Best Web Hosting Provider In India 2024
Game Changer Day 1 Collections: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ – రికార్డులు అనుకుంటే సీన్ రివర్స్
Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా శుక్రవారం ఈ మూవీ 51 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ అత్యధికంగా 42 కోట్ల కలెక్షన్స్‌ను దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
Game Changer Day 1 Collections: గేమ్ ఛేంజర్ మూవీ తొలి రోజే కలెక్షన్స్ విషయంలో అంచనాల్ని అందుకోలేక డీలా పడింది. రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావించారు. పుష్ప 2తో పాటు పలు సినిమాల రికార్డులను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తొలిరోజే సినిమాపై దారుణంగా నెగెటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై గట్టిగానే పడింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా గేమ్ ఛేంజర్ మూవీ 51 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
తెలుగులో 42 కోట్లు…
మొదటి రోజు గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ అత్యధికంగా 42 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. హిందీ వెర్షన్‌కు ఏడు కోట్లు,తమిళ వెర్షన్ రెండు కోట్ల పది లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కన్నడ, మలయాళంలో గేమ్ ఛేంజర్ మూవీ దారుణంగా నిరాశపరిచింది. రెండు భాషల్లో కలిపి ఈ మూవీ లక్షన్నర నుంచి రెండు లక్షల లోపే వసూళ్లను దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
వంద కోట్లు అనుకుంటే…
రామ్ చరణ్, శంకర్ కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా తొలిరోజు 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందులో సగం కూడా గేమ్ ఛేంజర్ వసూళ్లను రాబట్టలేకపోయింది.