Bachchala Malli OTT: సడెన్‌గా మరో 2 ఓటీటీల్లోకి వచ్చేసిన బచ్చల మల్లి.. మొత్తం మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Bachchala Malli OTT: సడెన్‌గా మరో 2 ఓటీటీల్లోకి వచ్చేసిన బచ్చల మల్లి.. మొత్తం మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 10, 2025 02:15 PM IST

Bachchala Malli OTT Streaming On 3 Platforms: ఓటీటీలోకి ఇవాళ బచ్చల మల్లి సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, తాజాగా సడెన్‌గా మరో రెండు ఓటీటీల్లో బచ్చల మల్లి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అల్లరి నరేష్ నటించిన రూరల్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ బచ్చల మల్లి 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

సడెన్‌గా మరో 2 ఓటీటీల్లోకి వచ్చేసిన బచ్చల మల్లి.. మొత్తం మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?
సడెన్‌గా మరో 2 ఓటీటీల్లోకి వచ్చేసిన బచ్చల మల్లి.. మొత్తం మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?

Bachchala Malli OTT Release On 3 Platforms: కామెడీ హీరోగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా సీరియస్ రోల్స్‌లో ఆకట్టుకుంటున్నాడు. నాంది, ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సినిమాల్లో నటనలో విలక్షణత చూపించాడు.

yearly horoscope entry point

అల్లరి నరేష్ యాక్టింగ్‌కు

ఈ క్రమంలోనే మరో విలక్షణ రోల్‌తో అల్లరి నరేష్ మెప్పించిన సినిమా బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సుబ్బు మంగాదేవి బచ్చల మల్లి మూవీని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ అయిన బచ్చల మల్లి మూవీ బాక్సాఫీస్ పరంగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ, అల్లరి నరేష్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి.

20 రోజుల్లోనే ఓటీటీ రిలీజ్

అలాంటి బచ్చల మల్లి సినిమా ఓటీటీ రిలీజ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు. దానికి తగినట్లుగానే 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది బచ్చల మల్లి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ జనవరి 10 నుంచి బచ్చల మల్లి డిజిటల్ ప్రీమియర్ కానుందని జనవరి 9న అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరో రెండింట్లో

ఆ అనౌన్స్‌మెంట్ ప్రకారం ఇవాళ్టీ (జనవరి 10) నుంచి ఈటీవీ విన్‌లో బచ్చల మల్లి ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, తాజాగా మరో రెండు ఓటీటీల్లోకి ఊహించని విధంగా బచ్చల మల్లి మూవీ వచ్చేసింది. ఆ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్సే అమెజాన్ ప్రైమ్ అండ్ సన్ ఎన్ఎక్స్‌టీ. ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నేటి నుంచే హఠాత్తుగా బచ్చల మల్లి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఒకటి రెంటల్-మరోటి ఫ్రీ

అయితే, ఈటీవీ విన్‌ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. కానీ, అమెజాన్ ప్రైమ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ విధానంలో బచ్చల మల్లిని చూడాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో బచ్చల మల్లి ఐదు భాషల్లో ఓటీటీ రిలీజ్ కావడం విశేషం. ఇక మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన సన్ ఎన్ఎక్స్‌టీలో ఎలాంటి రెంటల్ విధానం లేకుండా ఉచితంగా చూసేయొచ్చు.

జోడీగా అమృత అయ్యర్

ఇక బచ్చల మల్లి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా. ఈ సినిమా లోతైన భావోద్వేగ కథాంశం, ఆకర్షణీయమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అల్లరి నరేష్‌కు జోడీగా అమృత అయ్యర్ నటించిన ఈ చిత్రం లవ్, రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.

బచ్చల మల్లి కథ

90ల నాటి కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. తన తండ్రితో గాఢంగా అనుబంధం ఉన్న బచ్చల మల్లి (నరేష్), తన తండ్రి తన తల్లి నుంచి విడిపోయిన తర్వాత కోపం, ఆగ్రహంతో ఊగిపోతుంటాడు. అది తనకు చెడు చేస్తుంది. ఆ చెడు అలవాట్లను విడిచిపెట్టి తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి కావేరి (అమృత అయ్యర్)తో ప్రేమలో పడుతాడు. అప్పుడు అతని జీవితం మలుపు తిరుగుతుంది.

మూడింట్లో బచ్చల మల్లి ఓటీటీ స్ట్రీమింగ్

అయితే మల్లి స్వభావం, మూర్ఖత్వం చూసిన కావేరి బచ్చల మల్లిని వదిలేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది. కావేరి, బచ్చల మల్లి ఒక్కటయ్యారా అనేదే ఈ సినిమా కథ. కాగా ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చల మల్లి ఒక్కరోజులోనే 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసి ఆశ్చర్యపరిచింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024