Best Web Hosting Provider In India 2024
OTT Mystery Thriller Movie: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న మలయాళం బ్లాక్బస్టర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ..
OTT Comedy Mystery Thriller Movie: ఓటీటీలోకి ఓ మలయాళం బ్లాక్బస్టర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీ పేరు సూక్ష్మదర్శిని. గతేడాది నవంబర్ లో రిలీజైన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతోంది.
OTT Comedy Mystery Thriller Movie: మలయాళం సినిమాలంటే తక్కువ బడ్జెట్ తోనే భారీ వసూళ్లు సాధిస్తాయి. అలా వచ్చిన మరో మూవీ సూక్ష్మదర్శిని. బేసిల్ జోసెఫ్, నజ్రియాలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజై మంచి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.
సూక్ష్మదర్శిని ఓటీటీ రిలీజ్ డేట్
మిస్టరీ థ్రిల్లర్ కు బ్లాక్ కామెడీని జోడించి తీసిన మలయాళం మూవీ సూక్ష్మదర్శిని. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్స్టార్ జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గురువారం (జనవరి 9) తన ఎక్స్ అకౌంట్ ద్వారా హాట్స్టార్ వెల్లడించింది.
థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. తెలుగులోనూ రానుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా హాయిగా ఈ మూవీని చూసి నవ్వుతూ థ్రిల్ ఫీలవ్వొచ్చు.
సూక్ష్మదర్శిని స్టోరీ ఏంటంటే?
సూక్ష్మదర్శిని మూవీ గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది, మలయాళ కామెడీ హీరో బేసిల్ జోసెఫ్, ఫహాద్ ఫాజిల్ భార్య, నటి నజ్రియా కలిసి నటించిన మూవీ ఇది. ఎంసీ జితిన్ డైరెక్ట్ చేశాడు. ఇదొక బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీ ప్రియదర్శిని, ఆమె భర్త ఆంటోనీ, కూతురు కని చుట్టూ తిరిగే కథ.
ఆమె తన కాలనీలోని అందరితో కలిసి మెలిసి ఉంటుంది. ఆమె ఉంటున్న కాలనీలోకి కొత్తగా మాన్యుయేల్ అనే వ్యక్తి తన తల్లితో కలిసి వస్తాడు. అతడు కూడా అక్కడున్న వాళ్లందరికీ కలిసిపోయినా.. అతన్ని కాస్త అనుమానంగా చూస్తుంది ప్రియదర్శిని. దీంతో అతనిపై ఓ కన్నేసి ఉంచగా.. కొన్ని ఊహకందని నిజాలు తెలుస్తాయి.
ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఇందులో ప్రియ పాత్రలో నజ్రియా, మాన్యుయేల్ పాత్రలో బేసిల్ జోసెఫ్ నటించారు. దీపక్ పరంబోల్.. ప్రియ భర్త ఆంటోనీ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏకంగా రూ.55 కోట్ల వరకూ వసూలు చేసింది. దీంతో హాట్స్టార్ లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం