APSRTC Karthika Masam Special : ‘కార్తీక మాసం’ స్పెషల్ – గుంటూరు జిల్లా నుంచి శైవ క్షేత్రాల‌కు 150 ప్ర‌త్యేక బస్సులు

Best Web Hosting Provider In India 2024

కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తుల సౌక‌ర్యార్థం శైవ క్షేత్రాల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేసిన‌ట్లు గుంటూరు జిల్లా ప్రజా రవాణా అధికారి రవికాంత్ తెలిపారు. జిల్లాలోని వివిధ డిపోల నుంచి 150 బ‌స్సుల‌ను న‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ వరకు అందుబాటులో ఉంటాయి. శైవ క్షేత్రాలతో పాటు శబరిమల, త్రిలింగ ద‌ర్శ‌నం, సూర్యలంక బీచ్, ఇత‌ర పుణ్య క్షేత్రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డుపుతున్నారు.

గుంటూరు-1 డిపో నుంచి 45 బ‌స్సు స‌ర్వీసులు, గుంటూరు-2 డిపో నుంచి 48 బ‌స్సు స‌ర్వీసులు, తెనాలి డిపో నుంచి 23, మంగళగిరి డిపో నుంచి 12, పొన్నూరు డిపో నుంచి 22 బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

పంచారామాలైన అమ‌రావ‌తి (అమ‌రేశ్వ‌రుడు-అమ‌రా రామం), భీమ‌వ‌రం (సోమేశ్వ‌రుడు-సోమా రామం), పాల‌కొల్లు (క్షీర‌రామ‌లింగేశ్వ‌రుడు-క్షీరా రామం), ద్రాక్షారామం (భీమేశ్వ‌రుడు-ద‌క్షా రామం), సామ‌ర్ల‌కోట (కొమ‌ర లింగేశ్వ‌రుడు- కుమార్ భీమేశ్వ‌ర‌రాం) పుణ్య‌క్షేత్రాల‌ను ఒకే రోజు ద‌ర్శనం చేసుకోవచ్చని తెలిపారు. ఇది కాకుండా శైవ క్షేత్రాలకు వెళ్లాలనుకునే అపార్ట్‌మెంట్ వాసుల కోసం అదనపు రవాణా ఛార్జీలు లేకుండా వారి నివాసం వద్దకే బస్సులు పంపుతామని పేర్కొన్నారు.

మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలు యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాలకు ఒకటిన్నర రోజులో వెళ్లి తిరిగి వచ్చేలా త్రిలింగ దర్శిని ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

శబరిమల భక్తుల కోసం ఐదు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. సూర్య లంక బీచ్, కార్తీక వన సమారాధనకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సులను అందుబాటులోకి‌ తెచ్చిందన్నారు. 35 మంది వరకు ఉంటే, ఆన్‌లైన్ లో బస్సులను బుక్ చేసుకోవచ్చు. ఆదివారాల్లో ఉదయం 5:30 గంటలకు, సోమవారాల్లో ఉదయం 6:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. అలాగే ఈనెల 7 నుంచి 30 వరకు శుభ ముహూర్తాలు ఉన్నందున అద్దె బస్సులను అవసరమైన వారు అద్దె బస్సులను బుక్ చేసుకోవచ్చు.

పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేక ప్యాకేజీల్లో వెళ్లాలనుకునేవారు, అద్దె బస్సులను బుక్ చేసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్ లో ఏపీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్ లో చేసుకోవచ్చు. అలాగే ఆఫ్ లైన్ బుక్ చేసుకోవాలనుకుంటే 7382898030 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsApsrtcTravelKarthika MasamGuntur
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024