Best Web Hosting Provider In India 2024
AP Inter 1st Year Exams : ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు అవాస్తవం, బోర్డు క్లారిటీ
AP Inter 1st Year Exams : ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. పరీక్షలు రద్దు అవాస్తవ ప్రచారమని స్పష్టం చేసింది.
AP Inter 1st Year Exams : ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇంటర్ బోర్టు క్లారిటీ ఇచ్చింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ విద్యలో కొన్ని సంస్కరణలు తీసుకోస్తున్నట్లు పేర్కొంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ చేస్తు్న్న ప్రచారం అవాస్తమని ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ డా.కృతికా శుక్లా ఓ ప్రకటన జారీ చేశారు.
“2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్‌ను నిలిపివేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాము. bie.ap.gov.in పోర్టల్‌లో ఇంటర్ బోర్డు ప్రతిపాదిత విద్యాసంబంధ సంస్కరణలు ప్రజలకు అందుబాటులో ఉంచాము. ” – డా. కృతికా శుక్లా, కార్యదర్శి, ఇంటర్ బోర్డు
ఈ విషయంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రద్దు చేయడంలేదని పేర్కొంది. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరినట్లు తెలిపింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలని ఇంటర్ బోర్డు కోరినట్లు తెలిపింది. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు http://bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని సూచించింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పలు సంస్కరణలకు ఇంటర్ బోర్డు ముసాయిదా విడుదల చేసింది. దీనిపై సామాన్య ప్రజలు, విద్యార్థుల తల్లదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు సూచనలు చేయాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కోరారు. ప్రతిపాదిత సంస్కరణల నమూనాలు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంటాయి.
కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా సమూల మార్పులు చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే సంస్కరణల్లో ఇంటర్ పరీక్షల్ని 500 మార్కులకు నిర్వహిస్తారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల్లో పరీక్షల్ని 500 మార్కులకు పరిమితం చేస్తారు. ఆర్ట్స్ సబ్జెక్టుల్లో సివిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులో 100 మార్కులకు 80మార్కులకు థియరీ పరీక్షల్ని నిర్వహిస్తారు. ప్రాజెక్ట్ వర్క్, పరిశోధనా కార్యక్రమాలకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. ప్రతి కోర్సుకు గరిష్టంగా 500 మార్కులకు పరీక్షలు జరుగుతాయి.
సంబంధిత కథనం
టాపిక్