Best Web Hosting Provider In India 2024
Bus Accident: సూర్యాపేటలో ఘోర ప్రమాదం, ఇసుక లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, నలుగురు మృతి
Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిస్సా నుంచి ప్రయాణికులతో వస్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లోనే మృతి చెందగా 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిద్ర మత్తు, పొగమంచుతో ఈ ప్రమాదం జరిగింది.
Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిస్సా నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 17 మంది ప్రయాణికులకు గాయపడ్డారు. వీరంతా కూలీ పనుల కోసం హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదంలో గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై ఇసుక లారీ నిలిచి ఉండగా ఒడిశాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం వద్ద జరిగింది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన గుప్తా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వలస కూలీలను ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఓ లారీని, బస్సు అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు అందించిన సమాచారంతో డీఎస్పీ రవి ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
టాపిక్