Best Web Hosting Provider In India 2024
Jana sadharan Trains: రైల్వే గుడ్‌న్యూస్, సంక్రాంతికి జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు, వందే భారత్‌కు అదనపు కోచ్‌లు
Jana sadharan Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. .సంక్రాంతికి జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. అలాగే విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్‌కు అదనపు కోచ్‌లు కూడా అందుబాటులోకి తెచ్చింది.
Jana sadharan Trains: ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి తూర్పు కోస్ట్ రైల్వే విశాఖపట్నం-చెర్లపల్లి మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ప్రత్యేక రైళ్లు ఇవే…
1. రైలు నంబర్ 08533 విశాఖపట్నం – చెర్లపల్లి జనసాధారణ్ ప్రత్యేక రైలు జనవరి 10, 12, 15, 17 తేదీల్లో ఉదయం 9.45 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి అదే రోజు రాత్రి 10.30 గంటలకు చెర్లపల్లికి చేరుకుంటుంది.
2. రైలు నంబర్ 08534 చెర్లపల్లి – విశాఖపట్నం జనసాధరణ ప్రత్యేక రైలు జనవరి 11, 13, 16, 18 తేదీలలో అర్థరాత్రి 12.30 గంటలకు చెర్లపల్లి నుండి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-చెర్లపల్లి మధ్య దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడిగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సిట్టింగ్ కమ్ లగేజ్ కోచ్- 2, సెకండ్ క్లాస్ జనరల్ కోచ్- 9, అన్రిజర్వ్డ్ స్లీపర్ క్లాస్ – 11 కోచ్‌లు ఉన్నాయి.
3. రైలు నంబర్ 08537 విశాఖపట్నం – చెర్లపల్లి జనసాధారణ్ ప్రత్యేక రైలు జనవరి 10, 11, 15, 16 తేదీలలో సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది.
4. రైలు నంబర్ 08538 చెర్లపల్లి – విశాఖపట్నం జనసాధారణ్ ప్రత్యేక రైలు జనవరి 11, 12, 16, 17 తేదీలలో ఉదయం 10 గంటలకు చెర్లపల్లి నుండి బయలుదేరి అదే రోజు రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-చెర్లపల్లి మధ్య దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడిగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సిట్టింగ్ కమ్ లగేజ్ కోచ్- 2, సెకండ్ క్లాస్ జనరల్ కోచ్- 9, అన్రిజర్వ్డ్ స్లీపర్ క్లాస్ – 11 కోచ్‌లు ఉన్నాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి ఇండియన్ రైల్వే 20833/20834 విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లు శాశ్వతంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 11 నుండి ప్రారంభమయ్యే ఈ రైళ్లు ప్రయాణ వేగం, సౌలభ్యాన్ని మరింత పెంచడానికి నాలుగు అదనపు వందే భారత్ కోచ్‌లు అప్‌గ్రేడ్ చేయబడతాయి.
1. రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11 నుండి 20 కోచ్‌లతో నడుస్తుంది.
2. రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11 నుండి 20 కోచ్‌లతో నడుస్తుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ -2, చైర్ కార్ -18 కోచ్‌లు ఉంటాయి.
ఆరు రైళ్లు రద్దు
సౌత్ కోస్ట్ రైల్వేలోని విజయవాడ డివిజన్లోని రేగుపాలెం-నరసింగపల్లి సెక్షన్ మధ్య ఆటోమేటిక్ సెక్షన్‌ను ప్రారంభించడం కోసం నాన్-ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఆరు రైళ్లు రద్దు చేశారు.
1. జనవరి 11న కాకినాడ నుండి బయలుదేరే రైలు నంబర్ 17267 కాకినాడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
2. జనవరి 11న కాకినాడ నుండి బయలుదేరే రైలు నంబర్ 17268 విశాఖపట్నం-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
3. జనవరి 11న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నంబర్ 08565 విశాఖపట్నం-పార్వతీపురం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
4. జనవరి 11న పార్వతీపురం నుండి బయలుదేరే రైలు నంబర్ 08566 పార్వతీపురం-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
5. జనవరి 11న గుంటూరు నుండి బయలుదేరే రైలు నంబర్ 17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
6. జనవరి 12న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నంబర్ 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. ఈ అసౌకర్యానికి తీవ్ర చింతిస్తున్నామని, ప్రజలు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
(జగదీశ్వరరావు జారజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్