Best Web Hosting Provider In India 2024
Gunde Ninda Gudi Gantalu: మీనాకు క్రెడిట్ ఇచ్చిన శృతి – కొత్త కోడలికి ప్రభావతి మర్యాదలు – రోహిణి రివర్స్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో శృతికి మీనా దగ్గరవ్వడం ప్రభావతి సహించలేకపోతుంది. శృతి ముందు మీనాను తక్కువ చేసి మాట్లాడుతుంది. కానీ అత్త బిల్డప్పులకు శృతి చెక్ పెడుతుంది. మీనా వల్లే తాను అత్తింట్లో అడుగుపెట్టగలిగానని అంటుంది.
Gunde Ninda Gudi Gantalu: ఇంట్లో అడుగుపెట్టిన శృతి ప్రభావతికి షాకుల మీద షాకిస్తుంది. కుడికాలు అడుగుపెట్టి ఇంట్లోకి రమ్మని శృతిని ఆహ్వానిస్తుంది ప్రభావతి. ఏడమకాలు అడుగుపెడితే ఏమన్నా అవుతుందా అంటూ అత్తకు ఎదురు ప్రశ్నిస్తుంది శృతి. నడవటానికి రెండు కాళ్లు ఇంపార్టెంట్ కదా…ఏ కాలు అయితే ఏంటి అని అంటుంది. కోడలి మాటలకు ప్రభావతితో పాటు సత్యం షాకవుతారు.
కరెంట్ ఉందిగా…
శృతి చేత దేవుడి దగ్గర దీపం వెలిగించాలని ప్రభావతి అనుకుంటుంది. అత్త మాటలను శృతి తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇంట్లో కరెంట్ ఉన్నప్పుడు దీపం వెలిగించడం ఎందుకని అంటుంది. శృతి మాటలతో ఇంట్లో వాళ్లు అందరూ నవ్వుకుంటారు. ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు దీపం పెట్టడం ఆనవాయితీ అంటూ శృతికి సర్ధిచెబుతుంది ప్రభావతి. అత్త చెప్పినట్లే దీపం వెలిగిస్తుంది శృతి.
మీనా, శృతి క్లోజ్…
ఇంట్లో ఏం కావాలన్న తనను అడగమని శృతితో అంటుంది మీనా. అలాగేనని శృతి బదులిస్తుంది. శృతితో మీనా నవ్వుతూ మాట్లాడటం చూసి ప్రభావతి కంగారు పడుతుంది. శృతికి మీనా దగ్గరైతే తనకే నష్టమని అనుకుంటుంది. అలా జరక్కూడదని అనుకుంటుంది. శృతి, రవిని ఇంటికి తీసుకొచ్చింది తానేనని బిల్డప్‌లు ఇస్తుంది. మిమ్మల్ని కష్టపడి ఈ ఇంటికి తీసుకురాగలిగానని చెబుతుంది. ఇందులో మీరు చేసింది ఏముంది ఆంటీ…అంతా మీనానే చేసిందని చెప్పి ప్రభావతికి షాకిస్తుంది శృతి. మీనా ఏం చేసింది వంట మాత్రమే చేసిందని మీనాను శృతి ముందు తక్కువ చేయాలని ప్రయత్నిస్తుంది ప్రభావతి. కానీ అత్త మాటల్ని శృతి పట్టించుకోదు.
మీనాకు క్రెడిట్…
తాను రవి ఇక్కడికి రాగలిగామంటే కారణం మీనానే అని అంటుంది. ఇందులో మీరు చేసింది ఏమి లేదని ప్రభావతితో అంటుంది. క్రెడిట్ మొత్తం మీనాకే ఇస్తుంది. ప్రభావతి బిల్డప్పులు మొత్తం తుస్ మనడంతో మీనా నవ్వుకుంటుంది. శృతి తన ప్రతి మాటకు అడ్డుచెప్పడం ప్రభావతి సహించలేకపోతుంది. కానీ శృతి ఆస్తి, అంతస్తులను తనకు వచ్చే వరకు సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకుంటుంది.
అన్ని రివర్స్…
శృతిని మీనాకు దగ్గర కాకుండా చేయాలని ప్రభావతి ప్లాన్ వేస్తుంది. శృతి, రవి దృష్టిలో మీనాను విలన్‌గా చేయడానికి ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తుంది. కానీ అవన్నీ రివర్స్ అవుతుంటాయి. ప్రతి విషయంలో మీనాపైనే ఆధారపడుతూ ఆమెను సపోర్ట్ చేస్తుంటుంది. మరోవైపు శృతికి ప్రభావతి ఇంపార్టెన్స్ ఇస్తూ తమను పట్టించుకోకపోవడం మనోజ్, రోహిణి కూడా సహించలేకపోతారు.
బాలుకు షాక్…
బాలు ఇంట్లో లేని టైమ్‌లో రవి, శృతి ఇంట్లో అడుగుపెడతారు. ట్రిప్ ముగించుకొని ఇంటికొచ్చిన బాలు నిజం తెలిసి ఏం చేశాడు? సత్యం ఇంట్లో గొడవలు సృష్టించాలని సురేంద్ర, శోభన వేసిన పథకం ఏమిటి అన్నది తెలియాలంటే సోమవారం నాటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ చూడాల్సిందే.