Best Web Hosting Provider In India 2024
NNS 5th January Episode: బయటపడ్డ అమర్ సీక్రెట్ – అల్లుడిపై రామ్మూర్తి ఫైర్ – మనోహరి బిల్డప్పులు
NNS 5th January Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 5 ఎపిసోడ్‌లో పౌర్ణమి రోజు అరుంధతికి శక్తులు రానున్నాయని, ఆ శక్తులతో నిన్ను చంపడం ఖాయమని మనోహరిని హెచ్చరిస్తాడు ఘోర. అరుంధతి తనను ఏం చేయలేదంటూ ఘోర ముందు బిల్డప్పులు ఇస్తుంది మనోహరి.
ఆశ్రమంలో వార్డెన్…. అమర్ చెప్పొద్దంటేనే తనకు నిజం చెప్పలేదని తెలుసుకుంటాడు రామ్మూర్తి. తన కూతురు గురించి ఎందుకు తనకు చెప్పొద్దన్నారో అమర్‌తోనే తేల్చుకుంటానని వెళ్లిపోతాడు. వార్డెన్ వెంటనే రాథోడ్‌కు ఫోన్ చేసి.. రామ్మూర్తి ఆశ్రమానికి వచ్చిన విషయం చెప్తుంది.
నిజం తెలుసుకోవడానికి అమర్ కోసం వస్తున్నాడని చెప్పగానే రాథోడ్ పరుగెత్తుకుని అమర్ దగ్గరకు వెళ్లి ఫోన్ ఇస్తాడు. రాథోడ్ పరుగెత్తడం చూసిన మిస్సమ్మ వెనకాలే వెళ్తుంది. ఫోన్ తీసుకున్న అమర్ మిస్సమ్మను చూసి ఫోన్ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు.
మిస్సమ్మ ప్రశ్నలు…
అమర్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్లడంతో మిస్సమ్మలో అనుమానాలు మొదలవుతాయి. ఏమైంది రాథోడ్ ఆయన ఆలా వెళ్లిపోయారు, నువ్వు ఎందుకు అంతగా పరుగెత్తుకొచ్చావు. ఏదో ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది అంటున్నావు ఏ ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది మా అక్క గురించి ఎమైనా తెలిసిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. లేదని చెప్పి రాథోడ్ కూడా బయటకు వెళ్లిపోతాడు.
రాథోడ్ టెన్షన్…
సార్ ఆ పెద్దాయనకు నిజం తెలిసి ఇక్కడికే వస్తున్నాడు ఇప్పుడు ఎలా సార్ అంటాడు. ఏం జరిగినా నిజం మాత్రం నేను చెప్పను రాథోడ్ అంటాడు అమర్. ఇద్దరు మాట్లాడుకుంటుంటే మిస్సమ్మ వచ్చి ఏమైందని సైగ చేస్తుంది. ఏం లేదని అమర్ సైగ చేయగానే వెళ్లిపోతుంది. కోటి ప్రశ్నలతో మీ సమాధానం కోసం వచ్చే ఆ తండ్రికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్ అని అమర్‌తో అంటూ రాథోడ్ టెన్షన్ పడతాడు.
నిజం తెలిసిందేమోనని….
అస్థికలు కనిపించకుండా పోయాయన్న భయంలో నిన్ను నాలుగు మాటలు అన్నాను మనసులో పెట్టుకోవద్దని ఘోరతో అంటుంది మనోహరి. కానీ ఘోర తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అని ఘోరను అడుగుతుంది మనోహరి.
ఆ భాగమతికి నువ్వే అరుంధతిని చంపేశావని తెలిసిందేమోనని ఆలోచిస్తున్నాను అని ఘోర చెప్పగానే.. అది కొన్నిసార్లు తెలిసినట్టే నాతో మాట్లాడుతుంది. ఆ అరుంధతే ఎప్పుడో చెప్పి ఉంటుందని మనోహరి చెప్పగానే ఘోర నవ్వుతాడు.
