Brahmamudi January 10th Episode: రుద్రాణిపైకి అస్త్రంగా కనకం- సీమంతం ప్లాన్‌ను తిప్పికొట్టిన కావ్య- పాపం స్వప్న బలి!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 10th Episode: రుద్రాణిపైకి అస్త్రంగా కనకం- సీమంతం ప్లాన్‌ను తిప్పికొట్టిన కావ్య- పాపం స్వప్న బలి!

Sanjiv Kumar HT Telugu
Jan 10, 2025 07:23 AM IST

Brahmamudi Serial January 10th Episode: బ్రహ్మముడి జనవరి 10 ఎపిసోడ్‌లో వెండి కుంకుమ భరిణ బహుమతిగా ఇచ్చి మరి స్వప్నకు సీమంతం జరిపించాలని రుద్రాణి అంటే కావ్య ఒప్పుకుంటుంది. అలా ఇంట్లో గొడవ పెడదామని ధాన్యలక్ష్మీతో ప్లాన్ చేస్తుంది. కానీ, ఆ ప్లాన్ తిప్పికొట్టేలా కనకంను అస్త్రంగా పంపిస్తుంది కావ్య.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 10వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 10వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్నకు సీమంతం చేయించాలని, ముత్తయిదువులందరిని పిలిపించి వాయినాలు ఇవ్వడమే కాకుండా రిటర్న్ గిఫ్ట్ కింద వెండి కుంకుమ భరిణ కూడా ఇవ్వాలి. నేను ఆల్రెడీ డిజైన్ చేసేశాను. అందరికి రకారకాల వంటలు చేయించి తృప్తిగా భోజనం పెట్టించి పంపించాలి. ఇది నా కోరిక అని రుద్రాణి చెబుతుంది.

yearly horoscope entry point

పుట్టబోయే మొదటి బిడ్డ

ఈ వయసులో మీకు సీమంతం అంటే భయపడుతారు కానీ, నాకు సీమంతం అంటే కచ్చితంగా వస్తారు. ఏమంటారు అని అపర్ణ ఆంటీ అని స్వప్న అంటుంది. అవునమ్మా, మనింట్లో పుట్టబోయే మొదటి బిడ్డ. అందరి ఆశీర్వాదం కావాలి. నీకు వాళ్ల ఆశీర్వాదంతో పండంటి బిడ్డ పుడతాడు అని అపర్ణ అంటుంది. అబ్బా తలుచుకుంటేనే ఎంతో సంతోషంగా ఉందని స్వప్న అంటుంది. అవన్నీ మనం అనుకోవడం కాదు అనుకునేవాళ్లు అనుకోవాలి అని ఇన్‌డైరెక్ట్‌గా కావ్యను అంటాడు ప్రకాశం.

అబ్బా పెళ్లయిన ఇన్నాళ్లకు ఒక సత్యం చెప్పారు. ఇన్నాళ్లకు మీకు కళ్లు తెరుచుకున్నాయి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు మనం అంత గ్రాండ్‌గా చేయడం అవసరమా. ఫంక్షన్ ఎలాగు గ్రాండ్‌గానే చేస్తాం కదా అని రాజ్ అంటాడు. అలా కుదరదు. బంధువులందరూ రావాలి, ఆఫీస్‌లో పనిచేసే ప్రతిఒక్కరు రావాలి, విందు భోజనం పెట్టి బహుమతులు ఇచ్చి పంపించాలి అని రుద్రాణి అంటుంది. నిజంగా అంత గ్రాండ్‌గా నా సీమంతం జరుగుతుందా అని స్వప్న అంటుంది.

ఏదైనా దుష్టశక్తి అడ్డుపడుతుందని అనుకుంటున్నావా. లేదా సింపుల్‌గా చేయడానికి నీ చెల్లెలు అడ్డుపడుతుందా. ఏదో చిన్నగా చేసి సింపుల్‌గా ముగిస్తుందని అనుకుంటున్నావా. ఏం కావ్య నువ్వేం మాట్లాడట్లేదు అని రుద్రాణి పుల్లలు పెడుతుంది. మా అక్క సీమంతం అంటే నాకు సంతోషంగానే ఉంటుంది కదా. అందులో నేను అభ్యంతరం చెప్పడం ఏంటీ. అలాగే కానివ్వండి అని వెళ్లిపోతుంది కావ్య. దాంతో రాజ్ షాక్ అవుతాడు.

