Best Web Hosting Provider In India 2024
minapapappu murukulu: మినపపప్పు మురుకులు ఎప్పుడైనా చేసుకున్నారా? ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి
minapapappu murukulu: శనగపిండి లేకుండానే క్రిస్పీగా, కరకరలాడే మురుకులు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మినపపప్పుతో చక్కటి రుచికరమైన మురుకులను తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది. మినపపప్పు మురుకులు ఎలా తయారు చేయాలో ఇక్కడ ఉంది.
మినపపప్పు మురుకులు ఎప్పుడైనా చేసుకున్నారా? ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి ( Hyderabadi Ruchulu/Youtube)
సంక్రాంతి పిండివంటల్లో మురుకులు చాలా ముఖ్యమైనవి. మురుకులు, మడుగులు, జంతికలు ఇలా వేరు వేరు పేర్లతో ప్రతి ఒక్కరూ చేసుకునే పదార్థం మురుకులు. ఎప్పుడూ చేసేలాగా శనగపిండితో కాకుండా ఈసారి వైరైటీగా మురకులు చేయాలనుకుంటే ఈ రెసిపీ మీ కోసమే. మిరపపప్పుతో ఇలా మురుకులు చేశారంటే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. మినపపప్పు మురుకుల తయారీకి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలి వంటి వివరాలన్నీ ఇక్కడున్నాయి. ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి.
మినపపప్పు మురుకుల తయారీకి కావాల్సిన పదార్థాలు:
- మినప పప్పు
- బియ్యం పిండి
- జీలకర్ర
- పచ్చిమిర్చీ
- వాము
- కారం
- నువ్వులు
- ఉప్పు
- నూనె
- జీలకర్ర,
- పచ్చిమిర్చీ
- మురుకుల మిషిన్
మినపపప్పు మురుకుల తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నె లేదా కప్పు నిండా మినపపప్పు తీసుకుని శుభ్రంగా కడిగండి.
- తర్వాత దీంట్లో రెండు పప్పుకు రెండింతలు నీరు పోసి, కాస్త ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోండి. పప్పు మామూలుగా ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్లో వేసి వేసి 5 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకొని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక పెద్ద బేషన్ తీసుకుని దాంట్లో ఏ గిన్నెతో మినపపప్పు తీసుకున్నారో అదే గిన్నె కొలతతో మూడు గిన్నెల బియ్యం పిండిని పోయండి.
- పొడి బియ్యపు పిండిని మాత్రమే వాడాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక టీ స్పూన్ వరకూ వాము తీసుకుని బాగా నలిపిన తర్వాత అందులో కలపండి.
- ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని పిండిని బాగా కలపండి.
- ఇవన్నీ కలిసిన తర్వాత దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపండి. నూనెను కాస్త వేడి చేసి కలపడం వల్ల పిండి బాగా కలుస్తుంది.
- ఇప్పుడు ఉడికించి పక్కకుపెట్టుకున్న మినపపప్పును తీసుకుని మెత్తగా రుబ్బాలి. పప్పు గుత్తితో అయినా మిక్సీలో అయినా వేసి మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
- ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకుని ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిలను వేసుకోవాలి. అందులో జీలకర్ర కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
- ఆ తర్వాత మెత్తగా చేసుకున్న మినపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి ఒకసారి తిప్పాలి. ఇలా చేయడం వల్ల మినప పిండిలోకి పచ్చిమిర్చి, జీలకర్ర బాగా కలుస్తాయి.
- ఇప్పుడు కలిపి పెట్టుకున్న బియ్యపు పిండి మిశ్రమంలో ఈ మినప పిండిని వేసి బాగా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా, మరీ జోరుగా కాకుండా కలిపి పెట్టుకోవాలి.
- పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉండే విధంగా కలపాలి. ఈ పిండి ముద్దపై తడిబట్టను కప్పడం ద్వారా పిండి ఆరకుండా ఉంటుంది. ఇలా ఒక పది నుంచి 15 నిమిషాల వరకూ ఉంచేయాలి.
- ఈ లోపు కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై చేసుకునేందుకు సరిపడా నూనెను పోయండి.
- మురుకుల పావు/జంతికల గొట్టం తీసుకుని దాని లోపలి భాగంలో కొద్దిగా నూనె రుద్దండి.
- ఇప్పుడు కలుపుకున్న పిండి నుంచి చిన్న ముద్దను తీసుకుని మురుకుల పావును నింపండి.
- ఒక కాటన్ క్లాత్ లేదా చిల్లుల గరిటె మీద మురుకులను వత్తుకోండి. మీరు వేయగలిగితే నేరుగా నూనెలోకే పిండిని వత్తుకోవచ్చు.
- రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో అవి రంగు మారేంతవరకూ వేయించుకోవాలి.
- మురుకులు వేగుతున్న సమయంలో పిండి ఆరిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు బట్టను కప్పడం మర్చిపోకండి.
- పిండి మొత్తాన్ని మురుకులుగా చేసి వేయించుకుంటే శెనగపిండి లేకుండానే కరకరలాడే మినపప్పు మురుకులు రెడీ అయిపోతాయి.