Best Web Hosting Provider In India 2024
Matsyakara Bharosa : మత్స్యకారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఏప్రిల్ నెలలో ఖాతాల్లోకి రూ.20 వేలు
Matsyakara Bharosa : ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మత్స్యకార భరోసాపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలో రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇంజన్లు, మత్స్యకారుల బోట్లపై 70 శాతం సబ్సిడీని అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.
Matsyakara Bharosa : మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏప్రిల్ లో ప్రారంభమయ్యే వార్షిక చేపల వేట నిషేధ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు రూ.20,000 పరిహారం చెల్లిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకార భరోసా పథకాన్ని కేబినెట్ సమావేశంలో చర్చించి, ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోనున్నారు. కూటమి నేతలు ఎన్నికల హామీల్లో ప్రతి ఏటా మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతామన్నారు. మత్స్యకార భరోసాపై మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి స్పష్టత ఇచ్చారు.
ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ మూడు నెలలు మత్స్యకారుల జీవనాధారానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేవారు. ఈ సాయాన్ని కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెంచి అందిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమలు చేయనున్నారు.
కాకినాడ జిల్లా కోరింగ గ్రామంలో శుక్రవారం ఓఎన్‌జీసీ పైప్‌లైన్ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం చెక్కును అందించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఓఎన్జీసీ పైప్‌లైన్ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన 23,450 మంది మత్స్యకారులకు మంత్రి అచ్నెన్నాయుడు రూ.148.37 కోట్లను విడుదల చేశారు. ఓఎన్జీసీ పైప్‌లైన్ ప్రాజెక్టు కారణంగా 6 నెలలకు పైగా జీవనోపాధిని కోల్పోయిన మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు పరిహారం మొత్తాన్ని నేరుగా జమ చేసినట్లు మంత్రి తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…. ఇంజన్లు, మత్స్యకారుల బోట్లపై 70 శాతం సబ్సిడీని అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.
వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1న మత్స్యకారుల అకౌంట్లలో రూ.20 వేల చొప్పున జమచేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు వలలు, డీజిల్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సొమ్ము ఎగ్గొట్టారని ఆరోపించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలను పునరుద్ధరించామన్నారు.
మత్స్యకార భరోసా పెంపు నిర్ణయంపై సముద్రతీర గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించడం ఉపశమనాన్ని కలిగిస్తుందన్నారు.
సంబంధిత కథనం
టాపిక్