Mirchi Bajji Tips: మిర్చీ బజ్జీలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటించండి

Best Web Hosting Provider In India 2024

మిరపకాయ బజ్జీలు అంటే చాలా మందికి ఓ ఎమోషన్. ఎంతో మందికి ఫేవరెట్ స్నాక్. వాతావారణం చల్లగా ఉన్న సమయాల్లో వేడివేడి బజ్జీలు తింటే ఆ మజానే వేరు అనుకుంటారు. తరచూ మిర్చీ బజ్జీలను చాలా మంది లాగించేస్తుంటారు. అయితే, బయట బండ్లపై దొరికే బజ్జీలతో పోలిస్తే.. ఇంట్లో తయారు చేసుకునేవి చాలా మందికి అంత క్రిస్పీగా, క్రంచీగా రావు. మెత్తగా అవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే బజ్జీలు క్రిస్పీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

కాస్త బియ్యం పిండి, నూనె

శనగపిండిలో కాస్త బియ్యం పిండి కూడా వేసుకుంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. సుమారు 100 గ్రాముల శనగ పిండిలో 20 గ్రాముల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బజ్జీలను బియ్యం పిండి కరకరలాస్తుంది. క్రంచీగా వచ్చేలా చేస్తుంది. శనగ పిండి, బియ్యం పిండి కలిపి జల్లించుకుంటే చాలా మేలు. మొత్తంగా శనగ పిండిలో బియ్యం పిండి 20 శాతం ఉంటే బాగుంటుంది.

శనగ పిండి, బియ్యం పిండి కలిపి నీటితో బజ్జీలను కలుపుకునే సమయంలో దాంట్లో ఓ స్పూన్ వంట నూనె కూడా వేయొచ్చు. నూనె వేయడం వల్ల బజ్జీలు గుల్లగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

కలపడం కూడా..

శనగ పిండి, బియ్యం పిండిలో ఒకేసారి నీళ్లు పోయకుండా.. కొద్దికొద్దిగా వేస్తూ పిండి కలుపుకోవాలి. పిండిని చాలాసేపు కలపాలి. చేత్తో కానీ, విస్కర్‌తో కాని పిండిని వేగంగా వేళ్లతో మిక్స్ చేయాలి. బాగా బీట్ చేస్తేనే బజ్జీలు గుల్లగా, క్రంచీగా వస్తాయి. సరిగా కలపకపోతే బజ్జీలు లోపల మెత్తగానే ఉంటాయి. సరిగా పొంగవు. 

వేయించడంలో ఈ జాగ్రత్తలు

బజ్జీలను నూనెలో ఫ్రై చేసేందుకు కూడా కొన్ని టిప్స్ పాటించాలి. పొయ్యిపై నూనె బాగా వేడెక్కిన తర్వాతే కళాయిలో బజ్జీలు వేయాలి. నూనె చల్లగా ఉన్నప్పుడు వేస్తే సరిగా కాలకపోవటంతో పాటు నూనె పీల్చేస్తుంది. వేడినూనెలో బజ్జీ వేశాక.. మంటను మీడియం ఫ్లేమ్‍కు తగ్గించి.. కాల్చుకోవాలి. మీడియం మంటపై ఫ్రై చేసుకుంటే లోపలి వరకు బజ్జీ కాలుతుంది. కాస్త పొంగుతుంది. బజ్జీ రంగు మారే వరకు మీడియం మంటపై వేయించాలి. చివర్లో కొన్ని సెకన్ల పాటు మంట పెంచి హైఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. దీంతో క్రిస్పీగా వేగుతాయి. కాస్త ఎరుపు రంగులోకి రాగానే బయటికి తీయాలి. 

బజ్జీల తయారీ ఇలా..

శనగపిండి, బియ్యం పిండి, వంట సోడా, కాస్త నూనె, ఉప్పు, వాము వేసుకొని పిండిని నీటితో కలుపుకోవాలి. కావాలంటే కాస్త కారం వేసుకోవచ్చు. పిండిని ఎక్కువ సేపు బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలోకి చీరి విత్తనాలు తీసేసుకున్న మిరపకాయలను పిండిలో ముంచి బజ్జీలను కళాయిలో ఉన్న నూనెలో ఫ్రై చేసుకోవాలి. మిర్చీ చీలికలో నిపేందుకు కావాలంటే రకరకాల స్టఫింగ్స్ తయారు చేసుకోవచ్చు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024