ఎన్టీఆర్ జిల్లా / పొన్నవరం :
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి జస్టిస్ ఎన్.వి రమణ గారికి వివరించిన ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ గారు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేయగా , కార్యక్రమాలను ముగించుకుని మార్గమధ్యంలో తన స్వగ్రామమైన వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామానికి రావడంతో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సత్కరించారు ,
ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి ఎన్ వి రమణ గారికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు వివరించారు , అనంతరం కొద్ది సేపు పలు విషయాలపై ముచ్చటించారు , ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు ,స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..