Best Web Hosting Provider In India 2024
Clove Oil For Beauty: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం లాంటిది లవంగం నూనె, ఇలా ఉపయోగించారంటే యవ్వనంగా కనిపించచ్చు!
Clove Oil For Beauty: ముడతలు, మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మం దురద వంటి అనేక చర్మ సమస్యలకు ఏకైక పరిష్కారం లవంగం నూనె. ముఖ్యంగా ముప్పై ఏళ్లు పైబడిన మహిళలకు ఇది ఒక వరం లాంటిదని నిపుణులు చెబుతుంటారు. లవంగం నూనె వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మహిళల చర్మం 30 ఏళ్ల వరకు పూర్తిగా బిగుతుగా, యవ్వనంగా ఉంటుంది. కానీ ముప్పై దాటారంటే చర్మం యవ్వనత్వాన్ని కోల్పోవడం ప్రారంభమవుతుంది. శ్రద్ధ చూపకపోతే 35 ఏళ్చలు వచ్చే సరికి చర్మంపై గీతలు, ముడతలు, మచ్చలు రావడం మొదలవుతుంది. అలా జరగకుండా నలభై ఏళ్ల వరకూ కూడా చర్మాన్ని యవ్వనంగా, మెరిసేలా ఉంచుకోవాలనుకుంటే లవంగం నూనె మీకు చాలా బాగా సహాయపడుతుంది. లవంగాలతో తయారుచేసిన ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా ఉండటమే కాకుండా, ముఖం ఎప్పుడూ మెరుస్తూ నిగారంపుతో కపపడుతుంది. లవంగం నూనె అంటే ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం.
లవంగం నూనె అంటే ఏంటి?
లవంగం నూనె అనేది లవంగం చెట్ల నుంచి సేకరించిన లవంగాలు లేదా ఎండిన పూల మొగ్గలతో తయారవుతుంది. కొన్ని సార్లు కాండం, ఆకులను కూడా లవంగం నూనె తయారీలో ఉపయోగిస్తారు. ఇది గోధుమ రంగులో, మసాలా వాసన కలిగి ఉంటుంది. దీన్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తుంది.
లవంగం నూనెను ఇంట్లో తయారు చేయడం ఎలా?
కావాల్సిన పదార్థాలు:
- ఏదైనా హెయిర్ ఆయిల్ (మీకు నచ్చినది ఏ నూనె అయినా సరే ఉదాహరణకు కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్) వంటివి.
- లవంగాలు, లేదా లవంగం చెట్టు పూలు
తయారీ విధానం:
- ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మీరు తీసుకున్న ఏదైనా నూనెను దాంట్లో పోయండి.
- నూనె కాస్త వేడిక్కిన తర్వాత దాంట్లో ఎనిమిది నుండి పది లవంగాలను వేసి బాగా మరిగించండి.
- చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో నింపుకోండి. అంతే మీ చర్మ సౌందర్యానికి సహాయపడే లవంగం నూనె తయారైనట్టే.
చర్మానికి లవంగాల నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:
- లవంగం నూనె చర్మం కుంగిపోయి వదులుగా మారకుండా, ముడతలు ఏర్పడకుండా సహాయపడుతుంది. లవంగాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు రాకుండా కాపాడుతుంది. దీనివల్ల కణాలకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే, కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. చర్మంపై ముడతలు మరియు చక్కటి గీతలను తొలగిస్తుంది.
- చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలకు లవంగం నూనె చక్కటి పరిష్కారం. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పొడి, దురద చర్మానికి కారణమయ్యే అటోపిక్ డెర్మటైటిస్ చికిత్సలో లవంగం నూనె సహాయపడుతుంది.
- యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు కలిగిన లవంగం నూనె మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలు నాశనం చేస్తుంది. దీంట్లోని యూజినాల్ సమ్మేళనం మొటిమల చికిత్సలో సహాయపడుతుంది.
- మొటిమలు కారణంగా వచ్చే నల్ల మచ్చలను పోగొట్టడంలో లవంగం నూనె చాలా బాగా సహాయపడుతుంది. దీని ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు మృత చర్మ కణాలను తొలగించి, చర్మపు రంగును అందేలా చేయడంలో సహాయపడతాయి.
- లవంగం నూనెలోకి అనాల్జేసిక్ లక్షణాలు చర్మ అసౌకర్యాన్ని తగ్గించడంలో, చర్మపు చికాకులు, కీటకాల కాటు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగించడంలో ముందుంటుంది.
- లవంగం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్ ను అరికట్టి అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి. చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
ఎలా అప్లై చేయాలి
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత లవంగం నూనె ను అప్లై చేయండి. దీని వల్ల రాత్రంతా నూనె చర్మ శోషణ ప్రక్రియ చేస్తుంది. ముఖంపై ఏర్పడే ముడతలు, గీతలు తగ్గి ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.