ఏం నేరం చేశాను

మేడమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా. మా ఆనవాయితీ ప్రకారం ఆరో నెల ఆరో రోజున జరిపిస్తాం. పంతులు గారు ముహుర్తం ఎలా ఉందని అంటుంది రుద్రాణి. పంతులు ముహుర్తం చూస్తాడు. ఇలా జరిగిందేంటీ అని రాహుల్ అంటాడు. అంత మనమంచికేలేరా. కాస్తా నవ్వు అని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్యను రూమ్‌లోకి లాక్కొస్తాడు రాజ్. ఇప్పుడు నేను ఏం నేరం చేశాను. అందరు కలిసి నన్ను ఎందుకు ఆడుకుంటున్నారు అని కావ్య అడుగుతుంది.

నీకేమైనా పిచ్చా. మా అత్తయ్య కోరిన కోరికలు సాంక్షన్ చేశావేంటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టి చేయడం అవసరమా అని రాజ్ అంటాడు. ఇప్పుడు నేను వద్దంటే నా పరిస్థితి ఏంటీ. వద్దంటే అందరికి తెలుస్తుంది. మీ అత్తయ్య ప్లాన్ ఏంటో అర్థం కాలేదా. అందరిముందు నన్ను బ్యాడ్ చేయాలని, అలాగే, మా అక్కతో నాపై రివర్స్ కావాలని, అందరిముందు నన్ను బ్యాడ్ చేయాలని ఇలా చేసింది అని కావ్య అంటుంది.

అయితే, దీనంతటికి 20 లక్షలు అవుతుంది. ఎలా చేస్తావ్. అంత ఖర్చు చేస్తే మా పిన్ని అంతెత్తు లేస్తుంది అని రాజ్ అంటాడు. నేను అదేం ఆలోచించకుండానే ఒప్పుకున్నానా. మా అక్క సీమంతం జరుగుతుంది. కానీ, గ్రాండ్‌గా కాదు. సింపుల్‌గా అని కావ్య అంటుంది. దానికి మీ అక్క ఒప్పుకుంటుందా అని రాజ్ అంటాడు. చెప్పేవాళ్లు చెబితే ఒప్పుకుంటుంది అని కావ్య అంటుంది. ఏమో నీ ప్లాన్ ఫెయిల్ అయి అంతా నీమీద దండెత్తితే నేను మాత్రం ఏం మాట్లాడలేను. నన్ను మాత్రం అర్థం చేసుకో ఈ విషయంలో అని చేతులెత్తేస్తాడు రాజ్.

ఒక్కో న్యాయమని నిరూపించడానికే

మరోవైపు ధాన్యలక్ష్మీ ఝలక్ ఇలా ఇచ్చావే చూశావా అని రుద్రాణి అంటే.. మాకు కూడా ఇచ్చావ్ కదా పెద్ద ఝలక్. కొత్తగా కోడలిపై ప్రేమ పుట్టుకొచ్చిందేంటో అని ధాన్యలక్ష్మీ అంటుంది. కోడలా.. దాని మొహమా.. ఇది కూడా నీకు న్యాయం చేయడానికే అని రుద్రాణి అంటుంది. సీమంతం జరిగేది నీ కోడలికి. ఇక్కడ మీ స్వార్థం, మీ సంతోషం కనిపిస్తుంటే నాకోసం అంటావేంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను ఇదంతా చేస్తుంది నా కోడలి మీద ప్రేమతో కాదు. ఆ కావ్య అందరికీ ఒక్క న్యాయం, తన చెల్లెలికి ఒక న్యాయం అని నిరూపించడానికే అని రుద్రాణి అంటుంది.