నిజం చెప్పదు…
నా బాధను చూస్తే నీకు నవ్వుగా ఉందా..? అని మనోహరి అడుగుతుంది. నీ పిచ్చితనం చూసి నవ్వొచ్చింది. కొన్ని నెలలు ఆ ఆత్మను చూసిన నాకే అరుంధతి మంచితనం అర్థం అయింది. నీకు అర్థం కాలేదా..? ఆరు నిజం చెప్పడం ఎంత సేపు.. కానీ ఆమె నిజం చెప్పలేదు.. ఎప్పటికీ చెప్పదు. ఎందుకంటే అరుంధతికి తన పగ కంటే తన కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. స్నేహానికి ఒకవైపు నువ్వు ఉంటే రెండో వైపు అరుంధతి ఉంది.
తప్పుల్లో మంచి…
ప్రతి విషయంలో నువ్వు తప్పు వెతికితే.. నీ తప్పుల్లో కూడా మంచిని వెతికింది. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పౌర్ణమి రోజు అరుంధతికి శక్తులు రాగానే నీ అంతం చూస్తుంది జాగ్రత్తగా ఉండమని అంటాడు ఘోర. దాని ముఖం అదేం చేస్తుంది అంటుంది మనోహరి.
యముడు ఎంట్రీ…
గార్డెన్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటాడు గుప్త. అప్పుడే అక్కడికి యముడు ఎంట్రీ ఇస్తాడు. నిద్రపోతుంటే..యముడు వచ్చి గుప్త నీ స్థాయి ఏంటి నువ్వు చేస్తున్నపనులేంటి అసలు నీ చుట్టూ ఏం జరగుతుందో చూస్తున్నావా..? అని అడగ్గానే ఉన్న ఒక్క శక్తిని మీరే తీసుకున్నారు ఇక నాకెలా తెలుస్తుంది అంటాడు గుప్త.
దీంతో రామ్మూర్తి ఇంటికి వస్తున్న విషయం చెప్తాడు యముడు. దీంతో వెంటనే ఈ బాలిక ఇక్కడ ఉండకుండా ఎక్కడికైనా తీసుకెళ్లాలి అంటూ ఆరు కోసం వెతుకుతాడు. గట్టిగా పిలుస్తాడు. ఆరు రాగానే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అంటాడు. సరే వెళ్దాం పద అంటుంది ఆరు. ఇద్దరూ వెళ్లబోతుంటే.. ఇంతలో రామ్మూర్తి కోపంగా ఇంట్లోకి వస్తాడు.
రామ్మూర్తి ఆవేశం…
రామ్మూర్తిని చూసి ఆరు ఎందుకు గుప్త గారు ఆయన అంత కోపంగా వస్తున్నారు ఏం జరిగిందో చూద్దా పదండి అంటూ కిటికీ దగ్గరకు వెళ్తుంది. లోపలికి వెళ్లిన రామ్మూర్తిని చూసి మిస్సమ్మ ఆశ్చర్యంగా ఎప్పుడు వచ్చారు నాన్నా అంటూ ప్రేమగా అడుగుతుంది. రామ్మూర్తి పలకకుండా అల్లుడు గారు ఎక్కడున్నారు అని అడుగుతాడు. పిల్లుల, నిర్మల, శివరాం వచ్చి పలకరించినా పలకకుండా అల్లుడు గారు ఎక్కడున్నారు అని రామ్మూర్తి అడుగుతాడు.
మనోహరి ఫైర్…
ఎందుకు నాన్నా మీరు ఇంత ఆవేశంగా ఉన్నారు అంటూ మిస్సమ్మ అడగ్గానే.. ఎందుకంటే నా పెద్ద కూతురు గురించి అమర్‌కు నిజం తెలుసు కాబట్టి అంటూ కోప్పడతాడు. ఆయనకు నిజం తెలియడం ఏంటని అడుగుతుంది మిస్సమ్మ.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అమర్అ లాంటోడు కాదని నిర్మల చెప్తుంది. ఇంతలో మనోహరి వచ్చి రామ్మూర్తిని తిడుతూ పుట్టగానే అందరినీ దూరం చేసుకున్న అంత గొప్ప జాతకురాలి గురించి ఇంత వెతకడం ఏంటని అనగానే రామ్మూర్తి కోపంగా మనోహరిని తిడతాడు.అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగిసింది.