Allu Arjun : శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.. ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు

Best Web Hosting Provider In India 2024

Allu Arjun : శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.. ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు

Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను.. హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. బన్నీ రాక నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాలుడి కుటుంబానికి బన్నీ, చిత్ర దర్శక నిర్మాతలు ఆర్థిక సాయం చేశారు.

ఆస్పత్రి వద్ద అల్లు అర్జున్
ఆస్పత్రి వద్ద అల్లు అర్జున్

 

హీరో అల్లు అర్జున్‌ సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంగళవారం ఉదయం పరామర్శించారు. అల్లు అర్జున్‌తో నిర్మాత దిల్‌ రాజు ఆస్పత్రికి వచ్చారు. అల్లు అర్దున్ ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

తొక్కిసలాటలో..

2024 డిసెంబర్ 4న పుష్ప2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌ ఏరియాకు చెందిన రేవతి చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడిని కిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి బాలుడు చికిత్స పొందుతున్నా.. అల్లు అర్జున్ పరామర్శలకు రాలేదనే విమర్శలు వచ్చాయి.

బన్నీ వివరణ..

అయితే.. కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లొద్దని తన లీగల్‌ టీమ్‌ చెప్పడంతో.. శ్రీతేజ్‌ వద్దకు రాలేదని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్‌ వివరించారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించారు.

ఆర్థిక సాయం..

అటు ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌, పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, డైరెక్టర్ సుకుమార్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. అల్లు అర్జున్‌ రూ.కోటి సాయం చేయగా.. పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షల సాయం చేశారు. ఈ చెక్కులను ఇటీవల దిల్‌ రాజు ద్వారా ఆ కుటుంబానికి ఇచ్చారు.

 

రెగ్యులర్ బెయిల్..

అల్లు అర్జున్‌‌కు ఇటీవలే నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో అల్లు అర్జున్ కోర్టుకు వచ్చి.. సంతకం చేసిన బెయిల్‌ పూచీకత్తు పత్రాలు అందించారు. అల్లు అర్జున్‌కు పలు షరతులు విధించింది. కేసు గురించి ఎవరితో మాట్లాడవద్దని.. సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది.

ప్రతీ ఆదివారం..

అంతేకాకుండా.. ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. అటు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టును కోరారు. అల్లు అర్జున్‌ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. అల్లు అర్జున్‌కు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Whats_app_banner
 

టాపిక్

 
Allu ArjunHyderabadPushpa 2 The RuleTs PoliceTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024