Best Web Hosting Provider In India 2024
Prakasam Crime: ప్రకాశం జిల్లాలో ఘోరం… విద్యార్థినులపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు..
Prakasam Crime: ప్రకాశం జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది.విద్యార్థినులపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.సహకరిస్తే మార్కులేస్తానని, కాదంటే ఫెయిల్ చేస్తానని వేధింపులకు దిగాడు. వేధింపులు తాళలేక విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆ లెక్చరర్‌పై కేసు నమోదు చేశారు.
Prakasam Crime: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీలో చోటు చేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిపాడు మండలంలోని ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన స్వర్ణ రాజశేఖర్ అనే వ్యక్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉన్నతమైన బాధ్యతుల్లో ఉన్న ఈయన గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకంగా ప్రవరిస్తున్నాడు. దీంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న విద్యార్థినులను తన ఆఫీస్ రూమ్‌కి పిలిచి లైంగిక వేధింపులకు దిగుతున్నాడు.
తనకు సహకరిస్తే మీకు మంచి మార్కులు వస్తాయని వేధించేవాడు. ఇంటర్నల్, ప్రాక్టికల్ మార్కులు పూర్తిగా వేస్తానని, అలా కాకుంటే ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో విద్యార్థినులు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ స్వర్ణ రాజశేఖర్ వేధింపులు తాళలేక పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. తమపై కాలేజీ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ వేధింపులుకు పాల్పడుతున్నారని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ప్రాథమికంగా విచారించి స్వర్ణ రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు స్వర్ణ రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. విచారణ పూర్తి అయిన తరువాత తగిన విధంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిసి, వారు కూడా రాజశేఖర్‌పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
బాలికపై సవతి తండ్రి లైంగిక దాడి…సహకరించిన తల్లి…
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రి, ఆయనకు సహకరించిన తల్లికి పోక్సో కేసులో మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో పాటు రూ.2,500 జరిమానా కూడా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి తీర్పు ఇచ్చింది. 2021లో విజయనగరం జిల్లా కేంద్రంలో ఒక కుటుంబంలో తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో, కుమార్తె అమ్మమ్మ దగ్గరకు వెళ్లి పోయింది. అక్కడే ఉంటూ చదువుకుంటుంది. బాలిక తల్లి భర్తను వదిలేసి కోడూరు విజయ్‌కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది.
అయితే బాలిక అమ్మ ఒడి డబ్బు విషయం అడిగేందుకు తల్లి వద్దకు వెళ్లింది. అదే సమయంలో కోడూరు విజయ్‌కుమార్ బాలికను లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందుకు తల్లి కూడా సహకరించింది. వారి నుంచి తప్పించుకుని బయటపడ్డ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ పి. శ్యామలాదేవి పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పోక్సో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా మహిళా పీఎస్ సీఐ నర్సింహమూర్తి చర్యలు చేపట్టారు.
నేరం రుజువు కావడంతో బాలికపై లైంగిక దాడి పాల్పడ్డాడని, అందుకు తల్లి సహకరించిందని నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి ఇద్దరు దోషులకు శిక్ష వేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. పోక్సో కేసులో నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులకు ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్