NNS November 8th Episode: ​​​​​​​​ప్రిన్సిపల్​ ఆటకట్టించిన పిల్లలు.. పుట్టింటికి భాగీ.. అమర్‌తో పెళ్లి కోసం కొత్త స్కెచ్

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 8th November Episode)లో పిల్లలు నలుగురు కలిసి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లి సెల్పీ అడుగుతారు. నాతో సెల్ఫీ ఎందుకు అని ప్రిన్సిపల్‌ అడుగుతుంది. త్వరలోనే మీరు చాలా ఫేమస్‌ అవుతారని మాకు అనిపిస్తుంది మేడం. అందుకే అప్పుడు మీతో సెల్ఫీ దిగే ఛాన్స్ రాదని ఇప్పుడే దిగుదామనుకుంటున్నాము అంటారు పిల్లలు.

స్టేట్ మొత్తం షేక్

వాళ్ల పొగడ్తలకు పడిపోయిన ప్రిన్సిపల్‌.. సరే అంటూ సెల్ఫీ ఇవ్వబోతుండగా ఆనంద్ తాము తీసిన వీడియోను ప్రిన్సిపల్‌కు సెండ్‌ చేస్తాడు. ఏదో అర్జెంట్‌ మెసేజ్‌ వచ్చినట్టు ఉంది మేడం చూసుకోండి అని చెప్తుంది అంజు. ప్రిన్సిపల్‌ వీడియో ఓపెన్‌ చేసి చూసి షాక్‌ అవుతుంది. ఇది కానీ బయట ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా..? మేడం. స్టేట్‌ మొత్తం షేక్‌ అవుతుంది అంటుంది అమ్ము.

అన్ని న్యూస్‌ చానెల్స్‌ మీ వెనకాల పడతాయి మేడం.. మీరు భయంకరమైన ఫేమస్‌ అయిపోతారు అంటాడు ఆనంద్​. అలా చేసింది ఎవరో తెలియదు. కానీ, మీ మీద చాలా కక్ష్య పెట్టుకుని చేసినట్టు ఉన్నారు అంటాడు ఆకాష్​. ఇందంతా అబద్దం.. అంతా అబద్దం.. అని అరుస్తుంది ప్రిన్సిపల్​. అబద్దం అని మీకు తెలుసు మాకు తెలుసు. కానీ, జనాలకు ఏం తెలుసు మేడం అంటాడు ఆకాష్.

హైడ్ లైన్స్‌లో మీరే

మేడం ఈ వీడియో చూస్తుంటే.. వాచ్‌ మెన్‌‌తో పర్సనల్‌ పనులు చేయించుకుంటున్న ప్రిన్సిపాల్, అరాచకాలు పెరిగిపోయిన ప్రిన్సిపల్‌ అని హెడ్‌ లైన్స్‌ మీద హెడ్‌ లైన్స్‌ వేసి మిమ్మల్ని భయంకరమైన ఫేమస్‌ చేస్తారు అని పిల్లలు ప్రిన్సిపాల్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. దాంతో భయపడ్డ ప్రిన్సిపాల్‌ అలాగే చూస్తుండిపోతుంది. పిల్లలు వెళ్లిపోతారు.

మరోవైపు మనోహరి.. మంగళకు ఫోన్‌ చేసి భాగీని అమర్‌ తిట్టి తరిమేశాడని చెప్తుంది. దీంతో మంగళ షాక్‌ అవుతుంది. వెంటనే ఇప్పుడు ఇక నీకు కోట్ల ఆస్థి వస్తుందన్నమాట అంటుంది మంగళ. ఇంతలో కారు సౌండ్ విని వాళ్లు వచ్చినట్టు ఉన్నారు నేను చూసుకుంటాను అని ఫోన్ కట్‌ చేస్తుంది మంగళ. భాగీని తీసుకుని ఇంటికి వచ్చిన రాథోడ్‌ను ఎందుకు వచ్చారని అడుగుతుంది మంగళ.

వాచ్ మెన్ డ్యూటీ మాత్రమే

ఊరికే రెండు రోజుల్లో ఉండిపోవడానికి వచ్చింది అని చెప్పి రాథోడ్ వెళ్లిపోతాడు. మరోవైపు ప్రిన్సిపాల్‌ తనకు తెలిసిన వాళ్లకు ఫోన్‌ చేసి తన వీడియో ఎవరికైనా వచ్చిందా..? అని అడుగుతుంది. ఎవరూ రాలేదని చెప్తారు. ఇంతలో రామ్మూర్తి వచ్చి ఏదైనా పని చెప్పండి అని అడుగుతాడు. నువ్వు ఇక ఏ పని చేయోద్దని వాచ్‌ మెన్‌ డ్యూటీ చేసుకుని వెళ్లిపో అంటుంది ప్రిన్సిపల్.

తర్వాత మనోహరి వెళ్లి బాబ్జీని కలుస్తుంది. ఏంటి మేడం మీరు అంటున్నది. ఇన్నాళ్లు ఎంత చేసినా అవని పని ఒక్క ప్లాన్‌‌తో పూర్తి చేశారా..? అంటాడు బాబ్జి. మనోహరి అవును అనగానే అంటే ఇక మీరు అమరేంద్ర గారిని పెళ్లి చేసుకుంటారా..? అయితే ఇక నా లెక్కంతా చిటికెలో సెటిల్‌ చేసేస్తారు అంటాడు. అది జరగాలంటే.. నువ్వు ఒక పని చేయాలి అంటుంది మనోహరి. ఏం పనో చెప్పండి మేడం. నా పని అవుతుందంటే ఆ ఒక్క పని చేయడానికి రెడీ అంటాడు బాబ్జీ.

బాధ్యత పెరగాలి

దాన్నైతే ఇంట్లోంచి పంపించేశాను. కానీ, ఇప్పుడు నేను ఇంట్లోకి కోడలుగా అమర్‌ లైఫ్‌ లోకి భార్యగా అడుగుపెట్టాలి. అది జరగాలంటే అమర్‌‌కు నా మీద బాధ్యత పెరిగి.. తర్వాత అమర్‌కు నాపై ప్రేమ పుట్టాలి అంటుంది మనోహరి. ఆయనకు మీ మీద ఎలా ప్రేమ పెరుగుతుంది మేడం అంటాడు బాబ్జీ.

నాకు డేంజర్‌ ఉంది. అది కూడా తన వల్లనే వస్తుందని అమర్‌కు తెలిస్తే బాధ్యత అదే పెరుగుతుంది. అది నాకు ప్రమాదం ఉందని నన్ను చంపేయబోతున్నామని నువ్వు చెప్పు. భయంతో బాధ్యత అదే పెరుగుతుంది అని మనోహరి చెబుతుంది. కానీ, అమర్​కి ఫోన్​ చేయమని చెప్పగానే బాబ్జీ భయంతో నేను చేయలేనని వెళ్లిపోతుంటాడు.

మనోహరి బ్లాక్ మెయిల్

అప్పుడే బాబ్జీని మనోహరి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. అమర్‌ నుంచి ఇప్పుడు నేను తప్పా నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని చెప్తుంది. దీంతో బాబ్జీ అమర్‌కు ఫోన్‌ చేసి మనోహరిని చంపబోతున్నానని నీకు దమ్ముంటే ఆపుకో అంటూ చెప్తాడు. దీంతో అమర్‌ షాక్ అవుతాడు. వెంటనే మనోహరికి ఫోన్‌ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు అమర్. వెంటనే ఇంటికి రా అని చెప్తాడు.

దీంతో బాధ్యత బయట పడింది. దాన్ని ఇంటికి వెళ్లి ప్రేమగా మార్చుకుంటాను అని వెంటనే సిమ్‌ మార్చమని బాబ్జీకి చెప్పి వెళ్లిపోతుంది మనోహరి. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024