Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం
తాడేపల్లి: భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన వడ్డె ఓబన్న.. వీరత్వానికి మారుపేరు అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకం నారాయణమూర్తి, వడ్డెర నాయకులు వేముల శివ, బేబీ రాణి, గుండెల్ల ఏడుకొండలు, బత్తుల ఈశ్వరి, ఇర్ల రవిచంద్ర, వేముల ఏసుదాసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పార్టీ నేతలు స్మరించుకున్నారు.
ఓబన్న పోరాట స్ఫూర్తి ఆదర్శప్రాయం
వడ్డె ఓబన్న పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన సైన్యానికి వడ్డే ఓబన్న అధ్యక్షుడుగా ఉండేవారని, బలహీన వర్గాల్లో పుట్టిన ఓబన్న స్వాతంత్య్రం కోసం పోరాడారని, ఎన్నో సాహసోపేతమైన పోరాటాలకు నేతృత్వం వహించారని స్మరించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు ఓబన్న ఆని, ఆయన ఒక గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు.
వడ్డెరలకు వైయస్ఆర్‌సీపీలో అధిక ప్రాధాన్యత
వడ్డెరలకు వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదని, వడ్డెరను తొలిసారి గుర్తించి, ప్రోత్సహించిన ఘనత నాడు వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారిదని అప్పిరెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత వడ్డెరలకు ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన ఘనత వైయస్ జగన్‌దే అన్నారు. మళ్లీ వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే వడ్డెరలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
వడ్డెర్లను చంద్రబాబు విస్మరించారు: వడ్డెర నేత వేముల శివ
రాజకీయాల్లో తనంత సీనియర్ లేడని పదే పదే చెప్పుకునే సీఎం చంద్రబాబు..వడ్డెర్లను పూర్తిగా విస్మరించారని వడ్డెర నేత వేముల శివ విమర్శించారు. ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతి నిర్వహించడమే కాకుండా, ఆ వర్గం వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. నిజానికి ఒక్క వైయస్ జగన్‌గారే తమను గుర్తించి, ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, తమ వర్గంలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించారని వెల్లడించారు. తమకు కేవలం వైయస్ జగన్‌గారి వల్లనే న్యాయం జరిగిందని వేముల శివ చెప్పారు.