Tank water: చలికాలంలో ట్యాంక్ లోని నీరు త్వరగా చల్లగా మారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

Best Web Hosting Provider In India 2024

చలికాలం వచ్చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి ఎక్కువైపోతోంది. దీని వల్ల పరిసరాలతో పాటూ నీళ్లు కూడా చల్లగా మారిపోతాయి. కొన్ని సందర్భాల్లో వేసవి కంటే చలి కాలం ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ స్నానం చేసేటప్పుడు చల్లని నీళ్లు వాడాల్సి వస్తే మాత్రం విలవిలలాడిపోయే వాళ్లు ఎంతో మంది. ట్యాంక్ లో నీళ్లు శీతాకాలంలో త్వరగా చల్లబడిపోతాయి. రాత్రిపూట స్నానం చేసేవారు, ఉదయం ఏడుగంటల్లోపే స్నానం చేసేవారికి ట్యాంకులోని చల్లని నీళ్లు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ట్యాంకులోని నీళ్లు చల్లగా మారకుండా ఉండేందుకు చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

చాలా మంది వ్యక్తులు గీజర్లు, హీటర్లు ఉపయోగించి నీటిని వేడి చేసుకుంటారు. అయితే అందరికీ ఈ అవకాశం, స్థోమత ఉండకపోవచ్చు. అలాగే ఇంటి అవసరాలకైనా చల్లని నీళ్లు వాడాల్సి రావచ్చు. అప్పుడు చేతులపై చల్లని నీళ్లు పడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది. ట్యాంకులోని నీరు మరీ చల్లగా కాకుండా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉంటే ఆ నీరు వాడేందుకు ఎలాంటి కష్టం ఉండదు. కొన్ని చిట్కాలు, ఉపాయాల ద్వారా శీతాకాలంలో కూడా మీ ట్యాంక్ లోని నీరు వెచ్చగా ఉండేలా చేసుకోవచ్చు.

ట్యాంక్‌లోని నీరు వేడిగా ఉంచేదెలా?

శీతాకాలంలో కూడా ట్యాంక్ నీటిని వెచ్చగా ఉంచాలనుకుంటే, చిన్న ట్రిక్ ను పాటించవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం, మీరు మీ ట్యాంకును ముదురు రంగుతో పెయింట్ చేయాలి. వాస్తవానికి, ముదురు రంగులు వేడిగి గ్రహిస్తాయి. చల్లదనాన్ని స్వీకరించవు. కాబట్టి ట్యాంకులోపల తెలుపు లేదా తేలికపాటి రంగులు కాకుండా ముదురు రంగు పెయింట్ వేయండి. ఇలా చేయడం వల్ల సూర్య కాంతి నుంచి వేడిని గ్రహించి ట్యాంక్ లోపల నీరు వెచ్చగా ఉంటుంది.

శీతాకాలంలో వాటర్ హీటర్ లేదా గీజర్ లేకుండా మీ ట్యాంక్ నీటిని వెచ్చగా ఉంచడానికి మీరు ఇన్సులేషన్ ఉత్పత్తులను కూడా ఉపయోగించవచ్చు. ఫైబర్ గ్లాస్ లేదా ఫోమ్ రబ్బర్ వంటి అనేక ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి బయటి ఉష్ణోగ్రత లోపలికి చేరకుండా అడ్డుకుంటాయి. చలికాలంలో ట్యాంకును వీటితో కప్పి ఉంచితే బయట ఉష్ణోగ్రత ఎంత పడిపోయినా ట్యాంకు లోపల నీరు చల్లగా మారదు.

శీతాకాలంలో ట్యాంక్ నీటిని వెచ్చగా ఉంచడానికి మీరు థర్మోకోల్ షీట్లు కూడా ఉపయోగించవచ్చు. నిజానికి థర్మోకోల్‌ను మంచి ఇన్సులేటర్ గా పిలుస్తారు. దీన్ని ఉపయోగించి వాటర్ ట్యాంకును సులభంగా ఇన్సులేట్ చేయవచ్చు. దీని కోసం, మీకు కొన్ని థర్మోకోల్ షీట్లు అవసరం. ఇవి ఏ స్టేషనరీ దుకాణంలోనైనా సులభంగా లభిస్తాయి. ఈ థర్మాకోల్ షీట్లతో మీ ట్యాంకును బాగా కవర్ చేయండి. ఊడిపోకుండా టేప్‌ల సహాయంతో అతికించండి. వాటర్ ట్యాంక్ మూతను థర్మోకోల్ తో కవర్ చేయండి. దీని వల్ల బయట చల్లని గాలులు వీచినా కూడా ట్యాంకు నీరు చల్లబడవు.

వాటర్ ట్యాంక్ పొజిషన్ కూడా నీటి ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. వాటర్ ట్యాంక్ పెట్టిన ప్రదేశం నీరు చల్లగా ఉండాలా లేక వేడిగా ఉండాలా అన్నది ప్రభావితం చేస్తుంది. వాటర్ ట్యాంకును సూర్యరశ్మి చేరని ప్రదేశంలో ఉంచితే, దాని నీరు వేగంగా చల్లబడుతుంది. చలికాలంలో ట్యాంక్ నీరు గోరువెచ్చగా ఉండాలంటే రోజంతా కాంతి తగిలే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల నీరు త్వరగా చల్లగా మారదు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024