Best Web Hosting Provider In India 2024
KTR Comments : నా మాటలు రాసిపెట్టుకోండి.. ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగొస్తా : కేటీఆర్
KTR Comments : ఫార్ములా ఈ కార్ రేసు, తెలంగాణ ఏసీబీ కేసు, మరోసారి ఈడీ నోటీసులు.. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన నేపథ్యంలో.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆలస్యంగానైనా నిజాలు బయటకు వస్తాయన్న కేటీఆర్.. సత్యం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘నా మాటలు రాసిపెట్టుకోండి.. ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగొస్తా.. మీ అబద్ధాలు నా గొంతును నొక్కలేవు. మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. ఆలస్యంగానైనా నిజాలు బయటకు వస్తాయి. న్యాయవ్యవస్థను గౌరవిస్తా. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. సత్యం కోసం పోరాటం కొనసాగుతుంది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
టాక్ ఆఫ్ ది తెలంగాణ..
కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారాయి. కేటీఆర్ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశారనే చర్చ జరుగుతోంది. జైలుకెళ్తానని కేటీఆర్ డిసైడ్ అయినట్టు ఉన్నారని కాంగ్రెస్ కేడర్ సెటైర్లు వేస్తోంది. అయితే.. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. రేవంత్ సర్కారుకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.
క్వాష్ పిటిషన్ డిస్మిస్..
ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. హైకోర్టులో తొలుత కేటీఆర్‌కు ఊరట లభించింది. కానీ.. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన ఉన్నత న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
అరెస్టు తప్పదా..
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఓవైపు తెలంగాణ ఏసీబీ, మరోవైపు ఈడీ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చాయి. అయితే.. హైకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉందని, న్యాయస్థానం తీర్పు తర్వాత విచారణకు వస్తానని ఈడీకీ కేటీఆర్ లేఖ రాశారు. అటు ఏసీబీ విచారణకు వెళ్లినా.. అధికారుల ముందు హాజరు కాలేదు. తన లాయర్లను తనతో పంపాలని కేటీఆర్ కోరగా.. అధికారులు నిరాకరించారు. దీంతో విచారణకు హాజరవ్వకుండానే వెనుతిరిగారు. సరిగ్గా ఇదే సమయంలో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. దీంతో ఇక కేటీఆర్ అరెస్టు తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కేటీఆర్ కంటే ముందే..
తెలంగాణ హైకోర్టు నుంచి ఆశించిన ఆదేశాలు రాలేదు. దీంతో కేటీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కేటీఆర్ కంటే ముందుగానే సుప్రీం తలుపు తట్టింది. కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే.. తమ వాదనలు కూడా వినాలని విజ్ఞప్తి చేసింది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంంలో.. కేటీఆర్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
టాపిక్