Best Web Hosting Provider In India 2024
Weightloss: ఒక వారంలో 5 కిలోలు తగ్గడం ఎలాగో చెప్పిన ఫిట్‌నెస్ ట్రైనర్, డైట్ ప్లాన్ ఇదిగో
Weightloss: కేవలం ఒక వారంలో 5 కిలోల బరువు తగ్గడమంటే మామూలు విషయం కాదు. వినడానికి నమ్మేలా కూడా లేదు, కానీ తాను చెప్పినట్టు పాటిస్తే కచ్చితంగా ఒక వారంలో అయిదు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఒక ఫిట్ నెస్ ట్రైనర్.
కేవలం ఒక వారంలో 5 కిలోల బరువు తగ్గడం అనేది అంత సులువైన విషయం కాదు. అలాగని అసాధ్యమైనది కూడా కాదు. గట్టిగా ప్రయత్నిస్తే ఆరోగ్యంగానే వారంలో అయిదు కిలోలు బరువు తగ్గవచ్చని ఫిట్నెస్ ట్రైనర్ ఎకాన్ష్ తనేజా చెబుతున్నారు. కఠినమైన ఆహార ప్రణాళిక, వ్యాయామంతో ఇది సాధించవచ్చని ఆయన తెలిపారు. 35 కిలోల బరువు తగ్గిన ఏకాన్ష్ తన వెయిట్ లాస్ టిప్స్, ట్రిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఒక వారంలో 5 కిలోలు తగ్గడానికి కావాల్సిన డైట్ ప్లాన్ కూడా ఆయన తన ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నాడు.
ఏదేమైనా, త్వరగా బరువు తగ్గడం ఆరోగ్యకరమైనది కాదని మాత్రం గుర్తుంచుకోవాలని ఏకాన్ష్ తెలిపారు. బరువు తగ్గే సమయంలో వారి మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పద్దతిలోనే ప్లాన్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన పద్ధతిలో వారంలో సులువుగా మూడు నుంచి అయిదు కిలోలు తగ్గేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోండి.
ఒక వారంలో 5 కిలోలు తగ్గడం సవాలుతో కూడిన లక్ష్యం. కాబట్టి కష్టపడి పనిచేయడానికి ముందే సిద్ధ పడండి. దీనికోసం మీ ఆహారంలో మార్పులు చేయాల్సి వస్తుంది. ఏకాన్ష్ సూచించే డైట్ ప్లాన్ ఇక్కడ ఉంది
ఉదయం 6.30
⦿ సోంపు గింజల నీరు: ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ సోంపు గింజలను రాత్రంతా నానబెట్టండి. దాన్ని ఉదయాన్నే పరగడుపున వడకట్టి ఖాళీ పొట్టతో త్రాగాలి. దీని వల్ల జీర్ణక్రియకు మేలు జరగుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
అల్పాహారం: ఉదయం 8 గంటలకు
బ్రేక్ ఫాస్ట్‌లో అవోకాడో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఒక అవోకాడోను, నల్ల ఉప్పు, నిమ్మరసంతో కలిపి తినాలి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పిండి పదార్థాలు పూర్తిగా ఉండవు, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది.
⦿ అల్పాహారం తిన్నాక ఒక గంట గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగాలి.
మిడ్ మార్నింగ్ స్నాక్స్: ఉదయం 10.30
⦿ కీరదోసకాయ, పుదీనా డిటాక్స్ వాటర్: ఒక గ్లాసు కీరదోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు, చిటికెడు పింక్ సాల్ట్ వంటివి కలిపి దీన్ని తయారుచేయాలి. దీనిలో కేలరీలు పూర్తిగా సున్నా.
లంచ్: మధ్యాహ్నం 1 గంటకు
ఆలివ్ ఆయిల్ తో గుమ్మడికాయ నూడుల్స్: ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జును ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లో వేసి, వెల్లుల్లి, మిరపకాయలతో వేయించుకుని తినాలి.
⦿ గ్రీన్ సలాడ్: పాలకూర, దోసకాయ, కొన్ని బాదం పప్పులు, నిమ్మకాయ రసం చల్లుకుని తినాలి. దీనిలో తక్కువ కార్బో, తక్కువ ప్రోటీన్ మరియు హైడ్రేటింగ్.
⦿ సోంపు గింజల టీ: సోంపు గింజలను నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ నీటిని వడకట్టి ఆ నీళ్లను తాగాలి.
సాయంత్రం 4 గంటలు
సాయంత్రం కొబ్బరి నీరు తాగాలి. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.
⦿ కొబ్బరి నీళ్లు తాగడం కుదరకపోతే హెర్బల్ టీ తాగవచ్చు.
డిన్నర్: రాత్రి 7.30కు
వెజిటేబుల్ సూప్: ఉడికించిన పాలకూర, సెలెరీ, పుట్టగొడుగులతో తయారుచేసిన సూప తాగితే మంచిది. ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి తయారు చేసి ఈ సూప్ లో పిండి పదార్థాలు ఉండవు. ప్రోటీన్ తక్కువగా ఉంటుంది.
⦿ గ్రీన్ టీ: ఒక కప్పు గ్రీన్ తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది.
సోంపు దాల్చినచెక్క నీరు: సోంపు గింజలు, ఒక చిన్న దాల్చినచెక్క కర్రను నీటిలో మరిగించి ఆ నీటిని తాగేందుకు ప్రయత్నించండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ డైట్ తో ఒక గంట కార్డియో చేస్తే మంచిది. ఇలా తిని… వ్యాయామం చేస్తే వారంలో మీరు 5 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్