Best Web Hosting Provider In India 2024
OTT Love Thriller Movie: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన లవ్ థ్రిల్లర్ మూవీ.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్
OTT Love Thriller Movie: ఓటీటీలోకి ఓ లవ్ థ్రిల్లర్ మూవీ సడెన్‌గా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు ప్రేమించొద్దు. రెండు ఓటీటీల్లోకి ముందస్తు సమాచారం లేకుండా స్ట్రీమింగ్ కు రావడం విశేషం. మరి ఈ మూవీని ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.
OTT Love Thriller Movie: టీనేజ్ లవ్ థ్రిల్లర్ జానర్లో ఓ సరికొత్త మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం (జనవరి 10) నుంచి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీ రావడం విశేషం. శిరిన్ శ్రీరామ్ డైరెక్ట్ చేసి, నిర్మించిన ప్రేమించొద్దు అనే ఈ సినిమా.. థియేటర్లలో కొన్ని రోజులు ఆడిన తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది. అందులోనూ ఐదు భాషల్లో నిర్మితమైన పాన్ ఇండియా మూవీ ఇది.
ప్రేమించొద్దు ఓటీటీ స్ట్రీమింగ్
టీనేజ్ లవ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ప్రేమించొద్దు – డోంట్ లవ్. ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బీ సినీ ఈటీ (becineet) ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. శిరిన్ శ్రీరామ్ డైరెక్ట్ చేయడంతో పాటు మూవీకి నిర్మాతగానూ వ్యవహరించాడు. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానసలాంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్ తో, నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడం విశేషం. స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాను ‘బి సినీ ఈటీ’ (Bcineet) కంపెనీ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
ప్రేమించొద్దు.. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ
వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, బి సినీ ఈటీ లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ప్రేమించొద్దు- డోంట్ లవ్ మూవీని తెరకెక్కించాం. థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, బి సినీ ఈటీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేమించొద్దు సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి అదే కథ లో మార్పులు చేర్పులు చేసుకొని బేబీ సినిమా తీశారు. నా సినిమా కథను దొంగిలించారని తెలుగు సినిమా ‘బేబీ’ నిర్మాతలపై నేను పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ఫిర్యాదు చేసిన విషయం నా సర్కిల్లోని చాలా మందికి, అలాగే సినీ వర్గాల్లోని వారికి తెలుసు. నేను ఇప్పుడు కోర్టులో కేసును కొనసాగిస్తున్నాను. ఇలాంటి నేపథ్యంలో ప్రేక్షకుల సహకారం నాకెంతో అవసరం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నాడు.
సంబంధిత కథనం