OTT Web Series: దమ్ము లేకపోతే ఇలాంటి వెబ్ సిరీస్ తీయకు.. రాబోయే సిరీస్ డైరెక్టర్‌పై మండిపడిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

Best Web Hosting Provider In India 2024

OTT Web Series: ఓటీటీలోకి త్వరలోనే రాబోతున్న వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్. నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ పై ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా మండిపడుతున్నాడు. నిజాలను చూపించే దమ్ము లేకపోతే ఇలాంటి వెబ్ సిరీస్ తీయొద్దని, మన చరిత్రను వక్రీకరించడం సరికాదని ఓ ట్వీట్ ద్వారా అతనికి క్లాస్ పీకాడు.

నిఖిల్‌ను టార్గెట్ చేసిన వివేక్

నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్ త్వరలో సోనీ లివ్ లో విడుదల కానుంది. ఈ సిరీస్ విడుదలకు ముందు ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విరుచుకుపడ్డాడు.

భారతదేశ విభజన హింసాత్మక, మతపరమైన చరిత్రను చూపించాలంటే కనీసం ఎవరు నేరస్తుడు, ఎవరు బాధితుడు అని చూపించే దమ్ము ఉండాలి.. దేశవిభజన సమయంలో హిందువులు ముస్లింలను భారతదేశం విడిచి వెళ్లమని ఎప్పుడూ అనలేదు అని వివేక్ అన్నాడు.

అసలు ఏం జరిగిందంటే?

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ వెబ్ సిరీస్ ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సిరీస్ లో అల్లర్ల సీన్లను మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే చూపించామని, ఎందుకంటే తాను మతపరమైన రంగును దీనికి పులుమాలని అనుకోలేదని నిఖిల్ చెప్పాడు.

అయితే దీనిపైనే వివేక్ అగ్నిహోత్రి అభ్యంతరం వ్యక్తం చేశాడు. అసలు అల్లర్లు జరిగిందే మతపరంగా అని, ఆ మతం పేరు ఇస్లాం.. మతం రంగు ఆకుపచ్చ అని వివేక్ అన్నాడు. దేశ చరిత్రను వక్రీకరించడం మానుకో అంటూ నిఖిల్ కు అతడు హితవు పలికాడు.

వివేక్ అగ్నిహోత్రి ఏమన్నాడంటే?

నిఖిల్ అద్వానీ ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు పేపర్ క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తూ వివేక్ అగ్నిహోత్రి ఓ ట్వీట్ చేశాడు. అందులో అతడు ఏమన్నాడంటే.. “మొదటిి విషయం.. ఇది కేవలం అల్లర్లు కాదు. ఇది హిందువుల మారణహోమం, మతపరమైన రంగు ఉంది. అది ఆకుపచ్చ.

రెండవది, ఆ హింస పూర్తిగా మతం నుండి ప్రేరణ పొందింది. ఆ మతం పేరు ఇస్లాం. హిందువులు ముస్లింలను భారతదేశం విడిచి వెళ్లమని ఎప్పుడూ అడగలేదు. మీరు మన చరిత్రను ఎందుకు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారు? మీకు అవసరమైతే మీ ఆత్మను అమ్ముకోండి. కానీ చరిత్రతో చెలగాటమాడకండి.

మీరు ఎప్పుడైనా మహాభారతం తీస్తే యుద్ధం మొత్తాన్నీ బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారా? దీనివల్ల మతం కోసం ఎవరు నిలబడ్డారో, ఎవరు నిలవలేదో ఎవరికీ తెలియదు. నిజం వైపు నిలబడండి. కాస్త దమ్ము చూపండి” అని వివేక్ అగ్నిహోత్రి చాలా ఘాటుగా ట్వీట్ చేశాడు.

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ దేశ విభజన సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. ఇది నవంబర్ 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఇరా దూబె, సిద్ధాంత్ దూబెలాంటి వాళ్లు నటించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024