Best Web Hosting Provider In India 2024
Karthika Deepam 2 Serial: కార్తీక్ ప్రేమను అపార్థం చేసుకున్న దీప – జ్యోత్స్న రివేంజ్ – కాంచన ఆనందం
Karthika Deepam 2 : కార్తీక దీపం 2 జనవరి 10 ఎపిసోడ్లో కార్తీక్ చేత తన కంపెనీ ముందు దీపనే ధర్నా చేయించిందని కోపంతో జ్యోత్స్న రగిలిపోతుంది. నా జోలికి రావద్దంటూ దీపకు వార్నింగ్ ఇస్తుంది. మొండితనం పక్కనపెట్టి ఇకనైనా మారమని, పది మంచి మెచ్చేలా బతకమని జ్యోత్స్నకు దీప బదులిస్తుంది.
Karthika Deepam 2 Serial: యాభై ఏళ్ల వయసు పై బడిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేయాలనే జ్యోత్స్న నిర్ణయం కార్తీక్, దీప కారణంగా బెడిసికొడుతుంది. జ్యోత్స్న ఉద్యోగంలో నుంచి తొలగించిన వారి తరఫున కార్తీక్, దీప ధర్నా చేస్తారు. జ్యోత్స్న తీసుకున్న నిర్ణయాన్ని శివన్నారాయణ, దశరథ్ కూడా తప్పుపడతారు.
జ్యోత్స్న కంపెనీ నుంచి తీసేసిన వారిని తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని దశరథ్ అంటాడు. ఉద్యోగులుతో పాటు కార్తీక్, దీపలకు దశరథ్ సారీ చెబుతాడు. జ్యోత్స్న చేత సారీ చెప్పిస్తాడు.
దీప హర్ట్…
తమకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించిన కార్తీక్‌ను ఉద్యోగులు పొగుడుతారు. కార్తీక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారు. కార్తీక్ మెడలో దండ వేసి సంబరాలు చేస్తారు. ఎలా ఉన్నారని దశరథ్ను పలకరిస్తుంది దీప. కానీ అతడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తాతయ్య గీసిన గీతను మావయ్య దాటడని, దశరథ్ మాట్లాడలేదని ఫీలవ్వవద్దని దీపకు సర్ధిచెబుతాడు కార్తీక్.
ధర్నా ముగియడంతో దీపను తీసుకొని కార్తీక్ సైకిల్‌పై ఇంటికి బయలుదేరుతాడు. దీప సైకిల్ వెనుక కూర్చోవడం జ్యోత్స్న చూస్తుంది. ఆ సీన్ చూసి జెలసీగా ఫీలవుతుంది.
జ్యోత్స్న ఫాలో…
కార్తీక్, దీపను తన కారులో ఫాలో అవుతుంది జ్యోత్స్న. వారి సైకిల్‌కు కారు అడ్డుపెడుతుంది. కార్తీక్‌ను దీప రెచ్చగొట్టి ధర్నా చేయించిందని జ్యోత్స్న అపోహపడుతుంది. మా నాన్న లేకుంటే నీ గూబ పగిలిపోయేలా సమాధానం చెప్పేదానిని అంటూ దీపతో గొడవకు దిగుతుంది. నాకు సారీ చెప్పే పరిస్థితులను కొని తెచ్చుకోకు అని జ్యోత్స్నకు ధీటుగా బదులిస్తుంది దీప.
నువ్వు నా జోలికి రావద్దంటూ దీపకు వార్నింగ్ ఇస్తుంది. నాకు సలహాలు ఇవ్వొద్దంటూ కోపంగా దీపపై మాటల ఎటాక్ మొదలుపెడుతుంది. నువ్వు సలహాలు తీసుకునే స్థాయిలో లేవని, కౌన్సిలింగ్తీసుకునే స్థాయిలో ఉన్నావని జ్యోత్స్నపై కార్తీక్ సెటైర్లు వేస్తాడు.
నీ జీవితం ఆగిపోయింది….
దీపను పెళ్లిచేసుకొని దిగజారిపోయావని, నీ జీవితం ఆగిపోయిందని కార్తీక్‌తో వాదనకు దిగుతుంది జ్యోత్స్న. ఇప్పుడే కార్తీక్ జీవితం కొత్తగా మొదలైందని దీప అంటుంది. నువ్వు పక్కన ఉండగా మా బావ ఎప్పటికీ గెలవలేడని జ్యోత్స్న సమాధానమిస్తుంది. ఇప్పుడే గెలిచానని కార్తీక్ అంటాడు. అది గెలుపు కాదు నా రాజీ అని జ్యోత్స్న వాదిస్తుంది.
మంచి టైమ్ లేదు…
నాకు టైమ్ వస్తుందని, ఆ రోజు నేనంటే ఏమిటో చూపిస్తానని దీప, కార్తీక్‌లతో ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్స్న. నువ్వు మారడానికి ఇంత కంటే మంచి టైమ్ లేదని, మొండిగా ముందుకుపోతే నీకు తగిలే దెబ్బ మామూలుగా ఉండదని జ్యోత్స్నను హెచ్చరిస్తుంది దీప. పది మంది మంచి కోరుతూ ముందుకు పోతే నువ్వు బాగుంటాడు. నీ చుట్టు ఉన్నవాళ్లు బాగుంటారు. అలా కాదని తలపొగరుతే ముందుక పోతే గట్టిగా తింటావని దీప అంటుంది.
