Brahmamudi January 11th Episode: ధాన్యలక్ష్మీని ఇరికించిన కనకం- లైసెన్స్ గన్‌తో రుద్రాణి సూసైడ్- అనుకుంది సాధించిన కావ్య

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 11th Episode: ధాన్యలక్ష్మీని ఇరికించిన కనకం- లైసెన్స్ గన్‌తో రుద్రాణి సూసైడ్- అనుకుంది సాధించిన కావ్య

Sanjiv Kumar HT Telugu
Jan 11, 2025 07:45 AM IST

Brahmamudi Serial January 11th Episode: బ్రహ్మముడి జనవరి 11 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతానికి కావ్య నుంచి 20 లక్షల చెక్ తీసుకుంటుంది రుద్రాణి. అప్పుడే కనకం ఎంట్రీ ఇచ్చి ఎమోషనల్ డ్రామా చేసి స్వప్న సీమంతం పుట్టింట్లో జరిపించేందుకు అందరిని ఒప్పిస్తుంది. మరోవైపు అప్పుకు తను రాసిన పాట వినిపిస్తాడు కల్యాణ్.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 11వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 11వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్న సీమంతానికి కావాల్సినవి అంటూ హడావిడి చేస్తుంది రుద్రాణి. తనకు కోడలి మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టికొచ్చిందో అని ఇందిరాదేవి అంటే.. పంతానికి పోయి పళ్లు రాలగొట్టించుకోవడం అంటే ఇదేనేమో. అయినా బడ్జెట్ బయటపెట్టినప్పుడు ఇవ్వడానికి కావ్య ఒప్పుకోవాలి కదా అని అపర్ణ అంటుంది.

yearly horoscope entry point

లెక్కలు వేస్తుందంటావా

సొంత అక్క సీమంతానికి కూడా లెక్కలు వేస్తుందంటావా అని ఇందిరాదేవి అంటే.. కావ్య మనసులో ఏముందో, అసలు వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారో కావ్యకు, రాజ్‌కు, ఆ దేవుడికే తెలియాలి అని అపర్ణ అంటుంది. ఈ ఒక్క విషయంలో అయినా కావ్యను వాడు సపోర్ట్ చేస్తున్నాడు అని ఇందిరాదేవి అంటుంది. కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చెలా ఉంది. ఇంత అవసరమా అని రాజ్ అంటాడు. తను ఇలా ఎందుకు చేస్తుందో నాకు తెలుసు. మీరు కంగారుపడకండి. మా అక్క సీమంతం జరుగుతుంది. కానీ, రిచ్‌గా కాదు అని కావ్య అంటుంది.

ఏంటీ మొగుడు పెళ్లాలు చెవులు కొరుక్కుంటున్నారు అని రుద్రాణి అంటే.. కొబ్బరి చిప్పలు లేక. మా గురించి ఎందుకు మీరు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారుగా ఆ పనిలో ఉండండి అని కావ్య అంటుంది. కావ్య ఏమైనా ఫిటింగ్ పెడుతుందంటావా అని రాహుల్ అంటే.. అందరిముందు మాటిచ్చింది కదా. తప్పదురా అని రుద్రాణి అంటుంది. లిస్ట్ పూర్తయిందని రాహుల్ ఇస్తాడు. అది కావ్యకు ఇస్తూ మొత్తం బడ్జెట్ రూ. 20 లక్షలు అని రుద్రాణి చెబుతుంది.

దాంతో అంతా షాక్ అయితే స్వప్న మాత్రం సంతోషిస్తుంది. ప్రకాశం షాక్ అవుతూ అడిగితే.. మనకు ఒక్క రూపాయి ఇవ్వడంలేదు. ఆ 20 లక్షలు ఇస్తామని చెప్పనివ్వండి. తగులుకోడానికి నేనున్నాను కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. 20 లక్షలకు చెక్ కావాలని రుద్రాణి అంటే.. ఇస్తాను, ఇస్తాను. మీరు ముందే అడుగుతారని ఇక్కడే రాసి పెట్టాను. నేను కూడా 20 లక్షలు రాశాను. ఏవండి చెక్ ఇవ్వండి అని కావ్య అంటుంది. ఆ చెక్ నాలుక గీసుకోడానికి కూడా పనికిరాదని మనసులో అనుకున్న రాజ్ ఇస్తాడు.

నేచురల్ బ్యూటీని

ఇదిగోండి చెక్ తీసుకోండి అని రుద్రాణికి కావ్య ఇస్తుంది. ఇంతలో స్వప్న అంటూ కనకం ఎంట్రీ ఇస్తుంది. ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. అది ఎవరికీ అర్థం కాకా చూస్తుంటారు. నానమ్మా కాబోతున్న జుట్టుకు డై వేసుకోవడం మానలేదు. అందరూ ముసల్ది అనుకుంటారని భయమా అని కౌంటర్ వేస్తుంది కనకం. ఇది నా ఒరిజినల్ హెయిర్ కలర్. నేను నేచురల్ బ్యూటి అని మా కాలేజీలో అందరూ అనేవాళ్లు అని రుద్రాణి అంటుంది.

ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నేను కూడా బ్యూటీనేలేండీ అని కనకం అంటుంది. మా రుద్రాణి తన చేతులమీదుగా నీ కూతురు స్వప్న సీమంతం పెద్దగా చేయాలని చూస్తుంది అని అపర్ణ అంటుంది. దానిక నో అని పెద్దగా అరిచిన కనకం ఇక్కడ ఎలా జరుగుతుంది. మా సాంప్రదాయాన్ని మార్చుకునేది ఎలా. జీవితంలో పనికొచ్చే ఏ ఒక్క పని చేయని ఈ రుద్రాణి గారు ఇవాళ కోడలి సీమంతం చేయిస్తానని అనడం ఏంటీ. దాని వెనుక ఉన్న మర్మం, మతలబు ఏంటీ అని కనకం డ్రామా స్టార్ట్ చేస్తుంది.

అసలు మీరంతా ఎలా నమ్ముతున్నారు. నేను ఒప్పుకోను అని కనకం అంటే.. మా ఇంట్లో పేరంటానికి నీ పర్మిషన్ ఏంటీ అని రుద్రాణి అంటుంది. ఇప్పటికీ నేను స్వప్నకు తల్లినే. మా ఇంటి సాంప్రదాయం ప్రకారం. మా ఇంటి ఆచారం మా ఇంటి ఆడబిడ్డ కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి ఇబ్బంది లేకుండా పుట్టాలంటే పుట్టింట్లోనే సీమంతం చేయాలనేది మా పూర్వీకుల తీర్మానం. ఇది మా వంశ మూల పురుష శాసనం అని కనకం అంటుంది.

నా ఇంట్లోనే జరిపిస్తా

ఇదే నా ప్లాన్ అన్నట్లుగా కావ్య చూస్తే.. ఐడియా బాగుంది కానీ, మీ అమ్మ ఓవరాక్షనే చూడలేకపోతున్నాను అని రాజ్ అంటాడు. మేము గ్రాండ్‌గా చేయాలని చూస్తే ఆ ఇంట్లో సింపుల్‌గా జరిపిస్తావా అని రుద్రాణి ఫైర్ అవుతుంది. మీకు ఇంత ప్రేమ నా కూతురు మీద ఎలా పుట్టుకొచ్చింది. ఇక్కడ ఎవరైనా నిజంగా నమ్ముతున్నారా అని ఒక్కొక్కరిని అడిగితే.. ఎవరు లేదంటారు. నా కోడలు సీమంతం నా ఇంట్లోనే, నా వాళ్లమధ్యే జరిపిస్తా అని రుద్రాణి అంటుంది.

దాంతో కనకం ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మా ఇంటి ఆచారం మంటగలిసినట్లేనా. ఇంతమంది పెద్దలున్నారే నాకు న్యాయం చెప్పేవాళ్లే లేరా. ఈ విషయంలో న్యాయం ధాన్యలక్ష్మీ గారినే అడుగుతాను. ఆవిడ ఉన్నది ఉన్నట్లుగా నీతిగా, నిజాయితీగా మాట్లాడుతారు. మీరు చెప్పండి. బిడ్డ పుట్టకముందే ఇంత ఖర్చు అవసరమా. మీ ఇంటి అకౌంట్‌లో నుంచి 20 లక్షలు తీసి ఇంత దుబారా చేయడం అవసరమా. న్యాయం చెప్పండి అని గట్టిగా ఇరికిస్తుంది కనకం.

మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మాకు ఉన్నంతలో సింపుల్‌గా జరిపించడం అవసరమా. మీరే చెప్పండి అని వినయంగా అడుగుతుంది కనకం. దాంతో కచ్చితంగా మీ ఇంట్లో జరిపించడమే మంచిది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నిజంగా ఎంత గొప్ప మనసండి మీది. నాకు న్యాయం చెప్పారు. స్వప్న సీమంతం రేపు మా ఇంట్లోనే జరుగుతుంది. మాకున్న దాంట్లో పది, ఇరవై మందిని పిలిపించి జరిపిస్తాను. మా పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగిస్తాను అని కనకం అంటుంది.

ఓవరాక్షన్ చేస్తావ్

దాంతో రుద్రాణి, రాహుల్, స్వప్న ఒప్పుకోను అని అంటారు. వీళ్లకంటే తలకాయ, బుద్ధి లేదు. నీకేమైందే. లక్షలు ఖర్చు పెడితే సీమంతం జరిగినట్లు ఉండదా. పుట్టింట్లో జరిగితే చిన్నగా ఉంటుందా. ఈ కన్నతల్లి కడుపు తీపి నీకు అర్థం కావట్లేదా అని ఏడ్చినట్లు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. అందరూ ఒప్పుకున్నారుగా నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తావ్ అని స్వప్న అంటుంది. స్వప్న మీ వంశాచారం ప్రకారం మీ ఇంట్లో జరగడమే మంచిది. ఎందుకంటే పుట్టే బిడ్డ బాగుండాలి కదా. ఏమైనా జరిగితే తల్లిగా తట్టుకోలేవుగా అని ఇందిరాదేవి అంటుంది.

