Best Web Hosting Provider In India 2024
NNS 8th January Episode: నిజం తెలుసుకున్న రామ్మూర్తి.. ఆరు ఇక్కడే ఉందన్న అమర్.. అక్క గురించి తెలుసుకోలేకపోయిన మిస్సమ్మ!
NNS 8th January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 8) ఎపిసోడ్లో రామ్మూర్తికి అసలు నిజం తెలిసిపోతుంది. ఆరు అక్కడే ఉందని అమర్ చెప్పడంతో ఆమె కోసం అంతటా వెతుకుతాడు. అటు మిస్సమ్మకు మాత్రం తన అక్క గురించి ఏమీ తెలియదు.
NNS 8th January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 8) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. దేవుడు నా ద్వారా తండ్రీ కూతుళ్లు ఇద్దరికీ ఒకేసారి నిజం చెప్పించాడు అని అమర్ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. ఏంటి బాబు మీరు చెప్పేది నా కూతురు ఇక్కడ ఉందా..? అని రామ్మూర్తి అడుగుతాడు. అవునని అమర్ చెప్తాడు.
ఆరును తలచుకొని ఏడ్చిన రామ్మూర్తి
వెంటనే రామ్మూర్తి అమ్మా తల్లి నువ్వు ఇక్కడే ఉన్నావా తల్లి అని ఏడుస్తూ ఎక్కడున్నావు అమ్మా అంటూ ఆశ్రమం మొత్తం తిరుగుతూ ఇక్కడే ఉన్నావంట నాకు ఒక్కసారి కనిపించు తల్లి.. అమ్మా నువ్వు బతికే ఉన్నావని తెలిసిన రోజు నుంచి నీ కోసం వెతకని రోజు లేదు తల్లి. ఈ చేతగాని తండ్రి కడుపున పుట్టిన నువ్వు జీవితాంతం బాధపడ్డావు తల్లీ. బాబు నా కూతురు ఇక్కడే ఉంది అంటున్నావు కదా.. నా కూతురుని ఒక్కసారి చూపించు బాబు అని రామ్మూర్తి అడగ్గానే.. నాకు కూడా తెలియదండి.. కాకపోతే ఈ పరిస్థితులు నాకు అలాగే చెప్పాయి అంటాడు అమర్.
రక్షకుడిలా నిన్ను రక్షించుకోవాల్సిన నేనే నీ పాలిట భక్షకుడిని అయ్యాను తల్లి.. ఆ ఇంటికి వచ్చిన ప్రతిసారి నా ఒళ్లు ఎందుకు జలదరించిందో.. నీ పిల్లలను చూసినప్పుడు నా గుండె ఎందుకు పులకరించిందో నువ్వు చనిపోయావని తెలిశాక ఈ గుండె ఎందుకు ఇంత బరువెక్కిదో ఇప్పుడు అర్థం అయింది తల్లి అంటూ బోరున ఏడుస్తుంటాడు రామ్మూర్తి.
అక్క గురించి తెలుసుకోలేకపోయిన మిస్సమ్మ
అప్పుడే అక్కడికి మిస్సమ్మ వస్తుంది. ఆశ్రమం బయట కారు చూసి రాథోడ్.. నాన్నను ఆశ్రమానికి తీసుకొచ్చాడా..? అనుకుని ఆశ్రమం లోపలికి పరుగెడుతుంది. రామ్మూర్తి ఏడ్వడం చూసి నాన్నా అంటూ లోపలికి పరుగెత్తుకొస్తుంది. మిస్సమ్మను చూసిన గుప్త ఆరును పక్కకు తీసుకెళ్తాడు. నాన్నా ఏమైంది నాన్నా ఎందుకలా ఏడుస్తున్నారు. ఏవండి ఎందుకు నాన్నా ఇంతలా ఏడుస్తున్నారు. రాథోడ్ నువ్వైనా చెప్పు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు. నాన్నా ఎందుకు ఏడుస్తున్నారు అంటూ అడుగుతుంది.
ఏం లేదు అమ్మా ఈ రోజైనా అక్కను చూద్దామనుకున్నాను. కానీ అనాథ ఆశ్రమం వాళ్లు నా బాధ చూసి మీ ఆయనకు అక్క గురించి తెలుసు అన్నారట. అని చెప్పగానే నాన్నా ఇంత చిన్న విషయానికి అంతలా ఏడవాలా…? మనం ఇంటికి వెళ్దాం పద నాన్నా అంటూ రామ్మూర్తిని తీసుకుని ఇంటికి వెళ్తుంది మిస్సమ్మ.
మనోహరిలో ఆందోళన
అయిపోయింది అంతా అయిపోయింది. ఆ ముసలోడు వెళ్లిన స్పీడుకు అమర్‌ను గట్టిగా నిలదీసి ఉంటాడు. ఆరు విషయంలో అమర్ ఎంత సున్నితంగా ఉంటాడో నాకు తెలుసు. ఆరు తండ్రిని బాధపెట్టడం ఇష్టం లేక నిజం చెప్పి ఉంటాడు. ముసలోడు మిస్సమ్మకు నిజం చెప్తాడు. ఎవరో పిల్లలు అంటేనే ప్రాణం పెట్టింది. ఇక సొంత అక్క పిల్లుల అని తెలిస్తే.. తన అక్కను నేనే చంపానని తెలిస్తే.. నన్ను ఏదైనా చేస్తుంది అంటూ మనోహరి బాధపడుతుంది.
ఆ ముసలోడు మిస్సమ్మకు నిజం చెప్పడు.. అరుంధతి ఏమైనా పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉందా..? తను చచ్చింది అని మిస్సమ్మకు తెలిస్తే తట్టుకోలేదని నిజం చెప్పరు అంటాడు ఘోర. అవును కదా..? ఇప్పుడు మహా అయితే ఏం చేస్తారు. అమర్ వాళ్లతో కలిసి కాశికి వెళ్లి దాని అస్థికలు గంగలో కలుపుతారు అంటూ నోరు జారగానే.. ఘోర కోపంగా చూస్తుంటాడు. అస్థికలు ఎప్పుడు తీసుకొస్తావు.. అలాగే రేపు ఆత్మ ఎవరి శరీరంలోకి వెళ్తుందో కనిపెట్టి నాకు చెప్పాలి అంటాడు. సరే నేను కనిపెట్టి నీకు చెప్తాను అని మనోహరి చెప్పగానే.. అలాగే రేపు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తాడు. రేపు ఒక్కరోజు ఆత్మ నుంచి తప్పించుకుంటే ఇక విజయం నీదే అంటాడు. సరే నా జాగ్రత్తలో నేను ఉంటాను అంటూ మనోహరి వెళ్లిపోతుంది.
నిజం చెప్పని రామ్మూర్తి
రామ్మూర్తి, అమర్, మిస్సమ్మ, రాథోడ్ ఇంటికి వస్తారు. రాగానే రామ్మూర్తి పశ్చాతాపంతో కుమిలిపోతూ నిర్మల, శివరాంలకు సారీ చెప్తాడు. ఇందాకా మీతో దురుసుగా ప్రవర్తించాను అంటూ బాధపడతాడు. ఇంతలో శివరాం తాము రేపు ఆరు అస్థికలు గంగలో కలపడానికి వెళ్తున్నాము మీరు రండి అని పిలవగానే వస్తాను తప్పకుండా వస్తాను. నా కూతురు ఆత్మ శాంతి కోసం తప్పకుండా వస్తాను అంటాడు రామ్మూర్తి. మీ కూతురు ఏంటి బావగారు అని శివరాం అడుగుతాడు.
అదే తను కూడా నా కూతురు లాంటిదే కదా అందుకే అలా చెప్పాను అంటాడు రామ్మూర్తి. మనోహరి మాత్రం ముసలోడికి నిజం తెలిసినా చెప్పడం లేదేంటి అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మకు నిజం తెలియకుండా అమర్ ఏం చేస్తాడు? అమర్‌ని దక్కించుకోవడానికి మనోహరి ఏం ప్లాన్ చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి 08న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్