నీ లాంటి వాళ్లకు దూరంగా…
అందరి ముందు తల ఎత్తుకొని తిరిగే మావయ్య నీ వల్ల మొదటిసారి తలదించుకున్నాడని, నీ అహంకారం వల్లే ఇదంతా జరిగిందని జ్యోత్స్నకు క్లాస్ ఇస్తాడు కార్తీక్. నీ లాంటి వాళ్లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిదని చెప్పి వెళ్లిపోతాడు.
రివేంజ్…
దీప తనకు చేసిన అవమానం భరించలేకపోతుంది జ్యోత్స్న.రివేంజ్ గట్టిగా తీర్చుకోవాలని ఫిక్సవుతుంది. తాను కొట్టే దెబ్బకు దీప చాలా బాధపడటం ఖాయమని జ్యోత్స్న అనుకుంటుంది.
దీప మెడలో దండ…
కార్తీక్, దీప ఇంటికొస్తారు. అనసూయ కనిపించగానే దీప ఆనందపడతుంది. నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ తనకు చెప్పకుండా వెళ్లినందుకు ఫైర్ అవుతుంది.
జ్యోత్స్న చేసిన గొడవను గురించి తల్లికి చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న చేత మావయ్య అందరికి సారీ చెప్పాడని అంటాడు. నిజానికి ఈ దండ నా మెడలో కాదు దీప మెడలో ఉండాలని కార్తీక్ భార్య మెడలో వేస్తాడు. మీ పక్కన ఉండటం తప్ప నేను ఏం చేయలేదని దీప అంటుంది.
ధైర్యం చెబుతూ మన పక్కన బలంగా నిలబడే వారు ఎవరైనా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలమని నువ్వు నిరూపించావని కార్తీక్ అంటాడు.
కార్తీక్, దీప మెడలో దండ…
ఆ పూల దండను దీప, కార్తీక్ ఇద్దరికి కలిపి వేస్తుంది శౌర్య. మీరిద్దరిని ఒకే దండలో చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉందని అనసూయ అంటుంది. కాంచన కూడా చూడముచ్చటగా ఉన్నారని సంబరపడిపోతుంది. కార్తీక్, దీప, శౌర్యలను కలిపి ఫొటో తీస్తుంది కాంచన.
అభిమానం…కృతజ్ఞత…
కార్తీక్ తన మెడలో వేసిన దండను తీసేస్తుంది దీప. కొండంత ప్రేమతో నీ మెడలో కార్తీక్ దండ వేశాడని, కొద్ది సేపు ఉంచుకోమని అనసూయ అంటుంది. నీ భర్తపై నీకు ప్రేమలేదా అని దీపను నిలదీస్తుంది అనసూయ. కార్తీక్‌కు తనపై ఉందని అభిమానం, కృతజ్ఞత మత్రమే ఉన్నాయని దీప అంటుంది. కార్తీక్న తాను ఆరాధిస్తున్నట్లు మాత్రమే చెబుతుంది. ప్రేమించడం లేదని చెబుతుంది. కార్తీక్ తన దృష్టిలో దేవుడు అని చెబుతుంది.
మీ ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల బంధం గురించి ఏమంటావని అనసూయ నిలదీస్తుంది. ఆరిపోయే దీపం లాంటిది మా బంధం అని తాత్వికంగా సమాధానమిస్తుంది. దీప సమాధానం చూసి అనసూయ కంగారు పడుతుంది. ఈ దీపం ఆరిపోయే వరకు తనలో చోటు ఇచ్చిన ప్రమిదను ఆరాధిస్తూనే ఉంటుందని దీప అంటుంది. తాళి కట్టిన మొగుడిని ప్రేమించమంటే దేవుడిని చేశావు…ఇక నీకు నేను ఏం చెప్పగలను అని అనసూయ అంటుంది.
శౌర్య మెడలో లాకెట్…
కార్తీక్ లాకెట్‌ను అతడికి తెలియకుండా తీసుకుంటుంది శౌర్య. అది కార్తీక్ చూస్తాడు. లాకెట్ ఇవ్వమని శౌర్య వెంటపడతాడు. కార్తీక్‌కు దొరక్కుండా పారిపోతుంది శౌర్య. కూతురిని పట్టుకున్న దీప…ఆ లాకెట్‌ను కార్తీక్‌కు ఇచ్చేయమని చెబుతుంది. ఈ లాకెట్ ఎవరిది, నాన్న దగ్గరకు ఎందుకొచ్చిందని శౌర్యప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కార్తీక్ ప్రాణదాతది ఈ లాకెట్ అని దీప సమాధానం ఇస్తుంది. శౌర్య దగ్గర నుంచి లాకెట్ తీసుకొని కార్తీక్‌కు ఇస్తుంది దీప.
నిజం తెలిసిపోయిందా?
మీ పక్కన అమ్మ ఉంది ఆమెనేనా మీ ప్రాణదాత కార్తీక్‌ను అడుగుతుంది శౌర్య. అవునని కార్తీక్ అనగానే నిజం తెలిసిపోయిందేమోనని దీప కంగారు పడుతుంది. నా లైఫ్‌లో ఇద్దరు ప్రాణదాతలు ఉన్నారని కార్తీక్ అంటాడు. లాకెట్ ప్రాణదాత వేరు…ఈ ప్రాణదాత వేరు అని చెబుతాడు.
శౌర్యలాకెట్ మళ్లీ తీసుకోకుండా తన మెడలో వేసుకుంటాడు కార్తీక్. నీకు నా కంటే లాకెట్ ఎక్కువైపోయిందని శౌర్య అలుగుతుంది. అక్కడితో నేటి కార్తీకం దీపం 2 సీరియల్ ముగిసింది.