Best Web Hosting Provider In India 2024
Ram Charan VS Niharika: సంక్రాంతికి రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌కు పోటీగా నిహారిక కొణిదెల మూవీ రిలీజ్ – రిలీజ్ డేట్ సేమ్
Ram Charan VS Niharika: రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ తెలుగుతో పాటు తమిళంలో జనవరి 10న రిలీజ్ అవుతోంది. అదే రోజు మెగా డాటర్ నిహారిక కొణిదల నటించిన తమిళ మూవీ మద్రాస్కారణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఫస్ట్ తెలుగు సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీగా గేమ్ ఛేంజర్‌ను మేకర్స్ ప్రమోట్ చేస్తోన్నారు.
తమిళంలో క్రేజ్…
స్వతహాగా శంకర్ తమిళ డైరెక్టర్ కావడం, కోలీవుడ్‌లో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా తమిళంలో గేమ్ ఛేంజర్ మూవీపై భారీగా క్రేజ్ ఏర్పడింది. పొంగల్‌కు రిలీజ్ అవుతోన్న తమిళ సినిమాలకు ధీటుగా గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతోంది.
మద్రాస్కారణ్ రిలీజ్…
సంక్రాంతికి తమిళంలో ఆరు సినిమాలు రిలీజ్ అవుతోన్నాయి. అజిత్ విదాముయార్చి పొంగల్ రేసు నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండుగ బరిలో నిలిచాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న తమిళ సినిమాల్లో మద్రాస్కారణ్ ఒకటి.
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో షేన్ నిగమ్, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ మూవీతోనే మెగా డాటర్ తమిళంలోకి నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. మద్రాస్కారణ్ మూవీ కూడా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రామ్‌చరణ్ వర్సెస్ నిహారిక..
ఒకే రోజు మెగా ఫ్యామిలీకి చెందిన రామ్‌చరణ్, నిహారిక సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతుండటం ఆసక్తికరంగా మారింది. రామ్‌చరణ్ భారీ బడ్జెట్ మూవీకి నిహారిక సినిమా ఎంత వరకు పోటీ ఇస్తుందన్నది మరో ఆరు రోజుల్లో తేలనుంది.
విజయ్ సేతుపతి మూవీ…
నిహారిక నటిస్తోన్న రెండో తమిళ సినిమా ఇది. 2018లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఒరు నల్ల నాల్ పాథు సోల్రెన్ మూవీలో నిహారిక ఓ కీలక పాత్రలో నటించింది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మద్రాస్కారణ్ మూవీతో కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది.
మద్రాస్కారణ్ మూవీకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఈ సినిమా కోసం మణిరత్నం సఖి సినిమాలోని ఓ పాటను రీమిక్స్ చేశారు. ఇటీవల రిలీజైన ఈ రీమిక్స్ సాంగ్‌లో నిహారిక రొమాంటిక్‌గా కనిపించడంపై ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు.
కమిటీ కుర్రాళ్లుతో హిట్…
గత ఏడాది రిలీజైన కమిటీ కుర్రాళ్లు మూవీతో ప్రొడ్యూసర్‌గా పెద్ద హిట్ అందుకున్నది నిహారిక. హీరోయిన్గా కూడా ఆమెకు లక్ కలిసి వస్తుందా? కోలీవుడ్‌లో ఫస్ట్ హిట్ అందుకుంటుందన్న అన్నది జనవరి 10న తేలనుంది. మద్రాస్కారణ్ ప్రమోషన్స్‌లో నిహారిక పాల్గననున్నది.
మూడు సినిమాలు…
మరోవైపు తెలుగులో ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.