Best Web Hosting Provider In India 2024
Game Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ
Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ వెల్లడించింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మరో రచ్చ షురూ అయింది. ఈ విషయంలో హ్యాష్‍ట్సాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ శుక్రవారం (జనవరి 10) థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చింది. ఈ మూవీకి మొదటి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల లెక్కను మూవీ టీమ్ నేడు (జనవరి 11) వెల్లడించింది. వసూళ్లతో ఓ పోస్టర్ తీసుకొచ్చింది.
తొలి రోజు కలెక్షన్లు ఇలా..
గేమ్ ఛేంజర్ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందంటూ మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. హెలీకాప్టర్ నుంచి చెర్రీ కత్తి దూస్తున్న పోస్టర్‌తో ఈ వసూళ్ల లెక్కను వెల్లడించింది.
కలెక్షన్లు తప్పు అంటూ రచ్చ
గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్లను మూవీ టీమ్ పెంచేసి చూపిస్తోందని కొందరు నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. గేమ్ ఛేంజర్ పోస్టర్ స్కామ్ అంటూ ఓ హ్యాష్‍ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బుకింగ్స్ ట్రెండ్ చూస్తే.. ఈ చిత్రానికి ఫస్ట్ డే అంత మొత్తం వచ్చి ఉండదని.. కావాలనే ఎక్కువ వచ్చినట్టు చెబుతున్నారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది కాస్త రచ్చ మారింది. ఈ కలెక్షన్లు సరికాదంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు.
తిప్పికొడుతున్న చెర్రీ ఫ్యాన్స్
ఈ విషయంపై కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల లెక్క సరికాదంటూ చేస్తున్న ఆరోపణలను రామ్‍చరణ్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. కావాలనే ఈ మూవీకి నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రానికి తొలి రోజు భారీగా బుకింగ్స్ జరిగాయని, ఆ కలెక్షన్లు నిజమేనంటూ పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ రెండు పాత్రలు పోషించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కియారా అడ్వానీ, అంజలి ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్స్ చేశారు. ఎస్‍జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‍తో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. తిరుణావకురసు సినిమాటోగ్రఫీ చేశారు.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన తీరుపై మిక్స్డ్ టాక్ వస్తోంది. కొత్తదనం లేదనే కామెంట్లు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఈ చిత్రం సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది.
సంబంధిత కథనం
టాపిక్