లక్ష, రెండు లక్షలకే మాట్లాడే కావ్య 20 లక్షలు ఎలా ఖర్చు పెడుతుంది. ఇదే నేను హైలెట్ చేస్తే.. అందరికి ఒక ట్రీట్‌మెంట్.. అక్కకు స్పెషల్ ట్రీట్‌మెంటూ అని మన న్యాయం కోసం ఫైట్ చేస్తాం అని రుద్రాణి అంటుంది. కరెక్టే.. కానీ, కావ్య నీకన్న తెలివైనది కదా. సింపుల్‌గానే చేస్తాను అంటే అని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పుడు కావ్య సెల్ఫిష్ అని, దానికసలే మనసే లేదని, కేవలం ఆస్తి మాత్రమే కావాలని, డబ్బంతా దాచుకోవాలని టైమ్ చూసుకుని దోచుకోవాలని చూస్తుందని ఫుట్‌బాల్ ఆడుకోవచ్చు అని రుద్రాణి అంటుంది.

మరి అపర్ణ అక్క, బావ గారు, అత్తయ్య గారు కావ్య మీద మాట పడనివ్వరు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అసలు వాళ్లు కావ్య మీద రివర్స్ అవ్వాలనే కదా నా ప్లాన్. ఇందులో మనతోపాటు ప్రకాశం అన్నయ్య జతకడితే మరింత రంజుగా ఉంటుంది ఆట అని రుద్రాణి అంటుంది. సరే మాకు న్యాయం జరుగుతుంది అంటున్నావ్‌గా అని ఒప్పుకుంటుంది ధాన్యలక్ష్మీ. చూడు రేపు కావ్యను నేను ఎలా ఆడుకుంటానో రుద్రాణి అంటుంది.

సాహిత్యంతో బయటకు

మరోవైపు కల్యాణ్‌కు లక్ష్మీకాంత్ కాల్ చేస్తాడు. కల్యాణ్ లిఫ్ట్ చేస్తే.. లక్ష్మీకాంత్ కోప్పడుతాడు. అవకాశం కోసం కాళ్ల వేళ్ల పడతారు. ఇచ్చాక గురువులకు సున్నాలు పెట్టి తిరుగుతారు. కళ్లు నెత్తికెక్కాయి. నా పేరు చెప్పుకుని భుజాలు చరుచుకుంటూ తిరుగుతున్నావన్నమాట అని లక్ష్మీకాంత్ అంటాడు. లేదు. మా తాతయ్య కోమాలో ఉన్నారని కల్యాణ్ చెబుతాడు. కోమాలో ఉన్న మీ తాతయ్యను నీ సాహిత్యంతో బయటకు తీసుకురాడానికి ట్రై చేస్తున్నావన్నమాట అని లక్ష్మీకాంత్ అంటాడు.

మీరు అలా అనకండి. మా తాతయ్య మాకు దైవంతో సమానం అని కల్యాణ్ అంటాడు. ఇంతకుముందు గురువే దైవం అన్నావు. ఇప్పుడు తాతయ్య దైవం అంటున్నాడు. నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది అని రైటర్ అంటే.. పాట ఇవాళ్టీ లోగా రాసి ఇస్తాను అని కల్యాణ్ అంటాడు. సరే ఏడు. సిచ్యువేషన్ తెలుసుగా ప్రియురాలికి దూరమై ప్రియుడు పడే మనోవేదన. ఇంకెప్పుడు కోమా గీమా అని నాకు నామం పెట్టకు అని కాల్ కట్ చేస్తాడు రైటర్ లక్ష్మీకాంత్.

క్షమించండి తాతయ్య. నేను పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా మాటలు పడేలా చేస్తున్నాను అని పాట ఎలా మొదలుపెట్టాలు అని ఆలోచిస్తుంటాడు కల్యాణ్. పొట్టి నీకు దూరంగా ఉంటున్న నా భావననే పాటగా రాస్తాను అని కల్యాణ్ అంటాడు. మరోవైపు ఇదేంటీ, గుండెల్లో ఏదో దడగా ఉంది. కుడి కన్ను కూడా కొట్టుకుంటుంది. కొంపదీసి బంధువులు ఎవరైనా వస్తున్నారా అని కనకం అంటుంటే.. కావ్య కనిపిస్తుంది. దాంతో షాక్ అవుతుంది కనకం.