ఇక్కడ ఏదో జరుగుతుంది. కానీ, నాకు అది అర్థం కావట్లేదు అని స్వప్న అంటుంది. ఏం జరగట్లేదు. నీకు పుట్టబోయే బిడ్డకోసం మీ అమ్మ ఆరాటపడుతుంది అంతే అని అపర్ణ అంటుంది. సరేలే. నేను మాత్రం ఏమంటాను. కనీసం బారసాల అయినా ఇక్కడ జిరిపించండి అని స్వప్న అంటుంది. అలాగే, నువ్వైతే సంతోషంగా ఒప్పుకోమ్మా అని అపర్ణ అంటుంది. దానికి బలవంతపు నవ్వుతో స్వప్న సరే అంటుంది. రుద్రాణి గారు ఆ 20 లక్షల చెక్‌తో అవసరం లేదు కదా అని అడిగి తీసుకుంటుంది కావ్య.

రుద్రాణి కళ్ల ముందే ఆ చెక్‌ను మడతపెట్టి ముక్కలు చేస్తుంది కావ్య. రాజ్ చాలా రిలీఫ్‌గా చూస్తాడు. 20 నుంచి 10 లక్షలు నొక్కేద్దామనుకుంటే ఇలా జరిగిందే అని రాహుల్, ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అని రుద్రాణి ఫీల్ అవుతారు. మీరంతా మా ఇంట్లో జరిగే సీమంతానికి రావాలి అని కనకం చెబుతుంది. తర్వాత అందరూ రావాలని చెప్పి వెళ్లిపోతుంది కనకం. తనపై నెగ్గినట్లు రుద్రాణి వైపు గర్వంగా చూస్తుంది కావ్య. మరోవైపు రైటర్ లక్ష్మీకాంత్ చెప్పిన పాటను కల్యాణ్ రాస్తాడు. ఇంతలో అప్పు కాల్ చేస్తుంది.

అప్పుకు పాట వినిపించిన కల్యాణ్

నీ గురించే ఆలోచిస్తున్నాను అని కల్యాణ్ చెబితే అప్పు నమ్మదు. సెటైర్లు వేస్తుంది. రైటర్ లక్ష్మీకాంత్ పాట రాయమన్నది చెప్పిన కల్యాణ్ అప్పుకు పాట పాడి వినిపిస్తాడు. అది విన్న అప్పు కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతుంది. మనిద్దరి మధ్య ఉన్న దూరం నీకెంత బారంగా ఉందో ప్రతి అక్షరంలో తెలుస్తుంది అని చెబుతుంది అప్పు. కష్టం వస్తే అమ్మాయిలి బయటకు చెప్పుకున్నంతగా అబ్బాయిలు చెప్పుకోలేరు. నాకు ఈ పాటలో చెప్పుకోవాల్సి వచ్చింది అని కల్యాణ్ అంటాడు.

సరే నేను ఈ పాటను రైటర్‌కు పంపాలని కల్యాణ్ అంటే.. అప్పు ఐలవ్యూ చెబుతుంది. మరోవైపు అర్జంట్‌గా నాకు లైసెన్స్ గన్ కావాలని రుద్రాణి అంటే.. వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుందని చచ్చిపోదామనుకుంటున్నావా అని రాహుల్ అంటాడు. నిన్ను చంపి నేను జైలుకు వెళ్లాలని అనుకుంటున్నాను. ఇడియట్. మనం చావాలనుకుంటే ఎప్పుడో చావాలి. ఎందుకు బతికి ఉన్నామంటే ఏదో ఒక రోజు ఈ ఆస్తి మనది అవుతుందని, దాన్ని అనుభవించాలని అని రుద్రాణి అంటుంది.

మరి గన్ ఎందుకు మమ్మీ అని రాహుల్ అంటే.. మన ప్లాన్‌ను చెడగొట్టిన ఆ కనకాన్ని చంపేయడానికి. కావ్య నాకు చెక్ ఇచ్చింది. అనుకుంది సాధించొచ్చు అనుకున్నాం. ఐరన్ లెగ్‌లా అడుగుపెట్టి కనకం మొత్తం చెడగొట్టేసింది. అసలు ఆ ప్లాన్ ఆ పెంట మొహం కనకానిదా. లేదా ఈ పిట్ట మొహం కావ్యదా అని రుద్రాణి అంటుంది.

రుద్రాణి డౌట్

కావ్యదే అనిపిస్తుంది. తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టలేదన్నారు కదా. దాని గురించి ఓ విషయం తెలిసింది. అది చెక్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో కట్టారు అని రాహుల్ చెబుతాడు. క్యాష్ పే చేశారా అని రుద్రాణి అనుమానంతో ఆలోచనలో పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024