తాటాకు చప్పుళ్లకు భయపడం

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం,

నాయకులంతా పార్టీ శ్రేణులకు తోడుగా ఉండండి.

అవసరమైతే పోలీస్‌స్టేషన్లకు వెళ్లి అక్రమ కేసులపై ప్రశ్నించండి,

ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?

మాట వినలేదని ఎస్పీలను బదిలీ చేస్తారా?_

ఒకరకంగా ఇది అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేయడమే,

ఐఏఎస్, ఐపీఎస్‌లు చట్టబద్ధంగా వ్యవహరించండి,

రాష్ట్ర డీజీపీ, సీఎస్‌లు చెడ్డపేరు తెచ్చుకోవద్దు

కూటమి ప్రభుత్వానికి అధికారులు తొత్తులుగా మారొద్దు,

ఐదు నెలల్లోనే ఏపీని అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపాటు 

విజయనగరం  : ప్రభుత్వ అసమర్థ పాలనను  ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడుతూ ఏపీని అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చారని వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఒక ప్రకటనలో చిన్న శ్రీను మాట్లాడారు. 

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అవుతోందని, ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ ప్రజాకంఠక పాలన అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తుంటే వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ థర్డ్‌ డిగ్రీ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్‌కళ్యాన్‌ మాట్లాడిన వీడియోలతో సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే గొంతునొక్కుతున్నారని విమర్శించారు. చివరకు ఏ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారో కూడా తెలియజేయడం లేదన్నారు. 

ఇటీవల డీజీపీ తిరుమలరావు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు మాట వినకుంటే సస్పెండ్‌ చేయడమో, బదిలీ చేయడమో చేస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 41 ఎ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, కానీ సుప్రీం ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. 

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తకు 41 ఎ నోటీసులు ఇచ్చి వదిలేసిన కారణంగా కడపలో ఎస్పీ హర్షవర్దన్‌రాజును గంటల వ్యవధిలో బదిలీ చేశారని తెలిపారు. ఇది ముమ్మాటికీ ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లను బ్లాక్‌ మెయిల్‌ చేయడమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమర్థవంతమైన అధికారిగా విష్ణువర్దన్‌రాజును కడప ఎస్పీగా నియమించారని తెలిపారు. ఇప్పుడు బదిలీ చేసి అధికారులందరినీ గుప్పెట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. 

ఎన్నికలకు ముందు కరెంట్‌ చార్జీలను పెంచేది లేదని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రూ.17 వేల కోట్ల భారం వేస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు..వీటన్నింటినీ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?’’ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను అన్నారు.

 ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తాము చెప్పినట్లు నడుచుకోవడం లేదని కేబినెట్‌ సమావేశంలో చర్చించడం సిగ్గుచేటని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. అసలు ఐఏఎస్, ఐపీఎస్‌లకు మీరు ఏం చెబుతున్నారు? వాళ్లు ఏం వినడం లేదో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ప్రజలకు తెలియజేయాలన్నారు. అరాచకాలు చేయాలని వాళ్లకు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 

ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే పోలీస్‌స్టేషన్లకు వెళ్లి అక్రమ కేసులపై ప్రశ్నించాలన్నారు.రాష్ట్ర డీజీపీ, సీఎస్‌లకు పరిపాలనలో అనుభవం ఉందని, మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయాలని సూచించారు. అధికారులు మాత్రమే శాశ్వతమని, రాజకీయ నాయకులు కాదన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారొద్దని తెలిపారు. ఏ సోషల్ మీడియా కార్యకర్త,  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అధైర్యపడొద్దని.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) హామీ ఇచ్చారు. 

Best Web Hosting Provider In India 2024