Best Web Hosting Provider In India 2024
Kids Sweaters : పిల్లల స్వెటర్లు పాడైపోయాయా? కొత్తవి కోనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు గమనించి కొనండి!
kids sweaters : గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. మీ పిల్లల పాత స్వెటర్లు పాత బడ్డాయని, పాడైపోయాయని కొత్తవి కొనాలని మీరు అనుకుంటే. ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. కొన్ని విషయాలను గమనించి స్వెటర్లను కొన్నాంటే స్వెటర్ పిల్లల అందాన్ని పెంచడంతో పాటు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. చలికాలం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమయంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలిగాలుల తప్పించడానికి వారికి ఎల్లప్పుడూ నిండైన, వెచ్చని దుస్తులు వేయడ తప్పనిసరి. జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడాలంటే వారి ద్వారా వారి శరీరాన్ని వెచ్చగా ఉంచాలంటే పిల్లలకు స్వెటర్, జాకెట్ వంటివి చాలా ఉపయోగపడతాయి. మీ పిల్లలకు స్వెటర్ లేకపోయింటే, ఉన్నా పాడయిపోయినందుకు మీరు కొత్తది కొనాలనుకుంటే మీ కోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. చలికాలం ప్రతి సంవత్సరం వస్తుంది. అలా అని ప్రతిసారీ స్వెటర్ కొనడం సాధ్యం కాదు. అందుకే కొన్ని అంశాలను గమనించి స్వెటర్ కొనడం వల్ల మీ పిల్లలు వెచ్చగా ఉండటంతో పాటు అందంగా కనిపిస్తారు . ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.
వెచ్చగా ఉంటే సరిపోతుందా?
చలికాలం అనేది ఒక రకమైన నిస్తేజ వాతావరణం. ఈ సమయంలో శరీరం, మనస్సు కూడా చురుగ్గా ఉండవు. అలాంటి సమయంలో పిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచి చలి నుండి కాపాడుకోవడమే కాకుండా, అందంగా కనిపించేలా ఉండాలి. ఇందుకు మీ పిల్లలకు నచ్చే జాకెట్ కొనడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకు నచ్చిన సూపర్ హీరోస్, జంతువులు, పక్షులు వంటి చిత్రాలు, పూల చిత్రాలు వంటివి కలిగిన అందమైన జాకెట్లు ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. వీటిని పిల్లలు చాలా ఇష్టపడతారు. సంతోషంగా వేసుకుంటారు.
రంగును ఎంచుకునేటప్పుడు..
పిల్లలకు లేత గులాబీ, లేత నీలం రంగు స్వెటర్లు, జాకెట్లు అందంగా కనిపిస్తాయి. నిజమే కానీ పిల్లలు వీటిని త్వరగా మురికి చేసుకుంటారు. దీనివల్ల స్వెటర్ త్వరగా పాడవుతుంది. పదే పదే ఉతకడం వల్ల కూడా స్వెటర్ నాణ్యత పాడవుతుంది. కాబట్టి పిల్లలకు ముదురు రంగు స్వెటర్లు కొనడం మంచిది. ముదురు రంగు స్వెటర్లు పిల్లల అందాన్ని మరింతగా పెంచుతాయి.
టోపీ, ఫుల్ హ్యాండ్
ట్రెండీ దుస్తులు ధరించడం వల్ల పిల్లలు స్టైలిష్‌గా కనిపిస్తారు, కానీ వారిని చలి నుండి రక్షించడం కూడా చాలా ముఖ్యం. స్వెటర్ లేదా జాకెట్‌తో పాటు టోపీ, ఫుల్ హ్యాండ్స్ ఉండేలా చూసుకోండి. కొన్ని జాకెట్లలో గ్లౌస్లు కూడా ఉంటాయి. అలాంటి జాకెట్ కొనడం మరింత మంచిది. వీటి వల్ల పిల్లల శరీరం మొత్తం వెచ్చగా ఉంటుంది.
నాణ్యత ముఖ్యం
పిల్లలకు కొనే స్వెటర్ అందంగా ఉంటే సరిపోదు, నాణ్యత కూడా బాగుండాలి. ఇంతకు ముందే చెప్పినట్లు చలికాలం ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతిసారీ స్వెటర్ కొనడం సాధ్యం కాదు. అందుకే మంచి నాణ్యత కలిగిన, కనీసం మూడు నాలుగు సంవత్సరాలు మన్నిక ఉండేలా స్వెటర్ ను ఎంచుకోండి.
ఉన్ని స్వెటర్
పిల్లల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో వారికి ఉన్ని స్వెటర్లు వేయడం చాలా అవసరం. అందుకే స్వెటర్ కొనేముందు వారి చర్మం గురించి ఆలోచించి తీసుకోవాలి. రోజంతా వేసుకున్నా వారికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ఎంచుకోవాలి. ఉన్ని స్వెటర్‌ను రోజంతా వేసుకున్నా చర్మానికి ఎలాంటి హాని జరగదు. వెచ్చగా ఉంటాయి, అందంగా కూడా కనిపిస్తాయి.
ప్యాంట్ అండ్ షర్ట్
ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్ల స్వెటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ప్యాంట్ షర్ట్ రెండూ కలిసి ఉన్న జాకెట్లు కూడా వస్తున్నాయి. ఇవి పిల్లలకు చాలా అనుకూలంగా ఉంటాయి. మెడ నుండి పాదాల వరకు పిల్లలను వెచ్చగా ఉంచే ఈ స్వెటర్లు స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఇవి తీవ్రమైన చలి వాతావరణానికి చాలా అనుకూలం.
ఈ అంశాలను కూడా గుర్తుంచుకోండి
చలికాలంలో పిల్లలకు స్వెటర్లు, జాకెట్లు కొనేటప్పుడు మెడ భాగం కవర్ అవుతుందా లేదా అనేది గమనించండి. సింథటిక్ లేదా చర్మాన్ని గుచ్చే రకం జాకెట్లు కొనకండి. ఇవి పిల్లలకు చికాకు కలిగిస్తాయి. కొన్ని జాకెట్లలోని దారాలు త్వరగా బయటకు వస్తాయి. ఇవి పిల్లల ముక్కు, చెవుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి నాణ్యతను చూడటం చాలా ముఖ్యం. స్వెటర్ కొనేటప్పుడు మఫ్లర్, శాలువాలు కూడా కొనండి. ఇవి కూడా చలికాలంలో అవసరం.