అవును.. సీఎం వైయ‌స్ జగన్‌ మహిళా పక్షపాతే 

Best Web Hosting Provider In India 2024

అమరావతి : అవును.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతే. ‘ఈనాడు’ తనకు నచ్చలేదని ‘పచ్చ’వాతం జబ్బుతో తప్పుడు రాతలు రాస్తే కాకుండాపోతారా! డ్వాక్రా (పొదుపు సంఘాల) మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాక పైసా విదల్చకుండా రాష్ట్రంలో మహిళలను మోసం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఎవ్వరూ పైసా కట్టొద్దంటూ 2014 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీని నమ్మి మహిళలు ఓట్లేశారు.
 
అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన మోసానికి బలైన పేదింటి మహిళలు వారు తీసుకున్న రుణాలపై ఐదేళ్ల పాటు వడ్డీలపై వడ్డీలు కట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరిగిన 2019 ఏప్రిల్‌ 11 నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాల మొత్తం  రూ. 25,571 కోట్లు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘వైయ‌స్ఆర్‌ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *