెలో ఈ ఉసిరిముక్కలను వేసుకోవాలి.

7. ఉసిరికాయలో చక్కెరను వేసి బాగా కలిపి గిన్నెపై మూత పెట్టేయాలి.

8. అలా మూడు రోజులు పాటు వదిలేయాలి.

9. చక్కెర ద్రవ రూపంలోకి మారి ఉండడం మీరు గమనిస్తారు.

10. ఈ చక్కెర సిరప్ నుండి ఉసిరికాయ ముక్కలను వేరు చేసి రెండు రోజులు పాటు గాలికే ఎండబెట్టండి.

11. ఆ చక్కెర సిరప్‌ను వేరే స్వీట్ తయారీకి వినియోగించుకోవచ్చు.

12. ఈ ఉసిరి క్యాండీ గట్టిపడే వరకు అలా ఎండబెట్టాలి. అంతే ఆమ్లా క్యాండిల్ రెడీ అయినట్టే.

13. దీన్ని గాలి చొరబడని కంటైనర్లో వేసి నిల్వ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తింటే మరింతగా తినాలనిపిస్తుంది.

ఆమ్లా క్యాండీ ఆరోగ్యానికి కూడా మంచిదే. దీనిపై చక్కెర కోటింగ్ మాత్రమే ఉంటుంది. ఆ ముక్కల్లో ఉసిరి పోషకాలు నిండి ఉంటాయి. కాబట్టి తినడం వల్ల ఆరోగ్యానికి కొన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇక మధుమేహం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండు ఆమ్లా క్యాండీలను తింటే ఇలాంటి సమస్య లేదు. ఇవి రుచికరంగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతాయి.

ఉసిరి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మంపై మొటిమలు, గీతలు, ముడతలు వచ్చే అవకాశాన్ని దూరం చేస్తాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ అధికంగా ఉంటాయి. ఉసిరిని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు కణాలను రక్షించే గుణం ఉసిరిలో ఉంటుంది. కాగ్నిటివ్ పనితీరును మెరుగుపరిచే శక్తి కూడా ఉసిరికాయలో ఉంది. కాబట్టి ఉసిరికాయను అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఇవి శీతాకాలంలోనే అధికంగా దొరుకుతాయి. కాబట్టి ఉసిరికాయను తినడం వల్ల అన్ని రకాలుగా మేలే జరుగుతుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024