శుభవార్త తీసుకొచ్చాను

దాంతో కనకం కుప్పకూలిపడబోతుంటే కావ్య వచ్చి పట్టుకుంటుంది. నువ్ వచ్చావంటే ఏ చేదు వార్త మోసుకొచ్చావని భయపడుతున్నాను, బీపీ డౌన్ అయింది. చెప్పపెట్టకుండా వచ్చి షాక్ ఇస్తున్నావ్. కట్టుబట్టలతో పంపించారా అల్లుడు గారు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు అని కనకం కంగారుపడుతుంది. నీకు శుభవార్త చెప్పడానికే వచ్చాను అని కావ్య అంటే.. కడుపా అన్నట్లుగా చేయి పెట్టి చూపిస్తుంది కనకం.

మేము కలిసి ఉంటున్నాం అంతే కాపురం చేయట్లేదు. స్వప్న అక్కకు సీమంతం చేయాలని ఇంట్లో అంతా అనుకుంటున్నారు అని కావ్య అంటే.. కనకం హడావిడి చేస్తుంది. ఆగు. ఆ సీమంతం అక్కడ కాదు. ఇక్కడ చేయాలి. నువ్వు వచ్చి మనింట్లో చేయిస్తాను అని చెప్పాలి. అక్కడ చేయడం కరెక్ట్ కాదు. వాళ్లు చేయిస్తే 25 లక్షలు ఖర్చు అయ్యేలా ఉంది. అలా చేయడం కరెక్ట్ కాదు అని కావ్య అంటుంది. మనస్థాయి ఏంటో తెలుసు కదా. అక్కకు పదిగ్రాముల బంగారం కూడా కొనివ్వలేం. అది తెలిసి ఇక్కడ చేయమంటున్నావ్ ఎందుకు అని కనకం అంటుంది.

ఇప్పుడేం చెప్పలేను. కానీ, నేను చెప్పింది చేయు. నాకోసం ఈ పని చేసి పెట్టాలి. ఇక్కడ నువ్ సీమంతం చేస్తే నాకు మేలు జరుగుతుంది అని కావ్య అంటుంది. నీ మాటల్లో అంతరార్థం కనిపిస్తుంది. రేపు వచ్చి వాళ్లతో మాట్లాడుతాను. రుద్రాణి ఉన్న నేను ఒప్పిస్తాను. ఈ కనకం గురించి తెలుసు కదా. రేపు చూడు అందరిని ఒప్పిస్తాను. మీ అక్కకు ఇక్కడ సీమంతం జరిపిస్తాను అని కనకం అంటుంది. రుద్రాణి నన్ను ఇరికించాలని చూశావ్ కదా. ఇప్పుడు చూడు నీమీదకు మా అమ్మను అస్త్రంగా వదులుతున్నాను. ఎలా అడ్డుకుంటావో నేను చూస్తాను అని కావ్య అనుకుంటుంది.

ఇంత ప్రేమ ఏంటీ

మరుసటి రోజు ఉదయం సీమంతానికి ఫుడ్ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్‌కి ఆర్డర్ ఇవ్వాలి. మినిమం వెయ్యి మంది వస్తారు అని పెద్ద పెద్ద లిస్ట్ చెబుతుంది రుద్రాణి. నిజంగా అంతమంది వస్తున్నారా అని ప్రకాశం అంటే.. కావాలనే చేస్తుందని అర్థం కావట్లేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇలాంటివి మీకే వస్తాయి నాకెల తెలుస్తుంది అని ప్రకాశం అంటాడు. ఈ రుద్రాణికి కోడలిమీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటీ అని ఇందిరాదేవి అంటుంది.

పంతానికి పోయి పళ్లు రాలగొట్టించుకోవడం అంటే ఇదేనేమో. బడ్జెట్ బయటపెట్టినప్పుడు కావ్య ఒప్పుకోవాలి కదా అని అపర్ణ అంటుంది. తర్వాత రుద్రాణి సీమంతానికి 20 లక్షలు అవుతుందని చెబితే కావ్య చెక్ రాసి ఇస్తుంది. ఇంతలో కనకం ఎంట్రీ ఇస్తుంది. పుట్టింట్లోనే సీమంతం జరిపించాలని చెప్పిన కనకం అందరిని ఒప్పిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024