Best Web Hosting Provider In India 2024
OTT Malayalam Movies: ఓటీటీల్లో లేటెస్ట్ మలయాళం చిత్రాలు చూడాలనుకుంటున్నారా? రీసెంట్గా వచ్చిన నాలుగు సినిమాలు
OTT Latest Malayalam Movies: ఓటీటీల్లోకి ఇటీవల కొన్ని చిత్రాలు అడుగుపెట్టాయి. ఇంట్రెస్టింగ్ చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అలా రీసెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు మలయాళం చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
ఓటీటీల్లోకి రీసెంట్గా ఏ మలయాళ చిత్రాలు వచ్చాయా అని చాలా మంది చూస్తుంటారు. ఆ రేంజ్లో ఓటీటీల్లో మలయాళ సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ఇతర భాషల ప్రేక్షకులు కూడా మలయాళ చిత్రాల కోసం ఎదురుచూస్తుంటారు. మంచి బజ్ ఏర్పడిన చిత్రాలకు స్ట్రీమింగ్లోనూ మంచి ఆదరణ దక్కుతుంది. రీసెంట్గా మరికొన్ని మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో నాలుగు ముఖ్యమైన చిత్రాలు ఏవంటే..
సూక్ష్మదర్శిని
సూక్షదర్శిని చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. సోషల్ మీడియాలోనూ ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం గురించి మంచి బజ్ నడిచింది. నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 22వ తేదీన రిలీజ్ అయింది. దీంతో సూక్ష్మదర్శిని ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అనే ఎదురుచూపులు ఎక్కువగా రోజులు కొనసాగాయి. ఎట్టకేలకు ఈ చిత్రం డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. నేడే ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.
డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సూక్ష్మదర్శిని చిత్రం స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి ఎంసీ జతిన్ దర్శకత్వం వహించారు. కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఉన్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ దక్కించుకుంది. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ సుమారు రూ.60కోట్ల వసూళ్లతో బ్లాక్బస్టర్ అయింది. ఈ చిత్రానికి క్రిస్టో గ్జేవియర్ సంగీతం అందించారు.
కడకన్
మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కడకన్’ గతేడాది 2024 మార్చిలోనే థియేటర్లలో రిలీజ్ అయింది. హకీమ్ షాజహాన్ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ చిత్రం కోసం కూడా రిలీజ్ కోసం చాలా రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు గత వారమే కడకన్ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి సాజిల్ మాంపాడ్ దర్శకత్వం వహించగా.. గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం థియేటర్లలోనూ హిట్గా నిలిచింది.
ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్
ఆల్ వీ ఇమాజిన్ లైట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమైంది. ప్రశంసలు పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలిచింది. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ మలయాళ డ్రామా మూవీ గత వారం జనవరి 4న డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ మలయాళ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కని కశ్రుతి, దివ్య ప్రభ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ముంబైలో నివసించే ఇద్దరు నర్సుల జీవితం చుట్టూ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం సాగుతుంది. ఈ మూవీని హాట్స్టార్ ఓటీటీలో చూసేయండి.
పొంబలై ఒరుమై
మలయాళ సోషల్ డ్రామా మూవీ పొంబలై ఒరుమై చిత్రం గతేడాదిలోనే థియేటర్లలో గతేడాది రిలీజ్ అయింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఆలస్యమైంది. గత వారం ఈ చిత్రం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ మూవీలో శ్రీష్మ చంద్రన్, జితేశ్ పరమేశ్వర్, శిల్ప అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం