Best Web Hosting Provider In India 2024
నెలసరి అనేది ప్రతి నెలా ప్రతి స్త్రీకి ఎదురయ్యే ఒక సహజ ప్రక్రియ. నెలసరి సమయంలో పొట్ట నొప్పి, నడుము నొప్పి లేదా మూడ్ లో మార్పులు రావడం సహజం. అయితే, కొన్నిసార్లు ఈ నొప్పి చాలా తీవ్రంగా మారుతుంది. ఈ నొప్పిని ఎదుర్కోవటానికి కొన్నిసార్లు మహిళలు మాత్రలు మింగాల్సి వస్తుంది. ఈ నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే, మీ జీవనశైలిలోని కొన్ని అలవాట్లు, రోజువారీ పనులు కూడా కారణం కావచ్చు. రుతుచక్రం సమయంలో మీరు భరించలేని నొప్పి వస్తుంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
రుతుస్రావంలో నొప్పి ఎందుకు వస్తుంది?
అనారోగ్యకరమైన ఆహారం: శరీరంలో ఒమేగా 3, మెగ్నీషియం, విటమిన్ డి ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొన్ని పోషకాలు లేనప్పుడు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, పొట్ట తిమ్మిరికి దారితీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాలు, జంక్ ఫుడ్స్ తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల మహిళలు ప్రతి నెలా బాధాకరమైన రుతుచక్రాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పొట్ట నొప్పి పెరిగిపోతుంది.
తక్కువ నీరు: మహిళల్లో కొంతమందికి రుతుస్రావ సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. ఇలా నొప్పులు రావడానికి శరీరంలో నీటి కొరత ఉందని అర్థం. దీని వల్ల పొట్ట ఉబ్బరం మొదలవుతుంది. ఇది రుతుస్రావ సమయంలో భరించలేని నొప్పికి దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగాలి. ముఖ్యంగా రుతుస్రావం సమయంలో శరీరానికి ద్రవాహారం ఎక్కువగా అందేలా చూడాలి. హైడ్రేటెడ్‌గా ఉంచండి. నొప్పిని నివారించడానికి మాత్రమే కాదు, శరీరం మొత్తం ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
తగినంత నిద్ర: సరిపడినంత నిద్రపోవడం వల్ల, రుతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్లు మెలటోనిన్, కార్టిసాల్ మధ్య అసమతుల్యత వస్తుంది. దీని వల్ల, రుతుస్రావం సమయంలో ఎక్కువ నొప్పి సంభవిస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇతర వ్యాధులు కూడా శరీరాన్ని చుట్టుముడతాయి. ఈ కారణంగా, రుతుచక్రం సమయంలో వాపు, నొప్పి, మానసిక స్థితిలో తీవ్ర మార్పులు కూడా కనిపిస్తాయి.
అధిక కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం: ఆల్కహాల్ లేదా కెఫిన్ రెండూ శరీరాన్ని నిర్జలీకరణానికి కారణమవుతాయి. ఎవరైనా కెఫీన్ అధికంగా ఉండే పానీయాలను, ఆల్కహాల్ పానీయాలను ఎక్కువగా తీసుకోవడం సరైనది కాదు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆల్కహాల్ లేదా కెఫిన్ తీసుకోకూడదు. రుతుస్రావం సమయంలో, కెఫిన్, ఆల్కహాల్ నివారించాలి, లేకపోతే ఇది రుతుస్రావ సమయంలో తీవ్ర పొట్ట నొప్పి రావచ్చు.
అధిక ఒత్తిడి: మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. నిజానికి ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది రుతుచక్రం వచ్చే సమయాలను కూడా ప్రభావితం చేస్తుంది. రుతుక్రమ అసమతుల్యత వల్ల నొప్పి, తిమ్మిరి, మానసిక స్థితి మార్పుల్లో ప్రమాద సంకేతాలు కనిపిస్తాయి. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి, ఒత్తిడి స్థాయిని తగ్గించడం అవసరం. దీని కోసం యోగా, ధ్యానం చేయవచ్చు.
ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టకపోవడం: వేగంగా శరీర బరువు పెరగడం లేదా తగ్గడం హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టని మహిళలు కూడా ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టకపోవడం వల్ల బరువు వేగంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.