Best Web Hosting Provider In India 2024
Anil Ravipudi: పెళ్లి అయ్యాక ఓపెన్‌గా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్
Director Anil Ravipudi About Sankranthiki Vasthunnam: పెళ్లి అయ్యాక ఫ్లాష్ బ్యాక్‌లు చెప్పి ఓపెన్‌గా ఉంటామంటే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయని అంటున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అనిల్ రావిపూడి.
Anil Ravipudi About Marriage Sankranthiki Vasthunnam: డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ తెలుగు మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
జనవరి 14న సంక్రాంతికి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా విలేకరుల సమావేశంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా, పెళ్లి, ఓపెన్‌గా ఉండటం వంటి విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ సజెషన్ ఎవరిది? సంక్రాంతికి రేసులోకి రావడానికే ఈ టైటిల్ అనుకున్నారా?
-కథ అనుకున్నప్పుడు ఫెస్టివల్ ఫిల్మ్ అనుకోని స్టార్ట్ చేశాం. వెంకటేష్ గారితో చేసిన ఎఫ్2 పొంగల్‌కి వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎఫ్3 కూడా పొంగల్‌కి రావాల్సింది. కానీ మిస్ అయింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్‌కి తీసుకొస్తే బావుటుందని సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం.
-కానీ, అప్పుడు అనౌన్స్ చేయలేదు. ఈ కథ ఒక రేస్క్యు ఆపరేషన్‌కి సంబధించింది. సెకండ్ హాఫ్‌లో నాలుగు రోజుల జర్నీ సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం‘ టైటిల్‌కి ఫిక్స్ అయ్యాం.
మీరు చేసిన ప్రమోషన్స్ చాలా వైరల్ అయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉండటానికి కారణం?
-కొవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే సరిపోదు. థియేటర్స్‌కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. ఈసారి సోషల్ మీడియాపై ఎక్కవ ఫోకస్ చేశాం. వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ దిగి సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ అయింది.
రమణగోగుల గారితో పాడించాలనే ఆలోచన ఎవరిది ?
-భీమ్స్ ఇచ్చిన గోదారి గట్టు ట్యూన్ వినగానే ఒక పెక్యులర్ వాయిస్‌తో పాడిస్తే బావుంటుదని అనుకుకొని రమణ గోగుల గారిని ఫస్ట్ ఆప్షన్‌గా ఎంచుకున్నాం. భీమ్స్ ఆయన్ని సంప్రదించి పాడించారు. ఈ క్రెడిట్ భీమ్స్‌కి దక్కుతుంది. రమణ గోగుల గారు కూడా తన మార్క్‌ని యాడ్ చేశారు. హిట్ సాంగ్ అనుకున్న పాట కాస్త ఈ రోజు గ్లోబల్ సాంగ్ అయ్యింది. 85 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసింది.
‘ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు’ అనే డైలాగు వెనుక ఉద్దేశం?
-జీవితంలో అందరికీ ఎదో ఒక గతం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రష్ ఉంటుంది. పెళ్లి అయినాక ఓపెన్‌గా ఉండాలని చెప్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ మొదలౌతాయి. అందుకే గతం జోలికి పోకుండా హాయిగా ప్రజెంట్‌లో ఉండటమే మంచిది (నవ్వుతూ).
దిల్ రాజు గారి బ్యానర్‌లోనే ఎక్కువగా చేయడానికి కారణం ?
-ఆయనతో నాకు పటాస్ సినిమాతో ట్రావెల్ ఉంది. నాకు ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్లతోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. దిల్ రాజు గారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీ. అల్మోస్ట్ పదేళ్ల జర్నీ.
సంబంధిత కథనం