Heroes Children Favourites: సౌత్ స్టార్ హీరోల పిల్లల ఫేవరేట్ హీరోలు వీళ్లే! అతన్ని పులి అంకుల్ అంటారట!

Best Web Hosting Provider In India 2024

Heroes Children Favourites: సౌత్ స్టార్ హీరోల పిల్లల ఫేవరేట్ హీరోలు వీళ్లే! అతన్ని పులి అంకుల్ అంటారట!

Sanjiv Kumar HT Telugu
Jan 08, 2025 05:30 AM IST

South Heroes Children’s Favourite Heroes Or Actors: మెగాస్టార్ చిరంజీవి, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ హీరో సూర్య వంటి ఎంతోమంది సౌత్ హీరోలు అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ, తెలుగు స్టార్ హీరోల పిల్లలకు ఇష్టమైన హీరోలు వేరే కూడా ఉన్నారు. మరి వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.

సౌత్ స్టార్ హీరోల పిల్లల ఫేవరేట్ హీరోలు వీళ్లే! అతన్ని పులి అంకుల్ అంటారట!
సౌత్ స్టార్ హీరోల పిల్లల ఫేవరేట్ హీరోలు వీళ్లే! అతన్ని పులి అంకుల్ అంటారట!

South Heroes Children’s Favourite Heroes: సాధారణంగా హీరోలంటే అభిమానులు ఉంటారు. వారికోసం ఎలాంటి పనులైన చేస్తుంటారు. హీరోలు అంటే సాధారణ ఆడియెన్స్‌కు ఇష్టముంటుంది. అలాంటిది మనకు నచ్చిన హీరోల పిల్లలకు వేరే కథానాయకులు లేదా నటులు ఇష్టమైతే. అవును, మన ఫేవరేట్ హీరోల పిల్లలకు ఇష్టమైన లేదా ఫేవరేట్ హీరోలు, నటులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

yearly horoscope entry point

అల్లు అయాన్

పుష్ప ది రైజ్ సినిమాతో ఐకానిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్స్ రాబడుతోంది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి దంపతులకు అల్లు అయాన్, అల్లు అర్హ ఇద్దరు పిల్లలు అని తెలిసిందే.

అయితే, అల్లు అయాన్‌కు ఫేవరేట్ హీరో అనేసరికి చిరంజీవి, అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ అనుకున్నారు. కానీ, అల్లు అయాన్‌కు ఇష్టమైన హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ విషయాన్ని ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లోని ఓ ఎపిసోడ్‌రు అల్లు అర్జున్‌తోపాటు హాజరైన అల్లు అయాన్ చెప్పాడు. అలా చెప్పి అల్లు అర్జున్ షాక్‌కు ఇచ్చాడు తన కుమారుడు అల్లు అయాన్.

అల్లు అర్హ

అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హకు ఇష్టమైన హీరో రామ్ చరణ్ అట. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, ధ్రువ, మగధీర సినిమాలంటే అల్లు అర్హకు పిచ్చి ఇష్టమని సమాచారం. RRR సినిమాను ఇప్పటికీ ఇంట్లో వంద సార్లు చూసిందని.. అలాగే, రామ్ చరణ్ సినిమాను ఫస్ట్ డే కచ్చితంగా చూడాలని పట్టుబడుతుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేదు. ఇలా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

మరియం అమీరా సల్మాన్

ఇటీవల లక్కీ భాస్కర్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు అమల్ సూఫియాతో 2011లో వివాహాం జరిగింది. దుల్కర్ సల్మాన్-అమల్ సూఫియా దంపతులకు ‘మరియం అమీరా సల్మాన్’ కూతురు ఉంది. కానీ, తన ఏడేళ్ల కూతురును ఇంట్లో అందరూ ‘కుంజు మరియం’ అని ముద్దుగా పిలుచుకుంటారు.

దుల్కర్ సల్మాన్ కూతురు మరియం అమీరా సల్మాన్‌కు ఇష్టమైన హీరో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. ఈ విషయాన్ని లక్కీ భాస్కర్ మూవీ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ చెప్పినట్లు సమాచారం. అలాగే, కుంజు మరియంకు హ్యారిపోటర్ అంటే చాలా ఇష్టమట. అందుకే తన కూతురును ‘పెద్ద పోటర్ హెడ్’ అని దుల్కర్ సల్మాన్ పిలుస్తుంటాడని సమాచారం.

దియా-దేవ్

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. అలాగే, సీనియర్ హీరోయిన్ జ్యోతికకు కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అలాంటి సూర్య-జ్యోతిక దంపతుల పిల్లలకు ఇష్టమైన హీరో వేరే ఉన్నారు. సూర్య, జ్యోతికకు కూతురు దియా, కుమారుడు దేవ్ ఉన్నారు. వారిద్దరికి ఇళయ దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య తన పిల్లలకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చాడు. తన పిల్లలిద్దరికి కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ అంటే చాలా ఇష్టమని, విజయ్ నటించిన పులి మూవీని ఎన్నో సార్లు చూశారని, అందుకే దళపతిని పులి అంకుల్ అని కూడా పిలుస్తారని సూర్య తెలిపాడు.

రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ తో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న రామ్ చరణ్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి రామ్ చరణ్‌కు ఇష్టమైన హీరో సూర్య, అతని యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024